Sunday, April 28, 2024

అమరావతి : కరోనా టీకాకు ఏపీలో మిశ్రమ స్పందన

అమరావతి, ఆంద్రప్రభ : రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు మిశ్రమ స్పందన లభిస్తోంది. గడిచిన 27 రోజులుగా రాష్ట్రంలో కరోనా టీకా కార్య క్రమం జరుగుతున్నా.. ఆశించిన స్థాయిలో లబ్ధిదారు లు ముందుకు రావడం లేదు. దేశ వ్యాప్తంగా జరుగు తున్న ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్‌ మొదటి స్థానం లో ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌ ఎనిమిదవ స్థానంలో ఉంది. ఈ 27 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల 35 వేల మందికి మాత్రమే కరోనా టీకా వేశారు. ఒకవైపు వ్యాక్సిన్‌పై వైద్య ఆరోగ్య శాఖ ఎంతగా ప్రచారం నిర్వ హిస్తున్నప్పటికీ, టీకా వేయించుకోవడానికి వచ్చే లబ్ధి దారుల సంఖ్య మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. ఇప్పటికే రెండవ దశ టీకా కార్యక్రమం జరుగుతు న్నా.. మొదటి దశలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఇంకా అధిగమించలేదు. తొలి విడతలో ఫ్రంట్‌ లైన్‌ వారి యర్స్‌ అగ్రభాగాన ఉన్న వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా, అంగన్‌ వాడీ వర్కర్లకు టీకా వేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో 3 లక్షల 74 వేల పైచిలుకు ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య సిబ్బంది, ఆశా, అంగన్‌ వాడీ వర్కర్లకు వేయాల్సి ఉండగా.. రెండో విడత ప్రారంభమైనా ఈ లక్ష్యం పూర్తి కాలేదు. దీనికి ప్రధాన కారణం వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలు, ఆందో ళనలే అని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. వ్యాక్సిన్‌ సురక్షితమైందని ఎటువంటి ఆందోళన లేకుండా వేయించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తోంది.
వ్యాక్సిన్‌ కేంద్రాలను రోజు రోజుకీ గణనీయంగా పెంచుతున్నప్పటికీ ఫలితాలు మాత్రం పూర్తి స్థాయి లో ఉండటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 800 నుంచి వెయ్యికి పైగా వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న ప్పటికీ లబ్ధిదారులు పెద్దగా ముందుకు రావడం లేదు. మరోవైపు కొన్ని చోట్ల వ్యాక్సిన్‌ వేయించుకున్న వారు అస్వస్థతకు గురి కావడం, శ్రీకాకుళం, గుంటూ రు జిల్లాల్లో రెండు మరణాలు నమోదు కావడంతో టీకా వేయించుకునే వారిలో కొంత ఆందోళన నెల కొంది. ప్రజలకు వైద్య ఆరోగ్య సిబ్బందిలో మనో ధైర్యాన్ని నింపేందుకు ఉన్నతాధికారులే స్వయంగా టీకా వేయించుకున్నప్పటికీ పెద్దగా ఫలితం లేకుండా పోయింది. కాగా రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఒకవైపు జరుగుతున్న నేపథ్యంలో మరో
వైపు గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా రావడం కొంత ఇబ్బందికరంగా మారింది. ఉన్నతాధికారు లు, జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణలో బిజీ బిజీగా ఉన్నారు. ఈ ప్రభావం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పై కొం త వరకు చూపుతోందని చెప్పవచ్చు. రెండో విడత వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సిన లబ్ధిదారులు ఎన్నికల విధుల్లో ఉండటంతో టీకా వేయించుకునే పరిస్థితి లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement