Sunday, April 28, 2024

Editorial : ఐరాస… దాని ఉనికి ఎక్కడ…?

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టుపై జర్మనీ, అమెరికాలు చేసిన వ్యాఖ్యలకు మన విదేశాంగ శాఖ ఘాటుగా సమాధానమిచ్చింది. వాటి కనుసన్నల్లో పని చేస్తున్న ఐక్యరాజ్య సమితి సైతం ఈ అంశంలో జోక్యం చేసుకుంటూ మనదేశానికి ఎన్నికల విషయంలో సలహా ఇచ్చింది. కేజ్రీవాల్‌ అరెస్టు నేపథ్యంలో … మనదేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని ఐరాస సూచించింది.

- Advertisement -

అయితే, ఐరాస మన ఎన్నికల విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉంది. ఐరాస పేరుకు మాత్రమే ఉంది. తన ఉనికిని అది కాపాడుకోలేకపోతోంది. దేశాల మధ్య ఘర్ష ణలను నివారించడం, ప్రపంచంలో ఎక్కడా యుద్ధాలు జరగకుండా చూడటం, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పటం… ఇవీ ఐక్యరాజ్యసమితి స్థాపనోద్దేశ్యాలు. ఆ సంస్థ ఏర్పడిన నాటి నుంచి తన బాధ్యతలను నెరవే ర్చిన దాఖలాలు ఏవీ లేవు. కనీసం ఉద్రిక్తతలను తగ్గిం చేందుకు కృషి చేసిన దృష్టాంతాలు కూడా లేవు. దేశాల మధ్య యుద్ధాలు సంభవించినప్పుడు శాంతిని పాటిం చాలంటూ ఒక ప్రకటన జారీ చేసి ఊరుకుంటుంది. ఐక్యరాజ్య సమితిని ప్రపంచంలో ఏ దేశమూ పట్టించు కోవడం లేదు. వియత్నాం,ఇరాక్‌-ఇరాన్‌యుద్ధం, అఫ్గాన్‌లో అంతర్యుద్ధం…ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలోని వివిధ దేశాల్లో జరిగిన ఘర్షణలను నివా రించడంలో సమితి పూర్తిగా విఫలమైంది.

తాజాగా, ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య, ఉక్రెయిన్‌-రష్యాల మధ్య యుద్ధాలను సమితి నివారించలేకపోయింది. సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనీ గుటెరెస్‌ పాలస్తీనాలోని గాజా ప్రాంతంలోని పరిస్థితిని కళ్ళారా చూసి… మానవీ య సాయాన్ని తక్షణం అందించాలనీ, ఆహారం, ఇతర సామగ్రి సరఫరా గాజాలోని అన్ని ప్రాంతాలకూ నిరా టంకంగా జరిగేలా చూడాలని గత వారం విజ్ఞప్తి చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా, అంతర్జాతీ య న్యాయస్థానం ఈ విషయమై ఇజ్రాయెల్‌కి ఆదేశాలు జారీ చేసింది. సమితి ఆదేశాలను ఏ దేశమూ ఖాతరు చేయడం లేదనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావా లి? అటువంటి సంస్థ మన దేశంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా, సక్రమంగా జరుగుతుందని ఆశిస్తున్నట్టు ప్రకటించింది. మన దేశంలో సార్వత్రిక ఎన్నికలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. ఇప్పుడు 18వ సార్వత్రి క ఎన్నికలకు దేశం యావత్తు సిద్ధమవుతోంది.

ఈ తరుణంలో భారత్‌లో ఎన్నికలను ఎలా జరపాలో, ఎటువం టి జాగ్రత్తలు తీసుకోవాలో ఐక్యరాజ్య సమితి సుద్దులు చెప్పడాన్ని ఏమనుకోవాలి? గడువు ప్రకారం ఎన్నికలు జరిపించకుండా, మొత్తం అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుని, రాజ్యాంగాలను మార్చివేస్తూ అధికార పీఠాల పై శాశ్వతంగా తిష్టవేస్తున్న సైనికాధికారులు, నియంత ల జోలికి వెళ్ళకుండా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వా మ్య దేశమైన మనదేశానికి సలహాలివ్వడాన్ని ఏమనుకో వాలి? ఇజ్రాయెల్‌,రష్యాలు సాగిస్తున్న యుద్ధంలో పాల స్తీనా, ఉక్రెయిన్‌లలో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ మారణహోమాలను నివారించలేక పోయిన సమితికి భారత్‌లోని అంతర్గత పరిస్థితిని గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? భారత్‌లో జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటువేసేందుకు తగిన వాతావరణాన్ని కల్పించాలంటూ సలహా ఇవ్వడం సమితి దుస్సాహసం కాక మరేమిటి? కొద్ది రోజుల క్రితం భద్రతా మండలి తొలిసారిగా ఇజ్రాయెల్‌ దళాల దాడు లు ఆపాలని కోరుతూ చేసిన తీర్మానంపై అమెరికా ఓటిం గ్‌లో పాల్గొనలేదు. మొత్తం 15 దేశాల్లో 14దేశాలు ఈ ఓటింగ్‌లో పాల్గొన్నాయి. అగ్రరాజ్యమైన అమెరికాకి ఇజ్రాయెల్‌ ఆప్త దేశమన్న సంగతి యావత్‌ ప్రపంచానికీ తెలుసు.అగ్రరాజ్యం హోదాను వెలగబెడుతున్న అమెరి కాను ఎందుకు ఓటింగ్‌లో పాల్గొనలేదని సమితి ప్రశ్నించిందా? ఆ తీర్మానంపై వీటో చేయకపోవడమే గొప్ప అన్నట్టు సమితి ప్రధానకార్యదర్శి గుటెరెస్‌ వ్యాఖ్యానించారు.

ఇలాంటి సందర్భాల్లోనే అగ్రరాజ్యం స్పందించాలి.లేకపోతే దానికి ఆ హోదా ఎందుకు? ఈ విషయమై చెప్పేవారెవరు? భారత్‌లో ఏ చిన్న సంఘట న చోటు చేసుకున్నా, స్పందించే దేశాలు అమెరికాను ప్రశ్నించలేవు. అలాగే, ఆర్థికరంగంలో అమెరికాతో పోటీ పడుతూ అగ్రరాజ్యస్థానంపై ఆశలు పెట్టుకున్న చైనాలో సైతం మానవ హక్కులు అధ్వాన్నంగా ఉన్నా యి. చైనా, రష్యాలలో అధ్యక్షులుగా ఉన్న జిన్‌పింగ్‌, పుతిన్‌లు జీవితకాల అధ్యక్షులుగా కొనసాగేందుకు రాజ్యాంగాలను మార్చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి ముందుగా తన బాధ్యతలను నెరవేర్చి భారత్‌ వంటి దేశాలకు సలహాలిస్తే సమంజసంగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement