Sunday, April 28, 2024

తిరుప్పావై ప్రవచనాలు :

పాశురము : 20

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

ముప్పతు మూవర్‌ అమరర్కు మున్‌శెన్ఱు
కప్పమ్‌ తవిర్కుమ్‌ కలియే! తుయిలెళాయ్‌;
శెప్పముడైయాయ్‌! తిఱలుడై యాయ్‌! శెత్తార్కు
వెప్పఙ్గొడుక్కుమ్‌ విమలా! తుయిలెళాయ్‌;
శెప్పన్న మెన్ములైచ్చెవ్వాయ్‌ చ్చిఱు మరుఙ్గుల్‌
నప్పిన్నై నఙ్గయ్‌! తిరువే! తుయిలెళాయ్‌;
ఉక్కమున్‌ త ట్టొళియుమ్‌ తన్దున్‌ మణాళనై
ఇప్పోతే యెమ్మైనీరా ట్టేలో రెమ్బావాయ్‌.

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి మంగళాశాసనములతో…

- Advertisement -

తాత్పర్యము :
” ముప్పది మూడు కోట్ల దేవతలకు ముందుగా పోయి ముందు నిలిచి భయమును తొలగించు బలశాలీ! ఆర్జవము కలవాడా! పరాక్రమము కలవాడా! శత్రువులకు భయ జ్వరమును గలిగింపజాలిన నిర్మలా! నిద్రవీడుము.”
స్వర్ణకలశములను బోలిన మృదువైన స్తనములు, ఎర్రని దొండపండువంటి పెదవి సన్నని నడుము కలిగిన ఓ నీలాదేవీ! శ్రీరూపిణీ! మేల్కొనుము.
విసనకర్రను, అద్దమును ఇచ్చి నీ ప్రియునితో మేము స్నానము చేయునట్లు చేయుము.
ఆర్జము – అవిద్య
బలము – జగద్భరణము
స్తనములు – పరభక్తి, పరమభక్తి
అధరము – పరమాత్మయందు రక్తి
నడుము – విరక్తి
విసనకర్ర – నమ: అను పదము
అద్దము – ఓం
స్నానము- పరమాత్మకు సర్వవిధ కైంకర్యములను చేయుట

డా|| కందాడై రామానుజాచార్య ఎమ్‌.ఎ., పి.హెచ్‌డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement