Friday, May 3, 2024

విశ్వగురువు శ్రీదత్తాత్రేయుడు

నేడు దత్త జయంతి
ప్రకృతినీ, ప్రతీ జీవినీ, ఎదురైన అనుభవాల్నీ గురువులుగా స్వీకరించి… పాఠాలు నేర్చుకొని మహాజ్ఞాన సంపదను ప్రపంచానికి పంచిన విశ్వగురువు శ్రీదత్తుడు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులైన త్రిమూర్తుల వర ప్రభావంతో… సప్తర్షులలో అగ్రగణ్యుడైన అత్రిమహర్షి మహాపతివ్రత అనసూయ దంపతులకు త్రిమూర్తుల స్వరూపుడు, త్రిముఖ దేహుడుగా శ్రీదత్తాత్రేయుడు మార్గశిర శుద్ధ పూర్ణిమ నాడు అవతరించాడు (జన్మించాడు). కనుక ఈ పూర్ణిమను పవిత్ర దత్త పౌర్ణిమ పర్వదినంగా భక్తులు జరుపుకుంటారు.
టాధరం పాండురంగం
శూల హస్తం కృపానిధిం
సర్వరోగహరం దేవం
దత్తాత్రేయ మహంభజే…!
అంటూ దత్తుడు ఆరోగ్య ప్రదాతగా పూజించబడతాడు.
‘దత్తం’ అంటే సమర్పించినవాడు అనీ, అత్రి పుత్రుడు కావడం తో ఆత్రేయుడుగా….. మొత్తంగా దత్తాత్రేయుడిగా ప్రసిద్ధుడై శ్రీదత్తా త్రేయ భగవానుడిగా…. విశ్వగురువుగా లోకారాధకుడయ్యాడు, త్రిమూర్తుల అనుగ్రహ అవతారుడు కావడంతో దత్తుడి రూపం మూడు శిరస్సులతో మహోజ్వలంగా, మహమాన్వితంగా, దివ్య తేజస్సుతో భాసించింది. దత్తాత్రేయుడి మూడు తలల్లో మధ్య శిర స్సు శ్రీ మహావిష్ణువుది, కుడివైపు శిరస్సు మహాశివుడిది, ఎడమ వైపు శిరస్సు బ్రహ్మ దేవుడిది. ఈవిధంగా త్రిమూర్తుల లక్షణాలు, త్రి మూర్తుల తత్వాలు మూర్తీభవించి ఆవిర్భవించాడు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఎంతో మహమాన్వితుడు. ఆదర్భమూర్తి, జగద్గురువు అయినందువల్లే సనాతనంగా ఆయనను శ్రీమహావిష్ణువు అంశుడు గా ఆరాధిస్తున్నారు. శ్రీమహావిష్ణువు 21 అవతారాల్లో దత్తాత్రేయ అవతారం 6వది అని భాగవత పురాణం చెబుతోంది. శ్రీ దత్తాత్రేయు ని కారణజన్మనూ, అవతార వైశిష్ట్యాన్ని, సకల లోకాలకు ఆయన చేసిన మహోపకారాలను నారద పురాణం, శాండిల్యోపనిషత్తు, అవ ధూత గీత, జీవన్ముక్తి గీత, దత్తచరిత్ర, దత్తాత్రేయ వజ్రకవచం, గర సం#హత, దత్తపురాణం తదితర కావ్యాలు వివరిస్తున్నాయి.
దత్తాత్రేయుడు ఉపనయనం అయిన వెంటనే అరణ్యానికి వెళ్ళి తపస్సు చేశాడు. తద్వారా పరిపూర్ణమైన జ్ఞాన సముపార్జన చేశాడు. ప్రాపంచిక విషయాలను వదిలి ఏకాంతవాసం చేశాడు. ప్రకృతిలోని ప్రతీ వస్తువునూ, ప్రతీ జీవినీ అలాగే తనకు ఎదురైన ప్రతి అనుభవ పరిస్థితినీ గురువులుగా భావించాడు. ముఖ్యంగా ఇరవై నలుగురినీ గురువులుగా స్వీకరించి సేవించాడు. జీవిత పాఠాలెన్నో నేర్చుకున్నా డు. తద్వారా అలవడిన మ#హత్తర విజ్ఞానాన్ని లోకహతార్థం ఆవిష్కరించాడు.
భూమి నుంచి సహనశీలత, గాలి నుంచి స్వేచ్ఛ, ఆకాశం నుంచి నిస్సంగత్వం (కోరిక లేకపోవడం) నేర్చుకున్నాడు. ఈవిధంగా ప్రకృతి నుంచి తెలుసుకు న్న విజ్ఞాన భాండాన్ని, అనుభవసారాన్నీ ప్రపంచానికి పంచిన క్రమంలో… అగ్ని నుంచి నిర్మలత్వాన్నీ సము ద్రం నుంచి గాంభీర్యాన్నీ, కపోతం నుంచి నిర్మోహత్వా న్నీ గ్రహించాలని చెప్పారు. కొండ చిలువలా భ్రాంతిలో పడకూడదన్నారు. స్పర్శకు దూరంగా ఉండమన్నాడు. మిడత నుంచీ, ఏనుగు నుంచీ పట్టుదలనూ, దేవ నుంచీ త్యాగనిరతినీ నేర్చుకోవాలన్నాడు. మానావ మానాల సమస్పందన అలవర్చుకోవాలన్నాడు. సాలె పురుగు నుంచి సృష్టి, స్థితి, లయకారుడు పరమాత్మేనని తెలుసుకోవాలన్నాడు. సీతాకోక చిలుకలా ఆత్మానంద అన్వేషణ సాగించాలన్నాడు. చంద్రుడి నుంచి వృద్ధి, క్షయాలు శరీ రానికే కానీ ఆత్మకు కావని గ్రహంచాలన్నాడు. ఆర్తులను కాపాడే చింతనను నీటి నుంచి అవగాహన చేసుకోవాలన్నాడు. చీమలా జిహ్వచాపల్యానికి లోను కారాదని తెలుసుకోవాలన్నాడు. ఇలాం టివెన్నింటినో తన గురువులుగా ప్రకటించి వాటి నుంచి నేర్చుకున్న అపార అనుభంతో జ్ఞానానందమయుడయ్యాడు. తాను నేర్చుకు న్న విజ్ఞాన సంపదను ప్రపంచానికి పంచి జగద్గురువు అయ్యాడు.
ఈ క్రమంలో దత్తాత్రేయ స్వామి…. సతి మదాలస ముద్దుల పుత్రుడు అలర్కుడికి యోగవిద్య నేర్పాడు. ఓంకారోపాసనా విధా నాన్ని ప్రబోధించాడు. పరశురాముడికి శ్రీవిద్యా మంత్రం, త్రిపురా రహస్యం, ప్రహ్లాదునికి ఆత్మజ్ఞాన రహస్యాన్నీ, ఆధ్యాత్మిక విద్యను ప్రబోధించాడు. యదు మహారాజుకు స్వశరీర పవిత్రత, సుబ్రహ్మణ్య స్వామికి ఆధ్యాత్మిక విద్యోపదేశం, కార్తవీర్యార్జునుడికి ధాతు విద్యా ప్రక్రియను, రస శాస్త్రాన్నీ, ఆదిశంకరులకు సహస్రనామోప దేశం చేశాడు. ఆధ్యాత్మిక సిద్ధి, నిష్కామ బుద్ధి, యోగవిద్య ఉపదే శాలను ముఖ్యంగా లోకాలకు చాటాడు. ఈ క్రమంలో అవధూత గీత, జీవన్ముక్త గీత, అవధూతోపనిషత్తు తదితర గ్రంథాలను రచిం చారు. ఈ నేపథ్యంలో గొప్ప అవధూత, మహాజ్ఞాని, చిరంజీవిగా అవతరించాడు. మధ్యభాగంలో అజ్ఞానాన్ని తొలగించే లోకగురు మూర్తిగా శ్రీదత్తుడు. ముల్లోకాలను రక్షించాడు. యుగయుగాలకు ఆయన ఆదర్శéమూర్తి అయ్యాడు. దత్తాత్రేయుడు ఆదిగురువైన పరబ్రహ్మస్వరూపుడిగా ఆరాధించబడ్డాడు. అన, కర్మ, గుణ, రూ ప, మాయ, నాశనాలు లేని సర్వాంతర్యామి అయ్యాడు. ప్రేమ, అహింస, భూత దయ, త్యాగశీలత, ఆత్మజ్ఞానం మనుషులకు రక్షణ కవచాలని ఉపదేశాలు చేశాడు శ్రీదత్తుడు.

దత్తాత్రేయుని 16 అంశలు

దత్త పురాణం దత్తాత్రేయుడు 16 అంశలు కలవాడని చెబుతోంది. శ్రీపాదవల్లభులు, శ్రీనృసింహ సరస్వతి, శ్రీఅక్కల్‌కోట మహరాజ్‌, మాణిక్య ప్రభువు, శ్రీ షిరిడీ సాయిబాబా, గజానన మహరాజ్‌, శ్రీకృష్ణ సరస్వతి మహరాజ్‌, వాసుదేవానంద సరస్వతి మహరాజ్‌, దశావతారాలుగా వెలసినట్లు దత్తపురాణం, మత్స్యపు రాణం, స్మృతికౌస్తుభంలో దత్త చరిత్ర విస్తృతంగా ఉంది.
శ్రీ దత్తుడికి గురువారం అత్యంత ప్రీతికరమైనది. ఆయనకు మేడి వృక్షం ఎంతో ఇష్టమైనది. దీంతో ఎందరో భక్తులు శ్రీదత్తాత్రేయ స్వామికి ఇష్టమయిన గురువారం నాడు పూజలు చేసి ఆయన కృప కు పాత్రులవుతున్నారు. అలాగే దత్తునికి ప్రీతికరమైన ”జంతు ఫలి”

అని పేరు కలిగిన మేడివృక్షాన్ని పూజ్యభావంతో కొలుస్తారు. ఆ చెట్టు కింద కూర్చొని భక్తులు శ్రీదత్త మంత్రం పఠించి ఆయన అనుగ్రహం పొందుతున్నారు. తరిస్తున్నారు. దత్తజయంతినాడు ఆస్తికులు జప తపాలతో, పూజలతో గడుపుతారు. పగలంతా ఉపవాసం చేసి, సా యంత్రం భజనలూ సత్సంగాలూ నిర్వహించుకుంటారు. దత్తచరిత్ర, అవధూత గీత తదితర గ్రంథాల్ని పారాయణ చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement