Thursday, March 16, 2023

ఎడిటోరియ‌ల్ – క‌క్ష సాధింపు త‌గ‌ద‌న్న విప‌క్షాలు..

విపక్షాలపై కేంద్రం ఎన్నడూ లేని విధంగా కక్ష సాధిం పు చర్యలకు పాల్పడుతోందని ఎనిమిది పార్టీల నాయకు లు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి రాసిన లేఖలో ఆవేద న వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు ఈ మాదిరి లేఖ రాయ డం అసాధారణమైన విషయం.గతంలో ప్రతిపక్షాలు తమ అభిప్రాయాలను విడివిడిగాతెలియజేసేవి. ఇప్పు డు ఉమ్మడిగా లేఖ రాశాయి. ప్రజాస్వామ్య మనుగడకు ప్రతిపక్షాలు క్రీయా శీలంగా వ్యవహ రించడం అంత ముఖ్యం. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యే పలు సార్లు స్పష్టంచేశారు. అయితే, పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఆయనే ప్రతిపక్షాల విషయంలో ఒకవ్యాఖ్య చేశారు.ఈడీ,సిబిఐ వంటి సంస్థ ల దర్యాప్తుల విషయంలో ప్రతిపక్షాలు ఏకమవుతున్నా యంటూ మోడీ చేసిన వ్యాఖ్య లో వ్యంగ్యం ఉన్నప్ప టికీ, ఇప్పుడు అదే నిజమైంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటూ ప్రతిపక్ష నాయకులు ఆ లేఖలో ప్రధాని ని కోరారు. ప్రజాస్వామ్యంలో అందరికీ ఒకే న్యాయం ఉండాలనీ, అధికార పక్షానికో న్యాయం, ప్రతిపక్షానికో న్యాయం వల్ల ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలే అపహా స్యం పాలవుతున్నాయని ప్రతిపక్ష నాయకులు ఆందోళ న వ్యక్తం చేశారు. విపక్షాలకు చెందిన నేతలపై సీబీఐ, ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సరే, అధికార పార్టీకి చెందిన నాయకులపై ఆరోపణలకు రుజువులు కళ్ళెదుట కనిపిస్తుంటే ప్రభుత్వం మౌనం దాల్చడం వివక్ష కాదా? అని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించారు. కర్నాటకలో ఒక ఎమ్మెల్యే ఏడుకోట్ల రూపాయిలను లంచం తీసుకుంటూ పట్టుబడిన సంఘటనను ప్రభు త్వం సీరియస్‌గా తీసుకోకపోవడాన్ని వారు సోదాహర ణగా వివరించారు.అసోంలో కాంగ్రెస్‌ నాయకుడు హిమంత్‌ బిశ్వా శర్మ అవినీతి ఆరోపణలను ఎదుర్కొం టున్నప్పటికీ, బీజేపీలో చేరగానే ఆయనపై కేసులు రద్దు చేశారనీ,అలాగే, బెంగాల్‌లో టిఎంసీ నాయకుడు సువేం దు అధికారి, ముకుల్‌ రాయ్‌ వంటి వారు బీజేపీలో చేర గానే వారిపై కేసులు రద్దు చేశారనీ,ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నోఉదాహరణలు ఉన్నాయని ప్రతిపక్ష నాయకు లు తమ లేఖలో వివరించారు.

- Advertisement -
   

ప్రధాని మోడీ అవినీతిపై గంభీరోపన్యాసాలు ఇస్తుంటారనీ,సొంత పార్టీ వారి విషయంలో పట్టించుకోకపోవడమే కాకుండా, అటువం టి వారినే అందలం ఎక్కిస్తుంటారని ప్రతిపక్ష నాయకు లు ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ పాలన క్రమంగా నిరంకుశంగా మారుతోందనీ, తాజాగా, ఆప్‌ నాయకు డు, ఢిల్లిd మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాను జైల్లో పెట్టడం మోడీ కక్ష సాధింపు చర్యకు నిరసనమని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు.కార్పొరేట్‌ దిగ్గజం అదానీ విషయంలో మోడీ నిబద్ధత ఏపాటిదో బయట పడిందని ప్రతిపక్ష నాయకులు స్పష్టం చేశారు. అదానీ పై పార్లమెంటులో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు మోడీ సమాధానం దాటవేయడం వెలితిగానే కనిపిస్తోంది. హిండెన్‌బర్గ్‌ నివేదిక పై ప్రభుత్వం వై ఖరి ఏమిటో తెలియజేయకపోవడం దాటవేతధోరణనని ప్రతిపక్ష నాయకులు ఆ లేఖలో పేర్కొన్నారు.

గవర్నర్ల పాత్ర వివాదాస్పదంగా తయారైందని కూడా ప్రతిపక్ష నాయ కులు ఆరోపించారు.గవర్నర్లు కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఆరోపించిన బీజేపీ ఇప్పుడు అదే దారిలో నడుస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణ వాస్తవాల కు దగ్గరగానే ఉంది. ప్రధాని అసలు ప్రతిపక్ష నాయకుల నూ, ప్రతిప క్ష పాలిత రాష్ట్రాలనూ అసలు లెక్కచేయడం లేదన్న ఆవేదన ఆ లేఖలో వ్యక్తం అయింది. ప్రతిపక్షాలు ఏవౖైెనా ఆరోపణలు చేస్తే ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కానీ, అసలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రంలో కమలనాథు లు ఎన్నికల్లో గెలవడమే పర మావధిగా భావిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఈ ధోరణిలేదు. తమ అధికార పరిధి విస్తృతం అవుతుండటంతో ఎవరినీ లెక్కచేయని భావన వారిలో పెరుగుతోందన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. ఫెడరల్‌ స్ఫూర్తికి భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తోందన్న భావన సర్వత్రా వ్యక్తం అవు తోంది.

ప్రధానమంత్రి జాతీయ,అంతర్జాతీయ రంగా ల్లో తిరుగులేని నాయకునిగా ఎదిగిన మాట నిజమే. కానీ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని వీడకుండా ఉంటే ప్రభు త్వం గౌరవం మరింత పెరుగుతుంది. అవినీతి ఆరోపణ ల విషయంలో అరెస్టు అయిన విపక్ష నేతల కన్నా ఎక్కువ తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్న అధికార పార్టీ నాయకులను వదిలివేయడం వల్ల ప్రభుత్వ పక్షపాతం గా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది. ఇదే విషయాన్ని తొమ్మిది మంది ప్రతిపక్ష నేతలు ఆ లేఖ లో పేర్కొన్నారు.ప్రధాని వైఖరిపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా మించిపోయింది లేదు, ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని వారు కోరుతు న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement