Thursday, April 25, 2024

అంబరాన్నంటిన హోలీ సంబరాలు.. పోలీస్ అధికారుల నృత్యాలు

రంగుల పండుగ హోలీ రామగుండం కమిషనరేట్ ఆవరణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళవారం పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. రామగుండం సిపి రేమ రాజేశ్వరి రంగులు చల్లి అధికారులు, సిబ్బందికి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది ఒకరికొకరు రంగులు చల్లి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు వైభవ్ గైక్వాడ్, సుధీర్ లతో పాటు కమిషనరేట్ పరిధిలోని ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది నృత్యాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement