Tuesday, May 7, 2024

రేపటి నుంచి శ్రీవారి అధ్యయనోత్సవాలు

తిరుమల శ్రీవెంకటే శ్వర స్వామి ఆలయంలో ఈనెల 12 నుంచి 2024 జనవరి 5వ తేది వరకు అద్యయనోత్స వాలు ఘనంగా జరగనున్నాయి. సాధారణంగా ధనుర్మాసంలో వైకుం ఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్య ప్రబంధ అధ్యయనంగా పిలిచే అద్యయనొ త్సవం ప్రారంభమవుతుంది. ఈ సందర్బంగా స్వామి వారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబం ధ పాశురాలను శ్రీ వైష్ణవ జియ్యంగార్లు గోష్టిగానం చేస్తారు. ఆళ్వార్‌ దివ్య ప్రబంధం లోని 4 వేల పాశురా లను 25 రోజుల పాటు రంగనాయకుల మండపంలో పారాయణం చేస్తారు. కాగా తొలి 11 రోజులను పగల్‌ప త్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరి స్తారు. 22వ రోజును కణ్ణినున్‌ శిరుత్తాంబు , 23వ రోజు న రామానుజ సూట్రందాది, 24వరోజు శ్రీవరాహ స్వామి శాత్తుమోర, 25వ రోజున అధ్యయనాలు పూర్తవుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement