Sunday, June 23, 2024

కుల… మత… ప్రాంతాలకు అతీతులు శ్రీసాయినాథులు

శ్రీ సాయినాథులు చేసే అపూర్వమైన, అద్భుతమైన లీలల వలన ఆయన ఖ్యాతి మహరాష్ట్రలోనే కాకుండా యావత్‌ భారతదేశంలో విశేషంగా పాకిపోయింది. దేశం నలుమూ లల నుండి లక్షల సంఖ్యలో భక్తులు నిత్యం శిరిడీకి వచ్చి శ్రీ సాయిని దర్శించుకునేవారు. ఆధ్యాత్మిక సిద్ధికి, లౌకికమైన కోరికల సిద్ధి కోసం ఇలా భక్తులు తమకు తోచిన విధంగా శ్రీ సాయిని ప్రార్ధించి తమ కోరికలను తీర్చుకొని అంతులేని ఆనందంతో తిరిగి వెళ్ళేవారు. శిరిడీకి వచ్చి శ్రీ సాయిని దర్శించి, తమ ఆలోచనా ధొరణిని మార్చుకొని ఆస్తికులుగా మారి తిరిగి వెళ్ళిన వారూ ఎందరో వున్నారు. సాయిని గురించి విని, ఆయనను దర్శించకుండానే ఆయనపై అనుచిత విమర్శలు చేసిన వారు ఎందరో! సాయి బ్రాహ్మ ణుడని, మహ్మదీయుడని, హందూ, ముస్లిం సాంప్రదా యాలను కలగలిపి నాశనం చేస్తున్నాడని ఎందరో బాహా టంగా విమర్శించారు. మరికొందరు శ్రీ సాయి హందువో, ముస్లిమో తెలుసుకునే ప్రయత్నాలను తీవ్రంగా చేసారు. వారికి ఎప్పటికీ సమాధానం లభించలేదు. కారణం శ్రీ సా యి పరిపూర్ణ పరబ్రహ్మ అవతారం. ఈ కుల, మత, ప్రాంతీ య బేధాలు ఆయనకు అంటవు. #హందూ దేవాలయాలను అపవిత్రం చేస్తే శ్రీ సాయి సహంచేవారు కాదు.
శిరిడీలో శిథిలావస్థలో వున్న శనేశ్వరుడు, గణపతి, శివ పార్వతుల ఆలయాలను తాత్యాకోటే పాటిల్‌ ద్వారా పునరుద్ధరింపజేసారు. అట్లే ఒక సందర్భంలో సాయి భక్తా గ్రేసరుడైన నానాచందోర్కర్‌ తన స్నేహతునితో కలిసి శిరిడీ వచ్చి శ్రీ సాయిని దర్శనం చేసుకొని ఆయన సన్నిధిలో కూ ర్చున్నారు. నానాను చూదగానే శ్రీ సాయి హఠాత్తుగా కోపిం చి ”నా సహవాసం ఇన్నేళ్లుగా చేస్తూ ఇంత మూర్ఖంగా ఎం దుకు ప్రవర్తించావు?” అని అన్నారు. సాయి మాటలు అర్ధం కాక నానా ”నేను చేసిన తప్పేమిటో దయచేసి వివరించండి సాయి” అని హృదయ పూర్వకంగా ప్రార్ధించాడు. అప్పుడు సాయి నానా చేసిన తప్పును వివరించి ఇంకెప్పుడూ అట్లా చేయవద్దని, చేసిన తప్పును మళ్ళీ చేస్తే తీవ్రమైన శిక్ష తప్ప దని హచ్చరించారు. జరిగిన విషయమేమిటంటే- శిరిడీకి వచ్చేముందు నానా చందోర్కర్‌ సాధారణంగా కోపర్‌గావ్‌ లో దిగి దత్త దర్శనం చేసుకునే వాడు. ఆ దత్త మందిరంలో వున్న పూజారి మందిర నిర్వహణ కోసం నానా చందోర్కర్‌ ను చందా అడిగాడు. మొదట్లో ఇస్తానని వాగ్దానం చేసి న నానా ఆ తర్వాత తప్పించుకు తిరగసాగాడు. ఆ పూజారి వ్రాసిన ఒక్క ఉత్తరానికి కూడా సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుత పర్యటనలో తన స్నేహతుడు దత్త బంధువైనప్పటి కీ, దత్తాత్రేయుడిని దర్శనం చేసుకుందామని కోరినప్పటికీ వినకుండా ఆలస్యమైపోతోందని సాకు చెప్పి కోపర్గాంవ్‌లో దిగకుండానే శిరిడీకి వచ్చేసాడు నానా చందోర్కర్‌. తాను చేసిన పని శ్రీ సాయికి తెలియదనుకున్నాడు నానా. గోదావ రిలో దిగి స్నానం చేసేటప్పుడు ఒక ముల్లు గుచ్చుకొని కా లంతా వాచిపోయింది. నడవలేక కుంటుతూ శిరిడీకి వచ్చి సాయి దర్శనం చేసుకున్నాడు నానా చందోర్కర్‌. శ్రీ సాయి ఇంకెప్పుడూ హందూ దేవతలను అగౌరవపరచవద్దని, ప్ర స్తుతం కాలి నొప్పి ప్రాయశ్చిత్తమేనని, ఇలాంటి సంఘటన పునరావృతమైతే తీవ్రమైన శిక్ష తప్పదని హచ్చరించారు.
మరొక సందర్భంలో శిరిడీలో ఒక తుఫాను సంభవిం చింది. నల్లని మేఘాలు ఆకాశాన్ని కప్పివేసాయి. గాలి తీ వ్రంగా వీచి అందరినీ భయకంపితులను చేసింది. ఉరుము లు, మెరుపులతో కూడిన కుంభవృష్టి కురిసి శిరిడి అంతా జల దిగ్బంధంలో చిక్కుకుంది. శిరిడీలో వున్న శనేశ్వరు డు, మారుతి, ఖండోబా, శివపార్వతులు, గణపతి మొదలై న ఆలయాలన్నీ నీట మునిగాయి. ప్రజలందరూ మశీదుకు పరుగులు తీసి శ్రీ సాయి కాళ్ళపై పడి, కన్నీరు మున్నీరుగా ప్రార్ధించి తమను రక్షించమని కోరుకున్నారు. ఆపదలో వున్న తన భక్త జనావళిని చూసిన శ్రీ సాయి హృదయం కరి గిపోయింది. వెంటనే ఆయన సట్కా తీసుకొని మశీదు బయటకు వచ్చి ఆగు! నీ తీవ్రతను తగ్గించు అని గర్జించా రు. క్షణాలలో వాతావరణం ప్రశాంతతను సంతరించుకుం ది. తుఫాను తగ్గిపోయింది. శిరిడీలో ప్రవేశించిన నీరు అం తా బయటకు పారింది. ఆకాశం నిర్మలమైంది. ప్రజలంద రూ శ్రీసాయిని స్తుతిస్తూ తమతమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఆశ్చర్యంగా గ్రామంలోని ఆలయాలు నీట మునిగినా వాటి కి వీసమెత్తు నష్టం కూడా జరగలేదు. మర్నాటి నుండి అం దులోని దేవతలు యథాతథంగా పూజలందుకున్నారు. హిందూ దేవతలను అపహాస్యం చేసినా, విగ్రహాలను నిర్ల క్ష్యం చేసినా సాయి ఆగ్రహానికి గురికాక తప్పదని పై లీలల ద్వారా మనం గ్రహించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement