Friday, April 26, 2024

ఎడిటోరియ‌ల్ – స‌బ్సిడి క‌ట్ …వేలాడుతున్న క‌త్తి

పోషక విలువలు గల ఎరువులపై ఇస్తున్న సబ్సిడీని తగ్గించాలని కేంద్రం నిర్ణయించడం రైతుల పాలిట అశని పాతం వంటిది. రుతుపవనాల రాక ఆలస్య మవుతుంద న్న వార్తలు రైతుల్లో గుబులు పుట్టిస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ వార్త నిజానికి అశనిపాతమే. దేశంలో ఎరువుల వాడకం ఈమధ్యకాలంలో బాగా పెరిగింది. అయితే, అన్ని వస్తువుల మాదిరిగానే ఎరువులలో కూడా కల్తీ జరుగుతోంది.దాంతో ఎరువుల వాడకాన్ని తగ్గించాలని నరేంద్రమోడీ ప్రభుత్వం రైతులకు పిలుపు ఇస్తోంది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రాష్ట్రాలను ఆదేశించింది. అయితే ,రైతుల్లో సెంటిమెం ట్లు ఎక్కువ. పొరుగువారు ఏ పద్ధతిలో వ్యవసాయం చేస్తే అదే పద్ధతిలో చేయాలని చాలా మంది భావిస్తుంటా రు. పక్క పొలంలో ఫలానా ఎరువులు వేస్తే మనం కూడా అదే తరహా ఎరువులు వేయాలని భావిస్తుంటారు. సేంద్రి య వ్యవసాయం అనేది తరతరాలుగా రైతులు అనుస రిస్తున్న విధానమే. మంచిదని చెప్పినా రైతులు నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదు.

ముఖ్యంగా, ఎక్కువ పోషక విలు వలు గల ఎరువుల వాడకంవల్ల ఆహార ధాన్యాల దిగుబడి ఎక్కువ వస్తుందన్న ఆశతో ఎంత డబ్బు ఖర్చ యినా ఆ తరహా ఎరువులను వాడుతూ ఉంటారు. ఎరువుల వ్యాపారంపై ప్రభుత్వ నిఘాలేదు. చాలా మంది ఎక్కడి నుంచో తెచ్చి ఎరువులను వాడుతూ ఉంటారు. ఎరువుల సబ్సిడీని కేంద్రం దశలవారీగా తొలగిస్తుందని మోడీ అధికారంలోకి రాగానే ప్రకటించా రు. అప్పటి నుంచి ప్రత్యామ్నాయాలను చూసుకోవాల ని రైతులను హెచ్చరిస్తున్నా, వారు గడిచిన ఆరేడేళ్ళలో ఎక్కువ మోతాదులో ఎరువులను వాడటం మొదలు పెట్టారు. గుజరాత్‌లో ఎరువుల వాడకాన్ని తగ్గించేందు కు మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ప్రయత్నా లు ఫలించాయి. దాంతో ఆయన డీఏపీ ఎరువుల బదులు సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరించాలంటూ ప్రచా రం ప్రారంభించారు.

దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా పెరగడానికి ఎరువులు కారణమని వాదించేవారు న్నారు. ఎరువులతో పాటు నీటివనరుల పెంపు కూడా అవసరమేనని తెలంగాణలో తెరాస ప్రభుత్వం రుజువు చేసింది. ప్రాథమికంగా మన దేశం వ్యవసాయిక దేశం కావడం వల్ల పంటలను ప్రోత్సహించాలన్న నినాదం మంచిదే కానీ,ఎరువులు వాడనిదే వ్యవసాయం చేయలేమనే వాదన సహేతుకమైనది కాదు. రసాయినిక ఎరువులు లేకుండా సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా ఇబ్బడిముబ్బడిగా పంటలను పండించే రైతులు మన ప్రాంతాల్లో చాలా మంది ఉన్నా రు. ఎరువుల ధరపెరిగి పోవడంతో వ్యవసాయం ఖర్చు లు కూడా బాగా పెరిగి పోయాయి. ఎరువులపై కొత్త సబ్సిడీ రేట్ల గురించి ప్రభుత్వవర్గాల నుంచి ఇదమిత్థంగా సమాచారం వెలు వడలేదు,కానీ, అనధికార వర్గాల ద్వారా పుంఖానుపుం ఖాలుగా సమాచారం వెలువడుతోంది.

అనధికార సమాచారాన్ని బట్టి నత్రజని ఎరువుల సబ్సిడీ తగ్గిస్తే వాటి ధరలు ధరలు కిలోకు 22రూపాయిలు పైన పెరగ వచ్చు.అలాగే, పొటాషియం ఎరువుల సబ్సిడీ తగ్గిస్తే, రౖౖెతులపై ఎనిమిది రూపాయిలుపైగా అదనపు భారం పడుతుంది. పాస్ఫేట్‌కు గతంలో 25.70 పైసలున్న సబ్సిడీ ఇప్పుడు 15.91 పైసలకు తగ్గుతుంది. సల్ఫర్‌కు కిలో సబ్సిడీ 2.84కు బదులుగా 2.80 పైసలు ఉంటుంది. ఇవి అధికారిక లెక్కలు కావు. ప్రభుత్వ నిర్ణయం అమలు లోకి వచ్చిన తర్వాత ఎరువుల ధరలు పెరగవచ్చు. రైతు లు ప్రకృతి వైపరీత్యాల వల్ల విపరీతంగా నష్టపోతున్నా రు. ముఖ్యంగా, అకాల వర్షాలు కొన్ని చోట్ల, వర్షాభావ పరిస్థితిలు చాలా చోట్ల నెలకొని ఉండటం వల్ల రైతులకు పెట్టుబడి వ్యయం కూడా లభించడం లేదు. ఎరువుల వాడకం అధికం కావడం వల్ల రైతుల పెట్టుబడి వ్యయం బాగా పెరిగిపోయింది. నీటి సౌకర్యాలు పెరిగినా ఆ మేరకు ఎరువులు, క్రిమిసంహారక మందుల వ్యయం తడిసి మోపెడు కావడంవల్ల రైతులకు వ్యవసాయం గిట్టుబాటుకావడంలేదు.ఎంత ఆదాయం వస్తుందనే గ్యారంటీ లేదు.

వ్యవసాయం అప్పుడూ ఇప్పుడూ కూడా దైవాధీనంగానే తయారైంది. ప్రభుత్వాలు ప్రవేశ పెట్టే పథకాలు, వాటి ద్వారా అందించే సాయం రైతులకు ప్రచారానికే తప్ప వాస్తవంగా రైతులకు మేలు చేకూర్చ డం లేదు. సంప్రదాయక పద్దతులను పాటించాలని రైతులకు ఎంత నచ్చచెప్తున్నా, వారు ఆధునిక పద్దతుల పేరిట ఎరువుల వాడకానికే ప్రాధాన్యం ఇస్తు న్నారు. రైతుల సమస్యలపై వరుసగా ఏడాదిపాటు ఢిల్లిd సమీపం లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు ఆందోళన నిర్వహించారు. వారి ఆందోళనకు తలొగ్గి కొత్త వ్యవసాయచట్టాలను ప్రభుత్వం ఉపసంహరించి నప్పటికీ, మరో రూపంలో ఆ చట్టాలను తె చ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందంటూ తరచూ వచ్చే వార్తలు రైతుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అటు ప్రకృతి, ఇటు ప్రభుత్వ విధానాలతో రైతులు నిరంతం చింతతో జీవిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement