Sunday, April 14, 2024

Kurnool – భూముల రీ సర్వే రద్దు కోరుతూ రైతులు ధర్నా..

కర్నూలు(ఆస్పరి):రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీ సర్వేను రద్దు చేయాలని,ఆస్పరి మండల పరిధిలోని చిరుమానుదొడ్డి గ్రామానికి చెందిన రైతులు,సిపిఐ ( ఎంఎల్) లేబరేషన్ పార్టీ,సిపిఐ,సిపిఎం ఆధ్వర్యంలో బస్టాండ్ ముందు హైవే రోడ్డు పై బైఠాయించారు..
ఈ రీ సర్వేలో ఎకరాకు 50 సెంట్లు తక్కువ చూపిస్తున్నారని, రైతులకు తగాదాలు పెట్టే ఈ సర్వే ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.. ఇలా ఎందుకు తప్పులు తడకగా సర్వే చేస్తున్నారో తహసిల్దార్ వచ్చి సమాధానం చెప్పాలని రోడ్డు పై రైతులు ఆందోళ‌న‌కు దిగారు..

దీంతో ఎస్సై వరప్రసాద్ త‌న సిబ్బందితో వ‌చ్చి ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు.ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ రైతులను ఇబ్బంది పెట్టే ఈ రీ సర్వేను రద్దు చేయాలనిలేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చ‌రించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్ ) లేబరేషన్ పార్టీ మండల కార్యదర్శి మునిస్వామి,సిపిఎం మండల కార్యదర్శి రంగస్వామి,రైతు సంఘం జిల్లా కార్యదర్శినాగేంద్రయ్య,ఏఐవైఎఫ్ నాయకులు రమేష్, ఏఐఎస్ఎఫ్ సీనియర్ నాయకులు రాజు చిరుమానుదొడ్డి గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement