Friday, April 19, 2024

జేసీ బ్రదర్స్ కు హైకోర్టులో చుక్కెదురు

గడువు తీరిన వాహ నాల రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు హైకోర్టు ఝలక్‌ ఇచ్చింది. సుప్రీంకోర్టు నిషేధిం చిన బీఎస్‌-3 వాహనాలను అశో కా లేలాండ్‌ సం స్థ నుంచి స్క్రాప్‌ గా కొనుగోలు చేయటంతో పాటు ఆ వాహనాలను బీఎస్‌-4 వాహనా లుగా సృష్టించారని ఈ మొత్తం ప్రక్రి యలో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించ టంతో పాటు తిప్పేందుకు పనికిరాని వాహనాలను రోడ్లపైకి తెచ్చారని జేసీ కుటుంబ సభ్యులపై ఆరోపణ లు వచ్చాయి. ఫిర్యాదుల ఆధారంగా వివిధ పోలీస్‌ స్టేషన్లలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన సతీమణి జేసీ ఉమారెడ్డి, కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిపై సుారు 46 కేసులు నమోదయ్యాయి. వీటన్నింటినీ ఒకే కేసుగా పరిగణించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ గత ఏడాది జేసీ కుటుంబ సభ్యులు హైకోర్టులో పిటిష న్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సింగిల్‌ జడ్జి జస్టిస్‌ కొంగల విజయలక్ష్మి విచారణ జరిపారు. ప్రభుత్వం తరుపున అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌ శ్రీరాం, పిటిషనర్ల తరుపున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకట రమణ వాదనలు వినిపించారు.
అనంతపురం, తాడిపత్రి టౌన్‌, రూరల్‌, ఓర్వకల్‌, పెద్దపప్పూరు పోలీస్‌ స్టేషన్లలో జేసీ కుటుంబ సభ్యులపై కేసులు నమోదయ్యా యి. వీటిని ఒకే కేసుగా పరిగణించి ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా కోరుతూ జేసీ, కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. వీటిని ఒకే కేసుగా పరిగణించడం సాధ్యపడ దని, ఒక్కో కేసుతో ఒక్కో నేరం ముడిపడి ఉందని కోర్టు అభిప్రాయ పడింది. ప్రతి కేసు వేర్వేరు ప్రాంతా లు..వ్యక్తులు.. నేరాలు.. ఆరోపణలతో ఒకదానికి మరొకటి సంబంధంలేనిదిగా ఉందని వేర్వేరు ప్రాం తాల్లో వాహనాలు, వాహనాలు రిజిస్ట్రేషన్లు జరిగిన ప్రాంతాలు.. ఇందులో ప్రమేయం ఉన్న వ్యక్తులు వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు కావడంతో ఒకే కేసుగా పరిగణించడం సాధ్యపడదని తేల్చిచెప్పింది. జకీర్‌ హుస్సేన్‌ కొసంగి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసులో ఉమ్మడి హైకోర్టు వెలువరించిన తీర్పును న్యాయమూర్తి జస్టిస్‌ విజయలక్ష్మి ఈ సందర్భంగా
ప్రస్తావించారు. పోలీసులు తమ విషయంలో రాజ్యాంగంలోని 20(2) ఉల్లంఘించారనే ప్రభాకర్‌ రెడ్డి వాదనలను త్రోసిపుచ్చారు.
ఓ నేరాకిని సంబంధించి ఎక్కువసార్లు ప్రాసి క్యూట్‌ చేయటం, శిక్షించటం చేయరాదని 20(2) అధి కరణ చెప్తోందని అయితే ప్రస్తుత కేసులో పిటిష నర్లను ప్రాసిక్యూట్‌ చేయటం లేదా శిక్షించటం జరగలే దని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. పిటిషనర్లపై అనంతపురం, కర్నూలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదైనాయి.. తుప్పుపట్టిన వాహనాలు, బీఎస్‌-3 వాహనాలను కొనుగోలుచేసి తప్పుడు ధృవీకరణ
పత్రాలు సృష్టించి వాటిని బీస్‌ె-4 వాహనాలుగా నాగా లాండ్‌లో రిజిస్టర్‌ చేయించారని ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్‌లో రీ రిజిస్టర్‌ చేయించారని ఈ వ్యవహారంలో వేర్వేరు వ్యక్తుల ప్రమేయం ఉంది.. నేరాలు జరిగిన తేదీలు వేరు.. ప్రాంతాలు వేరు.. కొన్ని ఫోర్జరీ కేసులు, తప్పుడు బీమా పత్రాలు సృష్టించిన కేసులు ఉన్నా యని న్యాయమూర్తి గుర్తుచేశారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 300 కింద తమకు రక్షణ ఉంటుందన్న పిటిషనర్‌ వాదనను కూడా న్యాయమూర్తి త్రోసిపుచ్చారు. ఈ కేసులలో ఏ రకంగా పిటిషనర్లు కోరిన వెసులు బాటుకు వీలులేదని స్పష్టం చేస్తూ వ్యాజ్యాలను కొట్టివేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement