Friday, April 19, 2024

టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు రిలీజ్.. ఎప్పుడంటే

1970-80ల‌లో స్టూవ‌ర్ట్ పురం గ‌జ దొంగ పోలీసుల‌కు నిద్ర‌లేకుండా చేసిన క‌థ‌నంతో తెర‌కెక్కుతోంది టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు. ఈ చిత్రంలో హీరోగా ర‌వితేజ న‌టిస్తుండ‌గా హీరోయిన్ గా నుపుర్ స‌న‌న్ న‌టిస్తోంది. కాగా ఈ చిత్రాన్ని దసరా పండుగ కానుకగా, అక్టోబర్ 20వ తేదీన విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.ఈ మేర‌కు పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్.అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి మహేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ నుంచి క్రితం ఏడాది మూడు సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలలో ‘ధమాకా’ భారీ వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది ఆరంభంలోనే చిరంజీవితో కలిసి ‘వాల్తేరు వీరయ్య’లో కనిపించిన రవితేజ, ‘రావణాసుర’ సినిమాతో థియేటర్లకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఏప్రిల్ 7వతేదీన ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాలో రవితేజ నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తుండటం ఆసక్తిని రేకెత్తించే విషయం. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ సరసన నాయికలుగా ఐదుగురు హీరోయిన్స్ కనిపించనుండటం ఓ విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement