Saturday, May 4, 2024

హైదరాబాద్ : ప్రముఖ రచయిత్రి సీ ఆనందారామం కన్నుమూత

 ప్రముఖ రచయిత్రి సి.ఆనందరామం కన్నుమూశారు.  హైదరాబాద్ లో గుండెపోటుతో ఆమె ఈ ఉదయం కనుమూశారు. ఆమె అసలు పేరు ఆనంద లక్ష్మి. భర్త రామం పేరు తన పేరు చివర జోడించి రచయిత్రి సి.ఆనందారామంగా తెలుగు సాహిత్య లోకంలో రాణించారు. ఆగస్టు 20వ తేదీ 1935వ సంవత్సరం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. సీ. ఆనందారామం 60 నవలలు, 100కు పైగా కథలు, కొన్ని విమర్శనా గ్రంథాలు రాశారు. ఆమె రాసిన నవల ఆత్మబలి …సంసార బంధం సినిమాగా, అదే నవల జీవన తరంగాలు టీవీ సీరియల్‌గా వచ్చింది. జాగృతి నవలను త్రిశూలం సినిమాగా, మమతల కోవెల నవలను జ్యోతి సినిమాగా తీశారు. తన రచనా వ్యాసంగానికి గాను ఆమె 1972లో గృహలక్ష్మి స్వర్ణకంకణం లభించింది.  మాలతీ చందూర్ స్మారక అవార్డు -2013, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు – 1979 (తుఫాన్ నవలకు), మాదిరెడ్డి సులోచన బంగారు పతకం – 1997, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు – రెండు పర్యాయాలు, సుశీలా నారాయణరెడ్డి పురస్కారం,గోపీచంద్ పురస్కారం,
అమృతలత జీవన సాఫల్య పురస్కారాలు ఆమెను వరించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement