Saturday, April 27, 2024

ఆమె జీతం 30వేలే – అక్ర‌మ సంపాద‌న రూ.10 కోట్ల పైనే

భోపాల్ – మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఓ ప్రభుత్వ కాంట్రాక్ట్‌ ఉద్యోగిని ఆస్తులు చూసి అధికారులు షాక్‌ అయ్యారు. నెల‌కు 30వేల రూపాయిలు జీతం తీసుకుంటున్న ఓ మ‌హిళా ఉద్యోగి ఏకంగా రూ 30 కోట్ల పైగా ఆస్తులు సంపాదించ‌డం విశేషం.. వివ‌రాల‌లోకి వెళితే మధ్యప్రదేశ్‌ రాష్ట్ర పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్ లో కాంట్రాక్టు ఇన్‌ఛార్జి అసిస్టెంట్‌ ఇంజినీర్ గా పనిచేస్తున్న హేమ మీనా ఇంట్లో లోకాయుక్త అధికారులు సోదాలు చేపట్టారు.. భోపాల్ లోని హేమా మీనా నివాసంలో లోకాయుక్త గురువారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.10 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. ఇందులో 7 లగ్జరీ కార్లు, విలువైన గిర్‌ జాతికి చెందిన రెండు డజన్ల పశువులతోపాటు రూ.30 లక్షల విలువ చేసే 98 ఇంచెస్‌ అత్యాధునిక టీవీని అధికారులు గుర్తించారు. హేమా తన తండ్రి పేరుమీద 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలం కొనుగోలు చేసి అందులో రూ.కోటి వెచ్చించి విలాసవంతమైన ఇంటిని నిర్మించినట్లు గుర్తించారు. వీటితోపాటు ఇతర ప్రాంతాల్లో స్థలాలు కూడా కొనుగోలు చేసినట్లు తేల్చారు. ఆమె నివాస ప్రాంగణంలో 100 కుక్కలు, పూర్తి వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్‌, మొబైల్‌ జామర్‌లు, ఇతర విలువైన వస్తువులను కూడా అధికారుల సోదాల్లో బయటపడ్డాయి. అంతేకాకుండా సుమారు 20 వాహనాలు హేమా మీనా కొనుగోలు చేసినట్లు అధికారులు తమ విచారణలో గుర్తించారు. అందులో ట్రాక్టర్లు, వరి నాట్లు యంత్రాలు, హార్వెస్టర్లు, అనేక వ్యవసాయ పరికరాలు ఉన్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement