Monday, April 29, 2024

మురళీకృష్ణుడిగా యాదాద్రి నృసింహుడు

యాదగిరి గుట్ట, ప్రభన్యూస్‌:యాదాద్రి శ్రీ లక్ష్మీనృసిం హుడుభగవద్గీతఉపదేశకులు… వేణుమాధ వుడైన మురళీ కృష్ణుడి అలంకారంలో మంగళవారం భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. అలంకర ప్రియుడైన నృసింహుడుని మురళీ కృష్ణుడిగా అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. వేణువు అద్యాంతం శూన్యంగా ఉంటుంది. భక్తులు తమ ఖర్మలు గాని, జ్ఞానం గాని భక్తితత్పరతలు గాని భగవణుడికి సమర్పిస్తే అహంకార రహితస్థితి ఏర్పడుతుంది. తదుపరి భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణం గా లభించుటకు అవకాశం కలుగుతుంది. ఈ తత్త్వాన్ని తెలియజేసేందుకే భగవనుడు మురళీ కృష్ణుడిగా భక్తులకు అలంకర సేవలో దర్శనం కలిగించారు. రాత్రి శ్రీ స్వామి వారు పొన్న వాహన సేవ పై భక్తులకు దర్శనం ఇచ్చారు. పొన్న వాహన సేవ ప్రత్యేకతను ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘళ్‌ లక్ష్మీనర సింహాచార్యులు వివరించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త బి నర్సింహామూర్తి, ఈవో ఎన్‌ గీత, ఈఈ ఊడెపు రామా రావు, ఏఈవోలు గజవెల్లి రమేష్‌బాబు, వేముల రాంమోహన్‌ , దోర్భల భాస్కరశర్మ, గట్టు శ్రవణ్‌కుమార్‌, జూశెట్టి కృష్ణ, డిప్యూటీ స్తపతి మోతీలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

నిత్యాన్నదాన నిర్వహణకు భారీ విరాళం
యాదాద్రి శ్రీ స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు జీయర్‌ కుటీర్‌లో నిత్యాన్నదానం చేస్తారు. ఈ నిత్యాన్నదానం నిర్వహణకు హైదరాబాద్‌కు చెందిన శాంత బయోటెక్స్‌ ఫౌండర్‌ డాక్టర్‌ వరప్రసాద్‌రెడ్డి రూ. కోటీ 8 లక్షలను విరాళంగా అందజేశారు. మంగళవారం కుటుంబ సమేతంగా శ్రీ స్వామి వారిని దర్శించుకున్న ఆయన ఆలయ ఈవో ఎన్‌ గీతను కలిసి విరాళం చెక్కును అందజేశారు. భక్తుల ఆకలిని తీర్చే భాగ్యం తన కు కలగడం అదృష్టంగా భావిస్తున్నానని డాక్టర్‌ వరప్రసాద్‌రెడ్డి విలేకరులకు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement