Saturday, April 27, 2024

‘కేసీఆర్’ బర్త్ డే సందర్భంగా డాక్యుమెంటరీ

బందూక్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు లక్ష్మణ్ ఓ డాక్యుమెంటరీ చిత్రాన్ని తెరకెక్కించారు.బందూక్  చిత్రంతో విమర్మశకుల మన్నలను పొందిన దర్శకుడు లక్ష్మణ్ మురారి, కెసిఆర్ 67 వ పుట్టిన రోజును పురస్కరించుకుని కేసీఆర్- నువ్వే ఒక చరిత్ర అనే డాక్యుమెంటరి సినిమాను విడుదలచేస్తున్నారు, తెలంగాణ బ్రీత్ లేస్ సాంగ్, 18 మంది మేటి గాయకులతో వీరాధి వీరుడు పాట, ఇలా ఎప్పుడూ ప్రయోగాలను ఛాలెంజ్ గా తీసుకునే దర్శకుడు లక్ష్మణ్, తాజాగా కేసీఆర్- నువ్వే ఒక చరిత్ర డాక్యుమెంటరీలో 1964-68 నాటి కెసిఆర్ చదివిన దుబ్బాక గవర్నమెంట్ స్కూల్  ను 3డీ విజువల్ ఎఫెక్ట్స్ లో రి క్రియేట్ చేసారు, స్కూల్ లో చదువుతున్నప్పుడు కెసిఆర్ పాడిన పాటను అచ్చం అప్పుడు 1964లో పాడినట్లుగా చిత్రించి, బహుమతి గెలుచుకున్న బాలుడు కేసిఆర్ ను 3D విజువల్ ఎఫెక్ట్స్, Motion Capture Technology(మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ)తో చిత్రీకరించారు.కేసిఆర్ స్కూల్ లో చదివేటప్పుడు భీష్మ ద్రోణ కృపాధి దన్వి నికారచలంబు అనే కఠినమైన మహా భారతం లోని పధ్యాలు పాడి బహుమతులు గెలుచుకున్నారు.చాలా రోజులుగా దుబ్బాక, చింతమడక గ్రామాలకు వెళ్లి అక్కడి ప్రస్తుత పరిస్థితులను, చూసి 60 ఏళ్ల క్రింతం ఎలా వుండేదో ఊహించుకొని, 3D ఆర్ట్స్ లో చిత్రాలు గీహించి, గ్రాఫికల్ వర్క్ నీ పూర్తి చేశారు.కెసిఆర్ గారి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు, ఉద్యమాలు, వాటి ఫలితాలు, విజయాలు, ప్రస్తుత అభివృద్ధికి కారణమైన కెసిఆర్ మనో గతాన్ని వివరించారు, ఇందులో 2 బిట్ సాంగ్స్ కూడా వున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement