Sunday, April 28, 2024

ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్‌కు చేదు అనుభవం

టాలీవుడ్‌లో తన పాటలతో యూత్‌ను హుషారెత్తిస్తున్న సిద్ శ్రీరామ్‌కు హైదరాబాద్‌లో చేదు అనుభవం ఎదురైంది. జూబ్లీహిల్స్ రోడ్ నం 10లో ఉన్న ఓ ప్రముఖ పబ్‌కు సిద్ శ్రీరామ్ వెళ్లాడు. కొన్ని రోజుల కింద ఓ ఈవెంట్ కోసం ప్రముఖులతో కలిసి వెళ్లిన అతడికి అక్కడ అవమానం జరిగినట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో కొందరు ఆకతాయిలు సిద్ శ్రీరామ్‌పై మద్యం, నీళ్లు విసిరారని.. దీంతో అతడికి కోపం వచ్చి గెటవుట్ అంటూ వార్నింగ్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. అక్కడున్న పబ్ యాజమాన్యం వెంటనే జోక్యం చేసుకుని ఈ గొడవను ఆపేశారని సమాచారం. ఈ ఘటన జరిగిన సమయంలో పబ్‌లో చాలా మంది ప్రముఖులు ఉండటంతో ఈ గొడవను పోలీసుల వరకు వెళ్లకుండా పబ్ యాజమాన్యం అడ్డుకున్నారట. అందుకే తన ట్విట్టర్‌లో క్రమశిక్షణ గురించి లేటెస్టుగా సిద్ శ్రీరామ్ ఓ పోస్ట్ చేసాడు. అన్నింటికంటే క్రమశిక్షణ అనేది ముఖ్యమంటూ ట్వీట్ చేశాడు. అది ఉన్న‌ప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement