Saturday, April 27, 2024

సృష్టిలో తొలిదీపం భగవంతుడే!

ఆయన జ్యోతి స్వరూపుడు. అందుకే ఏ దేవుని, దే వత నామావళిని మనం గమనించినా ”పరం జ్యోతి, జ్యోతిసే నమ: అని పరంజ్యోతియే నమ:, జ్యోతి స్వరూపాయై నమ:” అని ఉంటుంది. తాను ప్రకాశిస్తూ అన్నింటినీ ప్రకాశింప చేసే రూపం ఏదో అదే జ్యోతి. అదే భగవంతుడు. వెలుగులకు వెలుగు, సమస్త లోకాలను కాం తిమయం చేయగలిగినవాడు పరమాత్ముడే.
పరమాత్మ ఎక్కడో ఉండడు. మన లోపలే ఉంటాడు. మనం పూజానంతరం చెప్పుకునే ”మంత్రపుష్పం” ఆయ న అనేక జ్వాలల సమాహారమని వర్ణిస్తుంది. ఇంకా హృద య క్షేత్రంలో పరమాత్మ జ్యోతిలా వెలుగుతుంటాడం టుంది. ఉపాసనా మార్గంలో తన లోపలికి తానే వెళ్లగలి గితే ఆ జ్యోతి తానే అని తెలుస్తుంది.
ఆ తెలుసుకోగలగడమే మనిషి జన్మకు సార్థకం. ఇదే మనిషి జన్మకు ప్రధానమైన లక్ష్యం కావాలి. లోపల ఉన్న వస్తువే తాను అనే విషయాన్ని అవగాహన చేసుకుని అక్కడే స్థిరంగా ఉండగలిగితే అప్పుడు ఈశ్వర తత్త్వం అర్ధం అవు తుంది. తద్వారా మోక్షం సిద్ధిస్తుంది. అందుకే దీపం ఉండ గా ఇల్లు చక్కపెట్టుకో అన్నారు.
శరీరం లోపల ఈశ్వర ప్రకాశం ఉండి శరీరం పని చేస్తుండగానే శాస్త్రాన్ని, గురువును ఆధారం చేసుకుని భగ వన్మార్గంలో ప్రయాణంచేసి పరమాత్మ తత్త్వాన్ని తెలుసు కునే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే జీవితానికి అర్థం, పర మార్థం.
”నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహ: స్పందతే!
జానామీతి తమేవ భాంత మనుభాత్యేతత్సమస్తం జగత్‌
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!” అంటారు శంకరులు.
అంటే కొన్ని రంధ్రాలున్న కుండలో దీపాన్ని వెలిగిస్తే ఆ దీప కాంతి అన్ని వైపులకు ప్రసరించి కాం తిని వెదజ ల్లుతుంది.
అలాగే, మన శరీరంలోని జ్ఞానజ్యోతి జ్ఞానేం ద్రి యాల ద్వారా ప్రకాశిస్తుంటే మనం అన్నింటినీ తెలుసుకొ గలుగుతున్నాం. లోపలి పరంజ్యోతి తెలుసుకునేందుకు ఆధారభూతమైనది బయట మనం వెలిగించే దీపం. ఈ దీప సహాయంలో లోపలి దీపాన్ని తెలుసుకోవాలి. అంటే బయటి దీపా న్ని గురువుగా భావించాలి.
ఆలయాల్లో కూడా సాధారణంగా గర్భగుడిలో ఎప్పుడూ కేవలం ఒక్క నూనె దీపం మాత్రమే ఉంటుం ది. ఆ దీప సాయంతోనే ఆలయం లోపలి పరమాత్మను చూడగలుగుతాం. అదేవిధంగా హృదయంలోని పర మాత్మను కూడా జ్ఞానజ్యోతి ద్వారా దర్శించగలగాలి. అం టే ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తుంది. ”అంతర్ముఖ స మారాధ్యా బహర్ముఖ సుదుర్లభ” అన్నారు. బయట వెతి కి తే కనిపించదు. ఆర్తితో, ఏకాగ్రతతో లోపల శోధించాలి. అప్పుడే పరమేశ్వరి దర్శనం లభిస్తుంది.
దీపం వెలిగించి పూజ చేసే సమయంలో ‘దీపం దర్శ యామి’ అన్న ఉపచారం వచ్చినప్పుడు దీపకాంతిలో పరమాత్మ పాదాలను దర్శించాలి. అంటే దీపాన్ని దేవుని
పాదాల చెంత ఉంచి అక్కడనుంచి పాదాలు

దర్శించమని కాదు. అలా మనోనేత్రంతో దర్శించగలగాలి. ఉజ్జ్వలమైన దీపకాంతిలో అంతకంటే తేజోమయమైన దైవం పాదాలు ప్రకాశిస్తుంటే ఆ కాంతిని మనం చూడ గలగాలి.
అలా చూడాలంటే సాధారణ దీపాలతో సాధ్యం కా దు. ఎవ్వరూ వెలిగించనవసరం లేకుండా వెలిగే సూర్యభ గవానుడే అసలైన దీపం. అందుకే,
”సూర్యే మధ్యది హ:” అంటాం.
సూర్యభగవానుడే దీపమై ఉన్నాడని అర్థం.

Advertisement

తాజా వార్తలు

Advertisement