Sunday, May 5, 2024

పెద్దనోట్ల రద్దుపై సమీక్ష మంచిదే

ఐదొందలు, వెయ్యి రూపాయిల నోట్లు రద్దయి ఆరేళ్ళు కావస్తోంది. మోడీ ప్రభుత్వం కార్యనిర్వాహక ఉత్తర్వు (ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌) ద్వారా తీసుకున్న ఈ చర్య వల్ల కోట్లాది కుటుంబాలు వీధిన పడ్డాయి. దీనిపై విచారణకు అంగీకరించడం సుప్రీంకోర్టు పెద్ద మనసుకు నిదర్శనం. అవినీతిని అంతం చేయడానికీ, నల్లధనాన్ని వెలికి తీయ డానికి ఈ చర్యతీసుకున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2016 నవంబర్‌ 8వ తేదీ రాత్రి ప్రభుత్వ ప్రసార సాధనాల ద్వారా చేసిన ప్రసంగంలో తెలిపారు. కానీ, వాస్తవానికి జరిగింది వేరు. ఈ ఆరేళ్ళలో నల్ల ధనం రెండు రెట్లుపైన పెరిగింది. ఈ విషయాన్ని గురించి ఎవరైనా ప్రస్తావిస్తే వారిని ప్రభుత్వ వ్యతిరేకిగా ముద్ర వేయడానికి ప్రభుత్వం ఇప్పటికీ ప్రయత్నిస్తోందే తప్ప దీని వల్ల జరిగిన చేటు ఏమిటో సమీక్షించుకునేందుకు ఇష్ట పడటంలేదు. సరిగ్గా ఈ సమయంలో సర్వోన్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు పెద్ద నోట్ల రద్దుకు దారి తీసిన పరిస్థితులు, పర్యవసానాలు, ఫలితాలపై అఫిడవిట్‌ దాఖలు చేయాల్సిందిగా కేంద్రాన్నీ, రిజర్వు బ్యాంకును ఆదేశించింది. ప్రభుత్వ ఉత్తర్వులను, ముఖ్యమైన నిర్ణయాలను ప్రశ్నించకూడదన్న లక్ష్మణ రేఖ తమకు తెలుసుననీ, అయినా, దేశ ప్రజలను ప్రభావితం చేసిన ఈ నిర్ణయం గురించిన వివరాలను తెలుసుకుకోగోరు తున్నామని జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ బోపన్న, జస్టిస్‌ రామసు బ్రహ్మణ్యం, జస్టిస్‌ బీవీ నాగరత్నంలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

దేశంలో ప్రజల దైనందిన కార్య కలాపాలు పెద్ద నోట్ల రద్దు వల్ల ఎంతగా ఛిద్రం అయ్యాయో వేరే చెప్పనవసరం లేదు. దేశంలో నల్ల ధనాన్ని అరికట్టడానికి ఈ చర్య తీసుకున్నట్టు ప్రధాన మంత్రి మోడీ స్వయంగా పలు సార్లు తెలిపారు. కానీ, అటువంటిదేమీ లేకపోగా, నల్లధనం మరింతగా మేటలు వేసింది. మనది పేదలు అధికంగా ఉన్న ధనిక దేశమని మోడీ కేబినెట్‌లో ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న నితిన్‌ గడ్కరీ పేర్కొనడమే ఇందుకు నిదర్శనం. దేశ సం పద అంతా టాటా, బిర్లాల చేతుల్లోకి పోతోందని గతంలో కమ్యూనిస్టులు అనేవారు. ఇప్పుడు ఆదానీ, అంబానీల కుటుంబాలకే చేరుతోందని జనం బహిరంగంగానే చెప్పు కుంటున్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం బెడిసి కొట్టిందని అధికార పార్టీకి చెందిన నాయకులే అంగీకరిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల చిన్న వ్యాపారులు, తోపుడు బండ్లపై పళ్ళు, కూరగాయలు వంటి నిత్యావసరాలను అమ్ముకునే రోజువారీ వ్యాపారులే ఎక్కువగా దెబ్బతిన్నారని పలు సర్వేల్లో వెల్లడైంది. అలాగే, సామాన్య గృహస్తుల రోజువారీ ఖర్చులు బాగా పెరిగాయి. రోజువారీ పనులు చేసుకునే వారికి నెలలు,సంవత్సరాల పాటుపనులు దొరకలేదు.

ఒక వేళ దొరికినా గతంలో మాదిరి వేతనాలు లభించడం లేదు. ఎంతిస్తే అంత తీసుకుని పనులు చేయడం తప్ప గట్టిగా డిమాండ్‌ చేసే పరిస్థితులు కార్మి కులకు లేదు. అన్నింటికీ మించి ప్రజల కొనుగోలు శక్తి పడి పోయింది.పెద్ద వ్యాపారులు చిన్న వ్యాపారులుగా, చిన్న వ్యాపారులు రోజువారీ కూలీలు, సేల్స్‌ మన్‌లుగా మాల్స్‌, పెద్ద దుకాణాల్లో కుదురుకున్నారు. నగరాలు, పెద్ద పట్టణాల్లో కొత్తగా వెలసిన మాల్స్‌ తరతరాలుగా కొన సాగుతున్న కిరాణా దుకాణాల వ్యవస్థను దెబ్బ తీసింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం వలస కార్మికుల జీవ నానికి చేటు తెచ్చింది. వలస కార్మికులు ఎక్కడ పడితే అక్కడ ఉపాధి సంపాదించుకోవడానికి వీలు లేని పరి స్థితులను కల్పించింది. చిన్నదుకాణాలు మూత పడ్డాయి. చేతిలో డబ్బు లేకపోవడం వల్ల దుకాణాలు, పెద్ద మాల్స్‌కి వచ్చే కొనుగోలు దారుల సంఖ్య బాగా పడి పోయింది. కొనుగోలుదారులు లేకపోవడంతో అవి మూత పడ్డాయి. రద్దయిన పెద్ద నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవడానికి బ్యాంకుల్లో పెద్దక్యూల్లో నిలబడలేక, బయట వేరే మార్గాలు లేక వ్యాపారులు, వినియోగ దారులు నానా ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల అది అవినీతికి దారి తీసింది. ఇలాంటి వాటిని అదుపు చేయ డంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ విఫలమైంది.ఆర్థిక లావాదేవీల్లో సంక్లిష్టమైన పరిస్థితులు ఏర్పడేవి. ఇవన్నీ మా మూలు పరిస్థితులకు చేరుకోవడానికి కనీసం రెండేళ్ళు పైన పట్టింది. రోడ్లపై ఆహారాన్నీ, తినుబండారాలను విక్ర యించే చిన్న వ్యాపారుల వ్యాపారాన్నీ, వాటిపై ఆధా రపడి జీవించేవారిని బాగా అష్టకష్టాల పాలు చేసింది. నగదు కొరత వల్ల రోజువారీ కూలీలకు వేతనాలు ఇవ్వ డం వ్యాపారులకు కష్టంగా ఉండేది పెద్దనోట్ల రద్దుపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించడం పేదలకు ఆశాకిరణమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement