Friday, May 17, 2024

12 రాష్ట్రాల‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్ లు…మ‌హ‌రాష్ట్ర‌, ఎపిల‌కు కొత్త వారికి ఛాన్స్

న్యూఢిల్లీ – ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర సహా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలితప్రాంతానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన గవర్నర్లను నియమించారు. మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ, లడఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కృష్ణన్‌ మాథుర్‌ రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించారు. అదేవిధంగా మరికొన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లను ఇతర రాష్ట్రాలకు పంపించారు. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను నియమించగా, ప్రస్తుత గవర్నర్‌ బిస్వభూషన్‌ హరిచందన్‌ కోశ్యారీని ఛత్తీస్‌గఢ్‌కు పంపించింది. మహారాష్ట్ర గవర్నర్‌గా రమేశ్‌ బైస్‌ను నియమించింది. వీరితోపాటు ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌, హిమాచల్‌ప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ గవర్నర్లకు స్థానచలనం కలిగింది.


కొత్త గవర్నర్లు..
అరుణాచల్‌ ప్రదేశ్‌- లెఫ్టినెంట్‌ జనరల్‌ కైవల్య త్రివిక్రమ్‌ పర్నాయక్‌
సిక్కిం- లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య
జార్ఖండ్‌- సీపీ రాధాకృష్ణన్‌
హిమాచల్‌ప్రదేశ్‌- శివ్‌ప్రతాప్‌ శుక్లా
అసోం- గులాబ్‌ చంద్‌ కటారియా
ఆంధ్రప్రదేశ్‌- రిటైర్డ్‌ జస్టీస్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌
ఛత్తీస్‌గఢ్‌- బిస్వభూషణ్‌ హరిచందన్‌
మణిపూర్‌- అనసూయ
నాగాలాండ్‌- గణేషన్‌
మేఘాలయా- ఫగు చౌహాన్‌
బీహార్‌- రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌
మహారాష్ట్ర- రమేశ్‌ బైస్‌
లడఖ్‌- బీడీ మిశ్రా

Advertisement

తాజా వార్తలు

Advertisement