Saturday, April 20, 2024

Editorial : అంకురం … భవిష్య‌త్తు ఉజ్వ‌లం…!

అంకుర సంస్థలు మన దేశంలో అతి స్వల్ప కాలంలోనే అభివృద్ది చెందాయి.అంకుర పరిశ్రమల పథకాన్ని మన దేశంలో 2016లో ప్రారంభించారు. సొంత ఆలోచన లతో ముందుకు వెళ్లేవారి కోసం ఈ కార్య క్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.ఇందుకు ఒక కార్యాచరణను రూపొందించింది. రాష్ట్రాల వారీగా అంకుర పరిశ్రమ లకు ప్రోత్సాహం ఇవ్వడం ఈ కార్యా చరణ ముఖ్యోద్దేశ్యం.

అంకుర సంస్థలు మన దేశంలో అతి స్వల్ప కాలంలోనే అభివృద్ది చెందాయి.అంకుర పరిశ్రమల పథకాన్ని మన దేశంలో 2016లో ప్రారంభించారు. సొంత ఆలోచన లతో ముందుకు వెళ్లేవారి కోసం ఈ కార్య క్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.ఇందుకు ఒక కార్యాచరణను రూపొందించింది. రాష్ట్రాల వారీగా అంకుర పరిశ్రమ లకు ప్రోత్సాహం ఇవ్వడం ఈ కార్యా చరణ ముఖ్యోద్దేశ్యం. అతి స్వల్ప కాలంలో అంకుర సంస్థల సంఖ్య 1.25లక్షలకు పెరిగింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహమే దీనికి కారణం. ఆర్థికా భివృద్ధికి, ఉపాధి అవకాశాలను పెంచడానికి అంకుర సంస్థలు ఎంతో దోహదం చేస్తున్నాయి. సరికొత్త ఆలోచనలతో కొత్త అన్వేషణలు చేసే యువతీ యువకులను ఈ కార్యక్రమం కింద ప్రభుత్వం ప్రోత్స హిస్తోంది.వారి కృషికి తగిన ప్రోత్సాహం, పెట్టుబడులు లభిస్తున్నాయి. వ్యాపారాన్ని సులభతరం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్ధేశ్యం. సుస్థిరమైన అభివృద్ధికి దోహదం చేయడం కూడా అంకురాల ప్రధాన లక్ష్యం.

- Advertisement -

యువతీయువకుల్లో ఆలోచనా శక్తిని పెంచడం,పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేందుకు అవసరమైన మనో బలాన్ని వారికి కలిగించడం కూడా అంకుర పరిశ్రమల ముఖ్యోదేశ్యం. ఎవరిమీదా ఆధారప డకుండా స్వతం త్రంగా మనుగడ సాగించడానికి ఇవి దోహదం చేస్తాయి.అంకుర పరిశ్రమలకు మూుడేళ్ళ పాటు పన్నుల విరామాన్ని ప్రభుత్వం ప్రకటించింది.ఈ పరిశ్రమలకు అవసరమైన అనుమతులన్నీ సింగిల్‌ విండో ద్వారా మంజూరు చేస్తారు. అంకుర పరిశ్ర మల్లో 45 శాతం పైగా మహిళల అధీనంలోనే నడుస్తు న్నాయి. దేశంలో ప్రస్తుతం 1.25 స్టార్ట్‌ప్‌ సంస్థలు, 110 యూనీకార్న్‌ సంస్థలు పని చేస్తున్నాయి. ఈ సంస్థల్లో మహిళలకు ఎక్కువగా ఉపాధి లభిస్తోంది. ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా యువతీయువకులు స్టార్టప్‌ సంస్థలను స్థాపించి తాము ఆర్థికంగా ఎదడమే కాకుండా, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు.

ఇది ఒ క ఉద్యమంగా సాగుతోంది… ఈ స్టార్ట్‌ప్‌ లలో లక్షలాది మందికి ఉపాధి లభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ స్టార్టప్‌లు కలిగిన దేశాల్లో మన దేశం మూడో స్థానంలో ఉంది.ఈ అంకుర పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి విశేషమైన ప్రోత్సాహం లభిస్తోంది.ప్రధానమంత్రి మోడీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నీ, డిజిటలై జేషన్‌ను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు ఢిల్లిలో స్టార్ట్‌ప్‌ కుంభ మహాసభల్లో బుధవారం జరిగిన చివరి రోజు స భలో ఆయన ప్రసంగించారు.ఎన్నికల ప్రచారంతో తీరిక లేకుండా ఉన్న మోడీ ఈ సభలో మాట్లాడినంత సేపు దేశంలో సాంకేతికాభివృద్ధి,పరిశ్రమల వృద్ధి గురించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.ఉద్యోగాల కోసం యువతీయువకులు ఎదురు చూడకుండా, ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని ఆయనపదే పదే చేస్తున్న సూచనలు ప్రతిఫలిస్తున్నాయి. స్టార్ట్‌ప్‌ అనేది స్థిరమైన ఆర్థిక నమూనాను అభివృద్ధి చేయడానికి, ఎంటర్‌పెన్యూర్స్‌ చేపట్టే సంస్థ.కొత్త అన్వేషణకు ఇది దోహదం చేస్తుంది.

కొత్త అన్వేషణల ద్వారానే ప్రపంచ దేశాల్లో పోటీని మన దేశం తట్టుకో గలుగు తుంది. అందుకే, ఈ అంకుర సంస్థలకు ప్రభుత్వం ప్రోత్సా హమిస్తోంది.మన దేశంలో ఇప్పుడు అంకుర సంస్థలు బాగా పని చేస్తున్నాయని విదేశాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. వీటి పనితీరును పరిశీలించేందుకు విదేశాల నుంచి అనేక మంది వస్తు న్నారు. మన సాంకేతిక పరిజ్ఞానం అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు ఉపయోగ పడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ అంకుర సంస్థల వల్ల మనవారి విజ్ఞానం, కొత్త విషయాల అన్వేషణా పరిజ్ఞానం మన పురోభివృద్ధికే ఉపయోగ పడుతోంది. స్టార్ట్‌ప్‌ సంస్కృతి క్రమంగా పెరుగుతోంది. ఐటి రంగం ఏ విధంగా అయితే, బహుముఖంగా వ్యాప్తి చెందిందో ఇప్పుడు స్టార్ట్‌ప్‌లు కూడా అలాగే వ్యాప్తి చెందుతున్నాయి.
భారత యువత ఎన్నో ఆలోచనలకు పదును పెడుతోందనీ, ఒక ఆలోచన విఫలమైతే నిరు త్సాహం చెందకుండా అంతకన్నా అత్యుత్తమమైన ఆలోచనకు అవకాశం ఇస్తోందనీ, రాజకీయాలకూ, స్టార్ట్‌ప్‌ రంగానికీ ఉన్న తేడా ఇదేనని ప్రధాని అన్న మాటల్లో నిజమెంతో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement