Friday, May 3, 2024

ముంబై : నీరవ్ మోడీ కోసం జైలు సిద్ధం

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను మోసం చేసిన లండన్‌లో జైలు జీవితం గడుపుతున్న వజ్రాల వ్యాపారం నీరవ్‌ మోడీ కోసం భారత్‌లో జైలు ఎదురుచూస్తోంది. మనీల్యాండరింగ్‌ కేసుల్లో భాగంగా నీరవ్‌ మోడీని భారత్‌కు అప్పగించాలని లండన్‌ కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ముంబైలోని ఆర్థర్‌ రోడ్‌ జైలులో నీరవ్‌ మోడీ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. నీరవ్‌ను ముంబై తీసుకొచ్చాక ఉంచేం దుకు జైలులో ఏర్పాట్లు సిద్ధమయ్యా యని ఆర్థర్‌ జైలు అధికారి ఒకరు వెల్లడించా రు. నీరవ్‌ మోడీ కోసం ప్రత్యేక సెల్‌ను సిద్ధం చేశామని అధికారి వివరించా రు. నీరవ్‌ మోడీని ముంబై తీసుకొచ్చాక అధిక భద్రత ఉండే బ్యారక్‌ నంబర్‌ 12లోని మూడు సెల్స్‌లో ఒకదాంట్లో ఉంచుతామని ఆయన చెప్పారు. నీరవ్‌ మోడీ బసకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎప్పుడు పంపిస్తే అప్పుడు జైలులో ఉంచేందుకు సెల్‌ సిద్ధమైందని ఆయన పేర్కొన్నారు. కాగా నీరవ్‌ మోడీని భారత్‌కు అప్పగించాలంటూ లండన్‌ డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. మనీల్యాండరింగ్‌ కేసుల్లో భారత్‌ అప్పగించిన సాక్ష్యాధారాలపై న్యాయమూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. నీరవ్‌ మోడీ భారత న్యాయస్థానాలకు సమాధానం చెప్పాల్సి ఉందని కోర్ట్‌ పేర్కొంది. కాగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను దాదాపు రూ.14 వేల కోట్ల మేర మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీ లండన్‌ పారిపోయాడు. భారతీయ దర్యాప్తు ఏజెన్సీలు సీబీఐ, ఈడీల సుధీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు భారత్‌కు అప్పగించేందుకు లైన్‌ క్లియర్‌ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement