Monday, May 6, 2024

బెంగళూరు : 90% మంది ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం

90శాతం మంది ఐటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోం కొనసాగిస్తు న్నారని ఐటీ దిగ్గజం అజీమ్‌ ప్రేమ్‌జీ తెలిపా రు. లాక్‌డౌన్‌ ప్రారంభమైన తొలి కొన్ని వారాల్లోనే ఐటీ రంగం దీనికి శ్రీకారం చుట్టిందన్నారు. కరోనా ప్రభావం కొంత వరకు తగ్గిన తరువాత కూడా.. పలు కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోంనే కొనసాగిం చడంపై ప్రభుత్వం ప్రశంసించిందని గుర్తు చేశారు. వర్క్‌ ఫ్రం హోం ఎంతో ప్రయోజనాన్ని కలిగి ఉంటుందన్నారు. సమగ్ర అభివృద్ధిని, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి మంచి భాగస్వా మ్యా న్ని అందు కోవచ్చన్నారు. వర్క్‌ ఫ్రం హోం అనేది.. ముఖ్యం గా గృహి ణులు ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని తెలిపారు. టెక్నాలజీ అనేది తమకు ఓ లైఫ్‌లైన్‌ అని, ఇది వ్యక్తిగతం గానూ.. వ్యాపారంగానూ ఎంతో దోహదం చేస్తోందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చే పథకాల్లో కూడా సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement