Thursday, February 8, 2024

Editorial: లక్షదీవులే లక్ష్యంగా…

పర్యాటకులకు మానసికోల్లాసాన్ని కలిగించే రమణీ య దృశ్యాలుగల ప్రాంతాలు మన దేశంలో అనేకం ఉన్నాయి. అయినప్పటికీ చాలామంది విదేశాలను చూసేందుకు కూడా చాలా ఇష్టపడుతుంటారు. విదేశా ల్లో చిత్రీకరించి నిర్మాణంలో కొత్త పుంతలు తొక్కాలనే ఆత్రుత సినీ నిర్మాతల్లో నానాటికీ పెరుగుతోంది. సినిమా షూటింగ్‌లకే కాదు, వరుసగా సెలవులు వస్తే మరికొన్ని సెలవులు జమ చేసుకుని విదేశీ పర్యాటక కేంద్రాలకు తరలి వెళ్ళే సంపన్న, ఎగువ మధ్యతరగతి జనాభా సంఖ్య మన దేశంలో నానాటికీ పెరుగుతోంది.

- Advertisement -
   

వీరిలో చాలామంది గమ్యస్థానం మాల్దివులు. మాల్దివులలో సేద తీరేందుకు మన దేశంలో చాలా మంది క్యూ కడుతు న్నారు. మనసును ఆహ్లాద పర్చే వాతావరణం కలిగిన ప్రదేశాలు, రిసార్టులు మన దేశంలోనూ ఉన్నాయి. అయినా మాల్దివులకు వెళ్ళడం పర్యాటకులకు హాబీగా మారింది. అక్కడ నిబంధనలు సరళతరంగా ఉండటం వల్ల పర్యాటకులు అటు మొగ్గుచూపుతున్నారు. నిజానికి మన గోవాలో కూడా అలాంటి వాతావరణం ఉంది. మాల్దివులలో ప్రభుత్వం మారడంతో అక్కడి పరిస్థితు లు మారాయి. అక్కడ కొత్తగా అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు చైనా అనుకూల వైఖరిని అనుసరిస్తున్నారు. అధికారాన్ని చేపట్టగానే చైనా వెళ్ళి పలు ఒప్పందాలు చేసుకొచ్చారు. ఇప్పుడు పాకిస్తాన్‌ కూడా మాల్దివులకు సాయం అందిస్తానంటూ ముందు కు వచ్చింది. నిజానికి పాకిస్తాన్‌లో పరిస్థితులు మున్నె న్నడూ లేనంత దారుణంగా పడిపోయాయి. చైనా నుంచి రెండు బిలియన్‌ డాలర్ల సాయం కోసం పాకిస్తాన్‌ దరఖాస్తు చేసుకుంది. పాక్‌ జీడీపీ అంచనాలను తగ్గించు కోమని ఐఎంఎఫ్‌ సలహా ఇచ్చింది.

అయినా పాకిస్తాన్‌ లో ప్రస్తుతం అధికారంలో ఉన్నది ఆపద్ధర్మ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎంతకాలం అధికారంలో ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో పాక్‌ని మాల్దివులు నమ్ముకోవడం అవివేకమే. అయితే, చైనా ఒత్తిడి వల్లనే మహ్మద్‌ ముయిజ్జు పాక్‌తో సంబంధాలను కొనసాగిస్తున్నారు. మాల్దివులు మన దేశంతో దశాబ్దాలు గా మైత్రిని కొనసాగిస్తోంది. చైనా ప్రోద్బలంతోనే మన దేశంపై మాల్దివుల మంత్రులు మన ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేశారు. అలా చేసిన వారిని దేశాధ్య క్షుడు ముయిజ్జు అధికారం నుంచి తొలగించారు. కానీ, చైనా పర్యటన సందర్భంగా ఆయన ఆ దేశంతో చేసుకు న్న ఒప్పందాలు మాల్దివులను కట్టిపడేశాయి. ఆ విష యాన్ని గ్రహించిన మోడీ మాల్దివులకు ప్రత్యామ్నా యంగా మనదేశంలో ప్రకృతి రమణీయకతకు ప్రసిద్ధి చెందిన లక్ష దీవులను అభివృద్ధి పర్చాలని నిర్ణయించుకు న్నారు. మాల్దివులు అనుసరిస్తున్న భారత్‌ వ్యతిరేక వైఖరి దృష్ట్యా మాల్దివుల ప్యాకేజీలను పర్యాటక సంస్థలు నిలిపి వేశాయి. మాల్దివులకు దీటుగా లక్ష దీవులను అభివృద్ధి పర్చేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగం లో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

ప్రస్తుతం మాల్దివుల రాజధాని మాలేకి వెళ్ళే భారత పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. గత మూడు వారాల్లో మాల్దివులను సందర్శించిన పర్యాటకుల సంఖ్యను పరిశీ లించినట్టయితే, భారత్‌ ఐదో స్థానానికి పడిపోయింది. మన పర్యాటక వెబ్‌సైట్లలో కూడా మాల్దివుల స్థానే లక్ష దీవులకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలు పెట్టారు. పర్యా టకులు లక్ష దీవులను ఎంచుకోవాలని తెలియజెప్పేందు కు ప్రధాని నరేంద్రమోడీ గత నెలలో తాను ఆ దీవుల్లో పర్యటించి అక్కడ డైవింగ్‌, స్కార్కెలింగ్‌ చేశారు. లక్ష దీవులు మొత్తం 35. ఇక్కడి బీచ్‌లు, పగడపు దీవులు, సాహసాల క్రీడల పరంగా చూస్తే లక్ష దీవులు మాల్దివుల కు ఏ మాత్రం తీసిపోవని పర్యాటకవేత్తలు పేర్కొంటు న్నారు. సరైన సౌకర్యాలు కల్పిస్తే అంతర్జాతీయ స్థాయి లో ఆతిధ్య సేవలను సమకూరిస్తే మాల్దివులతో ఇవి పోటీ పడవచ్చు. అందుకే, ఈ దీవుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. అలాగే, అండమాన్‌ దీవుల్లో కూడా పర్యాటక పరంగా అభివృద్ధి పర్చే అవకాశాలు ఎక్కువగాృ ఉన్నాయి.

మన దేశం నుంచి వెళ్లే పర్యాటకు లకు లక్ష దీవులు ఎంతో అనుకూలంగానూ, ఆనంద ప్రదంగానూ ఉంటాయి. లక్ష దీవుల్లో బీచ్‌లు కూడా ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. వీటిని సినిమా షూటిం గ్‌లకు వినియోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నా యి. ఈనేపధ్యంలో మాల్దివులకు వెళ్ళేందుకు అలవాటు పడ్డ పర్యాటకులు లక్షదీవులను లక్ష్యంగా చేసుకోవాలన్న ది ప్రభుత్వ ఉద్దేశ్యం. ఏ రకంగా చూసినా లక్ష దీవులు మాల్దివులకు ఏమాత్రం తీసిపోవు. అందుకే, మాల్దివుల కు దీటుగా లక్ష దీవులను అభివృద్ధి పర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటకులకు సౌకర్యాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నిర్మలా సీతారామ న్‌ తెలిపారు. దేశంలో పర్యాటక కేంద్రాలన్నిటినీ అభివృద్ధి చేసే లక్ష్యంతో ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తు న్నట్టు ఆమె చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement