Saturday, May 11, 2024

ఎడిటోరియ‌ల్ – అన్ని అన‌ర్ధాల‌కు మూలం ద్వేషం..

జనాన్ని రెచ్చగొట్టేందుకు ప్రసంగాలు చేయడం పార్టీలతో,హోదాలతో నిమిత్తం లేకుండా అందరికీ అలవాటయింది.రాజకీయాల్లో ఆవేశకావేశాలు సహజమే కానీ, లక్ష్మణ రేఖ దాటితే ఎవరిపైనైనా వేటు పడాల్సిందే. అన్ని అనర్ధాలకూ మూలం ద్వేషం. ద్వషపూరిత ప్రసంగాలు చేసిన వారిపై కేవలం కేసులు పెట్టి వది లేస్తే కుదరదు.అని సుప్రీంకోర్టు మంగళవారం నాడు కేంద్రాన్నీ,రాష్ట్రాలనూ హెచ్చరించింది. రెచ్చగొట్టే ప్రసంగాలు సాధారణంగా ఎన్నికల సమ యంలో జరుగుతుంటాయి. కులాలు, మతాలు, వర్గా లను తమ వైపు తిప్పుకోవడానికి నాయకులు ఈ మాదిరి ప్రసంగాలు చేస్తుంటారు. మనదేశంలో అనేక మతాలు, కులాలు, వర్గాలు, ప్రాంతాలూ ఉన్నాయి. అందరం కలిసిమెలిసి జీవనం సాగించడానికి తరతరా లుగా అలవాటు పడ్డాం. మానవ నాగరికతకు పునాది అయిన గ్రామాల్లో సైతం అన్ని వర్గాల వారూ సన్నిహి తంగా మెలగడం ఇప్పటికీ చూస్తున్నాం. కొన్ని ప్రాంతా ల్లో అయితే, వరుసలు పెట్టి కూడా పిల్చుకుంటూ ఉంటారు. ఈ సామరస్య ధోరణిని కొన్ని స్వార్థపర శక్తులు విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఎన్నికలగాయాలు ఓ పట్టాన మానవు. వాటిని కెలికి ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు రాజకీయ వర్గాలు ప్రయత్నిస్తుంటాయి. పార్టీలు ఏవైనా ఈ విషయంలో వాటి నైజం ఒకటిగానే కనిపిస్తుంది. బుజ్జగించి ఓట్లు వేయించుకోవడం, సమాజంలో వివిధ వర్గాలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం అలవాటైన కొద్దీ ఈ ధోరణి మరింత పెరుగుతోంది. వీరిపై నమోదు చేసే ఎఫ్‌ఐఆర్‌ లు కోర్టుల్లో నిలబడవు.అందుకే, వాటిని వారు లెక్క చేయరు.ఈ విషయాన్ని సుప్రీంకోర్టు బెంచ్‌ ప్రస్తావిస్తూ ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే పొరపాటని స్పష్టం చేసింది.

జస్టిస్‌ కెఎం జోసెఫ్‌, జస్టిస్‌ నాగరత్నలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయడంతో పోలీసులు తమ విధి పూర్తి అయిందని అనుకుంటున్నా రనీ, తదుపరి దర్యాప్తు కొనసాగించడం లేదనీ, దానికి తగ్గట్టు సమాజంలో నేరాల సంఖ్య పెరిగి పోవడంతో తదుపరి చర్యలను తీసుకోవడానికి వారికి తగిన వ్యవధి ఉండని మాట నిజమేనని డివిజన్‌ బెంచ్‌ పేర్కొంది. చేసిన నేరానికి తగిన శిక్ష పడినప్పుడే నిందితులకు చట్టం పట్ల, భద్రతాయంత్రాంగం పట్ల భయ భక్తులుంటా యన్న మాట నిజమే కానీ, మనదేశంలోనే కాదు, అమెరికా వంటి అగ్రదేశాల్లో సైతం కేసుల సంఖ్య పెరిగిపోవడానికి కారణం ఇదే. మన దేశానికి చెందిన నిత్యానంద స్వామి అనే స్వామి అమెరికాలో పద్దెనమిది రాష్ట్రాలను బురిడీ కొట్టించాడు. గవర్నమెంట్‌ ఆఫ్‌ కైలాస్‌ని ఏర్పాటు చేశాడు. సొంతంగా కరెన్సీ ముద్రించాడు. ఇన్ని చేసినా, అంతర్జాతీయంగా నేరస్తులను పట్టుకోవడానికిక ఇంటర్‌పోల్‌ వంటి వ్యవస్థలున్నా అతడిని పట్టుకోలేకపోతున్నాయి. అలాగే, జస్టిస్‌ ఫర్‌ సిక్‌ పేరిట సంస్థను స్థాపించిన అమృతపాల్‌ అనే యువకుడు పోలీసుల కన్నుగప్పి వివిధ దేశాల్లో సంచరిసు ్తన్నాడు. రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా వారు తమ సామా జికవర్గం వారినీ, ఇతరులను ఆకర్షిస్తున్నారు.మతం పేరిట రెచ్చగొట్టే వారిని కట్టడి చేయడానికి తగిన చట్టాలున్నా, ఒత్తిడుల కారణంగా కేసుల దర్యాప్తును పోలీసులు కొనసాగించలేక పోతున్నారు. విద్వేష ప్రసంగాలకు సంబంధించి 18 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టు దృష్టికి తెచ్చారు,

మత పరమైన అభిమానాలు కలిగిన వారు వాస్తవాలను సహించలేరు, ఇం దుకు మన దేశంలో ప్రస్తుతం సాగుతున్న ఆరోపణ లు, ప్రత్యారోపణలే నిద ర్శనం. ప్రభుత్వం కూడా కొన్ని సందర్భాల్లో చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తోంది. కేసుల్లో చిక్కుకున్న వారు అస్మదీయులైతే వారిని కాపాడేందుకు ప్రయత్ని స్తోంది. ప్రజల్లో చైత న్యం వస్తేనే ఇలాంటి ధోరణులను కట్టడి చేయగ లుగుతాం. అన్ని మతాలు ప్రేమనే ప్రబోధించాయి. ప్రేమతో సాధించలేనిది లేదని స్పష్టం చేశాయి. మానవ సమాజాన్ని ముం దుకు తీసుకుని వెళ్ళేందుకు మతం చుక్కాని లాంటిది. కానీ, స్వార్ధపరులు కొందరు ఆ చుక్కానిని గొడ్డలిగా ఉప యోగిస్తున్నారు. దీని వల్లే సమాజంలో తగవులు వసు ్తన్నాయి. మహాత్మాగాంధీ చూపిన మార్గంలో శాంతి. సామరస్యం, సహజీివనం తో మనుగడ సాగిం చినంత కాలం ఎటువంటి పొరపొచ్చాలు రాలేదు. ఉండవు కూడా. అలాంటి సమా జంలో ద్వేషానికి తావు లేదు. సామరస్యమే సమాజం మనుగడకు మార్గదర్శకం.

Advertisement

తాజా వార్తలు

Advertisement