Friday, May 10, 2024

భక్తుని హృదయ నివాసి

అనేక తలలు అనేక ముఖాలు, అనేక కళ్ళు అనేక కాళ్ళతో భగవంతుడు అంతటా వ్యాపించి ఉం టాడు. అన్నింటా భగవంతుడు ఉంటాడనే విషయాన్ని ”సహస్ర శీర్షా: పురుష: సహస్రాక్ష సహస్ర పాద్‌….” అంటూ పురుష సూక్తం వివరిస్తోంది. భగ వంతుడు ఉండే ప్రదేశాన్ని, మరోవి ధంగా, మరో కోణంలో ఇలా చెబుతారు. భక్తుడి హృదయంలో భగవంతుడు ఉం టాడని, భగవంతుడు భక్తుని హృదయ నివాసి అని అం టారు. భగవంతుడు ఉండే స్థానం విషయంలో పైన చెప్పిన రెండూ భిన్నంగా ఉన్నట్టు అనిపిస్తాయి. భగవంతుడు సర్వత్రా ఉంటాడని ఓ వైపు చెబుతూనే, మరో పక్క భక్తుడి హృదయంలో భగవంతుడు ఉంటాడు అనే విషయం విన్నప్పుడు/ చెప్పినప్పుడు, ఏమిటీ గందరగోళం అనిపి స్తుంది. పరస్పర విరుద్ధంగా అనిపించే ఈ రెండు విషయా లకు సమన్వయం కుదరక అయోమయంలో పడిపోతాం. విషయం ఏమిటో అర్ధంకాక ఆధ్యాత్మికం అంటే అర్థంకాని బ్రహ్మ పదార్ధంగా భావిస్తాం.
ఓసారి ఓ కుర్రాడికి ఈ సందేహమే వచ్చింది. తల, నుదురు, కాళ్ళు, భుజాలు, చేతులు, పొట్ట, ఇలా ఎన్నో భాగాలు భక్తుడి శరీరంలో ఉండగా, భక్తుడి హృదయాన్నే తానుండే స్థానంగా, ఆ భగవంతుడు ఎందుకు ఎంచు కున్నాడో ఎంతగా ఆలోచించినా అంతు చిక్కలేదు ఆ కుర్రా డికి. ఎందరినో ఈ విషయం గురించి అడిగాడు. ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపో యారు. చివరకు ఆ కుర్రా డు తిన్నగా పెద్ద గురువుగారి దగ్గరికి వెళ్లాడు. విషయం అంతా చెప్పి తన సందేహాన్ని నివృత్తి చేయమని గురువుని ప్రార్ధించాడు. అప్పుడు గురువుగారు… ”వెయ్యి ఎకరాల భూమి ఉన్న ఓ జమిందార్‌ తనకు ఇష్టమైన చోట తాను నివాసం ఉంటే, అది తప్పని ఆయన్ని ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుందా?” అని ఆ ప్రశ్నించారు.
”ఆయన స్థలం ఆయన ఇష్టం. ప్రశ్నించే హక్కు ఎవ రికీ ఉండదు.” అని సమాధానమిచ్చాడు కుర్రాడు. అప్పు డు గురువుగారు ”ఆ వెయ్యి ఎకరాల్లో మనం ఓ ప్రాంతాన్ని ఎంచుకుని, అందులో ఒక ప్రదేశాన్ని చూపించి, అందులో మీరు ఉండండి అని మనం జమిందారుని ఆజ్ఞాపించగల మా? అని మరో ప్రశ్న వేసారు గురువుగారు. ”ఆజ్ఞాపించ లేం” అని సమాధానమిచ్చాడు కుర్రాడు. అప్పుడు గురువు గారు ”అయితే ఆ జమిందారు గాలి, వెలుతురు బాగా వచ్చే అనువైన స్థలాన్ని తానే ఎంచుకుని, తనకు అను కూలమైన స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకుంటాడు . అవునా?” అని ఆ కుర్రాణ్ణి ప్రశ్నించారు. ”అవును. ఆ జమిందారు అలానే చేస్తాడు. అది అతనిష్టం” సమాధానమిచ్చాడు కుర్రాడు.
”అవును కదా! భగవంతుడు కూడా అంతే! సర్వం సమస్తం ఆ భగవంతునిదే కాబట్టి తనకు అనువైన అను కూలమైన చోటు, శుభ్రమైన చోటు, పరిశుద్ధమైన చోటు హృదయం కాబట్టి, భక్తుడి హృదయాన్ని తన నివాస స్థానంగా భగవంతుడు ఎంచుకున్నాడు. దేవుడు నివాసం ఉండే చోటును నిర్మలంగా పవిత్రంగా స్వచ్ఛంగా భక్తు డు ఉంచుకోవాలి. శరీరం మొత్తంలో స్వచ్ఛంగా ఉంచుకోవ డానికి అవకాశం ఉండేది ఒక్క హృదయం మాత్రమే అను వైనది. కాబట్టి భక్తుడికి ఆ సౌలభ్యం ఇవ్వడం కోసమే భక్తుడి హృదయాన్నే తన నివాసంగా భగవంతుడు ఎంపిక చేసుకు న్నాడు.” అని చెప్పటం ముగించారు గురువుగారు.
గురువుగారు చెప్పింది సంభ్రమాశ్చర్యాలతో విన్నాడు శిష్యుడు. విషయం పూర్తిగా అర్థం చేసుకున్న ముఖం ఆనం దంతో వెలిగిపోయింది.
భగవంతుడు తన నివాసంగా భక్తుని హృదయాన్ని ఎందుకు ఎంచుకున్నాడో చెప్పేందుకు చమత్కారంతో కూడిన సహితుకమైన గమ్మత్తయిన కథ యిది. అందుకే ”ఆధ్యాత్మికాన్ని అర్ధం చేసుకోవటంలోనే ఉంది ఆధ్యాత్మిక రహస్యమంతా” అన్నారు పెద్దలు. సాధన చేసి ఆధ్యాత్మి కాన్ని అర్ధం చేసుకో వాలి. అందరు ఆచరించాలి.

  • రమాప్రసాద్‌ ఆదిభట్ల
    93480 06669
Advertisement

తాజా వార్తలు

Advertisement