Sunday, April 28, 2024

ఏది స్వర్గం ఏది నరకం

పాపం, పుణ్యం, కర్మలు, ఫలితాలు, స్వర్గం, నరకం గురించి మనం రోజూ వింటూ ఉంటాం. వీటి మీదా విచారణ చేస్తుంటాం. మన ఆలోచనలన్నీ స్వర్గం నర కం చుట్టూనే పరుగులు తీస్తూ ఉంటాయి. నిజానికి స్వర్గం, నరకం రెండూ ఒకటేనా? వేర్వేరా? కలిసి ఉండి వేర్వేరుగా అనిపిస్తాయా? స్వర్గం, నరకం ఎక్కడుంటా యో? ఎలా ఉంటాయో, ఎందుకుంటాయో? మనకు తెలియదు. పూర్వం ఓ మహనీయుడు తన శిష్యుణ్ణి పిలిచి ”నీకు స్వర్గం ఇస్తాను. కావాలా?” అని అడిగేడు. దానికి శిష్యుడు ”స్వామీ, స్వర్గం అనేది ఏంటో నాకు తెలీదు. ఎక్కడుంటుందో, ఎలా ఉం టుందో నేను చూడలేదు. చూసొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళను అడిగి స్వర్గం గురించి తెలుసుకుందామంటే, స్వర్గాన్ని చూసొచ్చి నాకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. ఏమీ తెలియని, ఊహా జనితమైన ఆ స్వర్గం నాకెందుకు? నాకు అక్కరలేదు.” అని స్వర్గం మీద తన అనాసక్తతను గురువుకు వివరించాడు. సత్ప్రవర్తన, సత్‌ సంకల్పం, సచ్చీలత యిత్యాది మంచిపను లు మనిషి జీవించినంత కాలం ఆచరిస్తే మరణించిన తరువాత అతనికి స్వర్గం ప్రాప్తిస్తుందట. సర్వసౌఖ్యాలు ప్రాప్తిస్తాయట!!
మహామహా పాపాలు, నేరాలు, ఘోరాతి ఘోరాలు, జీవించి ఉండగా చేస్తే మరణించాక ఆ వ్యక్తి నరకానికి పోతాడట! అక్కడ పాశవికమైన శిక్షలను అనుభవిస్తారట!!
మంచిపనులు, పరోపకారాలు, దానాలు, ధర్మాలు, పవిత్ర మైన పుణ్యకార్యాలు చేస్తూ ఉంటే, మన మనసు చల్లబడి ప్రశాంత త లభిస్తుంది. మానసిక ప్రశాంతత వల్ల జీవితంలో శాంతీ, సౌ ఖ్యం లభిస్తాయి. తద్వారా ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది.
భౌతికాన్ని ఆధ్యాత్మికానికి అన్వయించుకుని, ఉత్తమోత్తమ ఆధ్యాత్మిక తత్వాన్ని అవలోకనం చేస్తే అదే అక్షరాలా స్వర్గం!
ఇక నరకం. మనకు తెలియకుండానే మనలో అంత: శత్రువు లు అరిషడ్వర్గాలనే కామ, క్రోధ, లోభ, మో#హ, మద మత్సరాలు. ఈ ఆరూ మన మీద అనుక్షణం స్వారీ చేస్తుంటాయి. అప్పు డు మనలో ఉండే సమతుల్యతను కోల్పోతాం. తత్ఫలితంగా అసౌ కర్యం, అశాంతి, మన మీద దండెత్తుతాయి. ఫలితంగా అనారో గ్యం పాలవుతాం. వివేకం, విచక్షణ కోల్పోయి కష్టాల నష్టాల ఊబి లో కూరుకుపోతాం. ఆ ఊబిలో ఉండలేక, అందులోంచి ఎంత ప్రయత్నించినా, పైకి రాలేక జీవితాంతం గిలగిల కొట్టుకుంటాం. ఇదే నరకమంటే! అశాశ్వతమైన వాటికోసం వెంపర్లాడటం ప్రాకృ తమైన ప్రేరకాలను అంటించుకోవటమే నరకం.
నిత్యమైన, సత్యమైన సంపద కోసం ప్రయత్నించటం, సాధ నతో పారమార్ధిక తత్వాన్ని పెంపొందించుకోవడమే అసలైన స్వర్గం. అందుకోసం పెళ్ళాం పిల్లలను వదలి, సన్యాసులమై తిరగ వలసిన అవసరం లేదు. అన్నింటిలోను ఉండాలి. దేనినీ అంటిం చుకోకూడదు. ఇదే ఆధ్యాత్మిక తత్వంలో అసలు సిసలైన స్వర్గం. ఉదాహరణకు నావ నీటిలో ఉన్నా నీటితో కలియకుండా, తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటుంది. అలాకాకుండా ఏ చిన్ని రంధ్రం ద్వారానో, ఆ నీటితో కలియడానికి ప్రయత్నించిందంటే చా లు, నీట మునిగి సర్వనాశనమై పోతుంది. పాలూ నీరును హంస వేరు చేసి చూడగలిగినట్టు, మనం జీవితంలో, ప్రతి దశలో మంచి చెడులను విశ్లేషించుకుంటూ, మంచిని అనుసరించటమే స్వర్గం. మంచిని అనుభవంలోకి తెచ్చుకోవటం స్వర్గం. మంచిని ఆచరించకపోవటం, అనుభవించ లేకపోవ టం, అనుభవంలోకి తెచ్చుకో లేకపోవట మే నరకం. ఇవే స్వర్గం- నరకం.
– రమాప్రసాద్‌ ఆదిభట్ల
93480 06669

Advertisement

తాజా వార్తలు

Advertisement