Friday, April 26, 2024

విక్ర‌మ్ కి వంద రోజులు-వాయిస్ ట్వీట్ చేసిన క‌మ‌ల్ హాస‌న్

విక్ర‌మ్ మూవీ జూన్ 3న రిలీజ్ అయి ఇండియ‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌నాలు సృష్టించింది.ఈ చిత్రాన్ని లోకేష్ క‌న‌గ‌రాజ్ తెర‌కెక్కించాడు. నాలుగేళ్ళ త‌ర్వాత హీరో క‌మ‌ల్ హాస‌న్ వెండితెర‌పై క‌నిపించ‌డంతో అభిమానులు సంబురాలు చేసుకున్నారు. అందులో అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ సినిమాను చేయ‌డంతో ఫ్యాన్స్ సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి. తాజాగా ఈ చిత్రం 100రోజులు పూర్తి చేసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రం అన్ని భాష‌ల్లో క‌లిపి దాదాపు రూ.450కోట్లకు పైగా క‌లెక్ష‌న్‌ల‌ను సాధించింది. తెలుగులో ఈ చిత్రానికి దాదాపు రూ.18 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్‌లు వ‌చ్చాయి.

దీంతో విక్ర‌మ్ సినిమాకు తెలుగులో రూ.10కోట్ల‌కు పైగానే ప్రాఫిట్స్ వ‌చ్చాయి. హీరో నితిన్ శ్రేష్ఠ్‌ మూవీస్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని విడుద‌ల చేశాడు. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో మ‌ల‌యాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్‌, తమిళ స్టార్ విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సూర్య రోలెక్స్ పాత్ర‌లో 5 నిమిషాలు మెరిసాడు. సూర్య పాత్ర సినిమాకే హైలేట్ అని చెప్ప‌వ‌చ్చు. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై ఆర్. మహేంద్ర‌న్‌తో క‌లిసి క‌మ‌ల్ స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించాడు.విక్ర‌మ్ మూవీ వంద రోజులు పూర్తయిన క్ర‌మంలో క‌మ‌ల్ ఓ వాయిస్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement