Monday, April 29, 2024

తెలుగులో యోగానంద ఆత్మసాక్షాత్కార సాధనా పాఠాలు

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఒక యోగి ఆత్మకథ యోగానంద ఆత్మ సాక్షాత్కార సాధనా పాఠాల తెలుగు అనువాదం శనివారం రాజమం డ్రిలో ఆదివారం విజయవాడలో విడుదల చేసారు. డిసెంబర్‌ 7న సాయంత్రం 5 గంటలకు హన్మకొండ ఫాతిమానగర్‌ బాల వికాసలో యోగానంద ఆత్మసా క్షాత్కార సాధనా పాఠాలు విడుదల చేస్తారు. డిసెంబర్‌ 10, 11 తేదీల్లో బేగంపేటలోని యోగదా సత్సంగ ధ్యానకేం ద్రంలో సాయంత్రం నాలుగు న్నర నుంచి ఆరున్నర వరకూ యోగదా తెలుగు పాఠాలు విడుదల కార్యక్ర మం ఉంటుంది. కార్యక్రమంలో స్వామి స్మరణానంద ప్రసంగిస్తారు. డిసెం బరు 1946లో విడుదలైనప్పటి నుంచి నిరంతరంగా అత్యధికంగా అమ్ముడవుతున్న తన మైలురాయి రచన ఒక యోగి ఆత్మకథతో జగ ద్గురువు పరమహంస యోగానంద లక్షలాది మందికి యోగా, ధ్యానాన్ని పరిచ యం చేశారు. ఈ పుస్తకం ఒక అసాధారణమైన జీవితం గురించి మనోహరంగా ఈ ఆత్మకథ ప్రపంచ వ్యాప్తం గా ఉన్న లక్షలాది మంది ఆధ్యాత్మిక అన్వేషకులను వారి జీవితాల్లో సమతుల్యమైన దైవాన్నే కేంద్రంగా చేసు కుని జీవించే విధానాన్ని అవలంబించడానికి ప్రేరేపించింది. యోగానంద అద్భుతమైన జ్ఞానం ఆయన అనేక రచనలు, ప్రచురణలలో వ్యక్తీకరించబడింది. ఆయన బోధనలలో అంతర్గతంగా క్రియాయోగ పవిత్ర శాస్త్రం, రాజయోగం స్వరూపముంది. ఇదిశరీరం, మనస్సును నిశ్చలం చేయడానికి ఉపయోగపడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement