Friday, April 26, 2024

ఎడిటోరియ‌ల్ – అమెరికా విష సంస్కృతి

అమెరికాలో గన్‌ కల్చర్‌ కొత్త కాకపోయినా, ఈ మధ్య రోజూ తుపాకీ కాల్పుల్లో అనేక మంది మరణిస్తున్నారు. లేదా గాయపడుతున్నారు.వీరిలో తెలుగు వారుండటం బాధాకరం. తాజాగా,విశాఖ విద్యార్ధి దేవన్ష్ అనే విద్యార్థి . తీవ్రంగా గాయపడిన తొమ్మిది మందిని చికాగో ఆస్పత్రి లో చేర్చారు. రెండు రోజుల క్రితం కాలిఫోర్నియాలో ఒక విద్యార్ధిజరిపిన కాల్పుల్లో పది మంది మరణించారు. తుపాకుల సంస్కృ తి అమెరికా ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నా, ప్రధాన రాజకీయ పార్టీలైన రిపబ్లికన్‌, డెమోక్రాటిక్‌ పార్టీలు ఎన్నికల ముం దు ఇచ్చే వాగ్దానాలకు కట్టుబడి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, తుపాకుల లైసెన్సుల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. తుపాకుల సంస్కృతికి బలి అవుతున్నవారిలో చదువుకుంటున్న వారే కాకుండా, ఉద్యోగాలు చేసుకుం టున్న వారున్నారు. అమెరికాలో చదువు, ఉద్యోగం అంటే ఎంతో ఇష్టపడి వెళ్ళే వారిలో మధ్యతరగతి వారే ఈ సంస్కృతి వల్ల ఎక్కువగా నష్టపోతున్నారు.

అమెరికా లో తుపాకీ చేతిలో ఉంటే ఎవరు ఏ సమయంలో కాల్పు లు జరుపుతారో తెలియదు. అక్కడ భద్రతాసిబ్బంది గస్తీ తిరుగుతున్నా సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేదు. తుపాకీ లైసెన్స్‌ని సంపాదించడం ఎంతో తేలిక.అది చేతి లో ఉంటే ఆత్మహత్యలు చేసుకుంటారు కొందరు. ఎదుటి వారిపై కాల్పులు జరుపుతారు మరి కొందరు. ఏడాదికి 40,600 మందిఈ తుపాకీ సంస్కృతికి మరణిస్తున్నట్టు సర్వేలో తేలింది. అమెరికాలో స్వేచ్ఛ ఎంత ఉందో ప్రజల ప్రాణాలకు అంతకు ఎన్నో రెట్లు రిస్క్‌ ఉంది.అమెరికాలో తుపాకుల సంఖ్య అక్కడ జనాభాతో పోటీ పడుతోందన్న వ్యాఖ్యల్లో అసత్యం లేదు. వ్యంగ్యం అంతకన్నా కాదు. తుపాకీ లైసెన్సులు సంపాదించడం అక్కడ ఎంతో సులభం. పెద్ద వారి వద్దనే కాదు.పిల్లల వద్ద తుపాకులు ఉండటం అక్కడ నేరం కాదు. అందుకే, అమెరికాలోని పాఠశాల్లో,కాలేజీల్లో కాల్పుల మోతలు ఈ మధ్య ఎక్కు వ అవుతున్నాయి. ప్రతి వంద మందికీ 121 తుపాకులు న్నట్టు సర్వేలో తేలింది. యెమన్‌లో ప్రతి వంద మంది లో 52 మందికి గన్‌లు ఉన్నాయి. అమెరికా తర్వాతి స్థానంలో యెమన్‌ ఉంది. అంతర్జాతీయంగా ఇంకా పెక్కు నగరాలు, ప్రాంతాల్లో తుపాకీ సంస్కృతి రాజ్యమే లుతోంది. ప్రపంచంలో తమది అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని చెప్పుకునే అమెరికాలోఈ విష సంస్కృతి ఒక్క రోజులో కాదు. అనేక సంవత్సరాల నుంచి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిపై ఓ కన్నేసి ఉంచుతారు.అందులో భారతీయులం టే వారికి ఆప్యాయంతో పాటు ద్వేషం కూడాఉంది.

దేశంలోని ఉద్యోగాలన్నీ విదేశీయులు ముఖ్యంగా చైనీయులు, భారతీయులు కొల్లగొట్టుకుని పోతున్నారన్న దుగ్ధ కూడా ఉంది. పాలకులను బట్టి ఇది మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది. డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షునిగా ఉన్నప్పుడు అక్కడి ఎన్నారైల ఓట్ల కోసం మన ప్రధాని నరేంద్ర మోడీని పొగిడేవారు.ఆయన హయాంలో భారతీయు లపై అనేక దాడులు జరిగాయి. ముఖ్యంగా, గ్యాస్‌ స్టేషన్ల లో, రెస్టారెంట్లలో పని చేసే వారిపై ఎక్కువగా కాల్పులు జరిగాయి. ఆయన మోడీతో ముసిముసి నవ్వులతో మాట్లాడుతుండగానే, ఆ వైపు భారతీయుల ప్రాణాలు కాల్పుల మోతలో గాలిలో కలిసి పోతూ ఉండేవు.బిడెన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సంస్కృతి మరింత పెరిగింది.ఉన్నత పదవుల్లో, ఉద్యోగాల్లో తమ దేశంలో స్థిరపడిన భారతీయులను నియమిస్తున్నామం టూనే చదువు కోసం వెళ్ళిన వారినీ, చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న వారినీ తుపాకీ కాల్పులకు బలి చేస్తున్న వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవడం లేదు. తమ అవసరాల కోసమే వారు ఇతర జాతుల వారిని వృత్తి ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారు. అక్కడ శ్వేతి జాతి అభిమానం మెండుగా ఉంది. నల్లజాతీయుల కన్నా, తెల్ల జాతీయుల వద్దే తుపాకులు ఎక్కువ ఉన్నా యి. రెస్టారెంట్లలో చిన్న తగాదాలకే రెచ్చిపోయి కాల్పు లు జరపడం శ్వేతజాతీయులకు అలవాటు.అక్కడ కొత్తగా వచ్చిన వారి గురించి నిమిషాలు,సెకన్ల మీద ఆరా తీస్తారు.వారిని బెదిరించి డబ్బు గుంజుతారు. ఇవ్వని వారితో ఘర్షణకు దిగి కాల్పులు జరుపుతారు. తుపాకు లున్నది రిపబ్లికన్‌ పార్టీ సానుభూతి పరులవద్దనే. అందు కే, ఆ పార్టీ తుపాకుల నియంత్రణకు అడ్డు పడుతోంది. ట్రంప్‌ అధికారంలో ఉన్నప్పుడు దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. ట్రంప్‌ అనుచరులు అమెరికా చట్టసభ భవనంపైనే దాడి చేసేందుకు యత్నించారు. ఎంతో భవిష్యత్‌ ఉన్న తెలుగు సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌ కూచిభొట్లను దుండగుడుఒకరు కాల్చి చంపాడు. అలాంటివి మన దృష్టికి రాని ఘటనలు అనేకం. గన్‌ కల్చర్‌ కారణంగా ఇటీవల మన విద్యార్ధులు, యువకు లు బలైపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అమెరికా తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి ఉర్రూతలూగుతున్న ప్రధాని మోడీ ఈ విషయమై దృష్టి ని కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement