Tuesday, April 30, 2024

Mumbai | ఫిషింగ్ బోటులో గ్యాస్ లీక్.. ఇద్దరు క‌ర్నూల్ వాసులు మృతి..

ముంబై తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. చేపల వేటకు వెళ్లే బోటులో విషవాయువులు రావడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతుల్లో ఇద్దరు తెలుగువారు ఉన్నారు. ఈ ఘటన న్యూ ఫిష్ జెట్టీ సమీపంలో అంజనీ పుత్ర IND-MH-7-MM-1664 అనే ఫిషింగ్ బోట్‌లో ఉదయం 11 గంటల సమయంలో జరిగినట్లు ఎల్లోగేట్ ఠాణా పోలీసులు తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు..

ఇవ్వాల ఉదయం కిరణ్‌భాయ్ ఈశ్వర్‌భాయ్ తాండెల్ (43) అనే వ్యక్తి చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లాడు. కొంత ముందుకు వెళ్లిన తర్వాత.. పడవలో గ్యాస్ లీకేజీ కారణంగా అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడిని చూసేందుకు మరో వ్యక్తి వెళ్లగా.. అతడు కూడా స్పృహతప్పి పడిపోయాడు.

- Advertisement -

ఇలా ఒకరి తర్వాత మరొకరుగా.. మొత్తం ఆరుగురు వ్యక్తులు అపస్మారక స్థితికి చేరడంతో.. వారిని జేజే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో బి.శ్రీనివాస్ ఆనంద్ యాదవ్ (35 ఏళ్లు), బోటు యజమాని నాగా డాన్ సంజయ్ (27) చనిపోయారు. వీరిద్దరు ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు. సురేష్ నిమునా (28) అనే మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని.. అతడికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుననట్లు వెల్లడించారు.

మిగతా ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై మెరైన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చేపల బోటులో ఏయే వస్తువులను తీసుకొస్తున్నారు? విష వాయువులు ఎక్కడి నుంచి లీక్ అయ్యాయనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement