Friday, June 7, 2024

రామానుజులకు స్ఫూర్తి శ్రీ మహాపూర్ణులు!

భగవంతుని విషయంలో సమయాన్ని బట్టి మార్పు రాకుండా, భగవంతుని యందే ఏకా గ్రమైన పరిపూర్ణ విశ్వాసం ఉండి, తననే విశ్వసించిన వాడిని పరమాత్మ శిరసా ధరిస్తాను అని చెప్పాడు పరమాత్మ. అట్లా విశ్వసించే వారి కులాన్ని, సంపదలను, ఆధిజాత్యాన్ని పక్క కు పెడతాం. దీన్ని విశ్వసించే పరంపర రామానుజ పరంపర. ఈ ఆచరణ ఆచార్యుల అంద రిలో కనిపిస్తుంది.
యమునాచార్యులవారి శిష్యులలో ఒకరు మారనేరి నంబి. ఆయన హరిజనుడు. యామునాచార్యులవారు తన ఆప్తుడిగా స్వీకరించారు. యమునాచార్యుల వారి శిష్యుడు మరొక ఆయన మహాపూర్ణులు. ఆయన కూడా ఈ మారనేరి నంబితో చాలా స్నేహంగా ప్రవ ర్తించేవారు. శ్రీరంగ క్షేత్రంలో మహాపూర్ణుల వారు ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేస్తు న్నారు. ఆ కార్యక్రమానికి ముందే మారనేరి నంబి మహాపూర్ణుల వారి ఇంటిని దర్శించటా నికి వచ్చారు ఎందుకంటే గృహ ప్రవేశం తర్వాత ఆయన రావడం సబబు కాదు అనుకొని. ఇక గృహప్రవేశం సమయానికి అందరు పండితులు కార్యక్రమాన్ని మొదలుపెడుతుంటే మహాపూర్ణులవారు అన్నారట గృహప్రవేశం అయిపోయింది, మా స్నేహతులు మారనేరి నంబి కాలు పెట్టిన క్షణమే అని చెప్పాడట. భగవంతుని అనుగ్రహం పొందిన వాళ్ళని ఆద రించాల్సిన రీతి ఇది. ఈ మారనేరి నంబి దేహయాత్ర చాలించకముందు మహా పూర్ణులతో అన్నారట, మిత్రమా ఈ దే#హం గురువు గారి కృప పొందినది. గురువుగారి సేవ చేసుకొనే అదృష్టం పొందినది ఈ శరీరం. కానీ ఈ శరీర సంబంధం కల నావాళ్లు ఈ సంస్కారం పొం దినవాళ్లు కాదు. అలాంటి వాళ్లు నా శరీరానికి అంత్యక్రియలు చేస్తే దాన్ని అపవిత్రం చేసిన ట్లు అవుతుందయా. దేవతలు ఆరగింపు చేసేది, దాన్ని అపవిత్రం చేయవద్దు అంటూ వారు దేహాన్ని వదిలారట. మహాపూర్ణులవారు మారనేరి నంబి దేహాన్ని బ్ర#హ్మమేద సంస్కారం తో సంస్కరించారు. ఆనాటి వాళ్ళంతా మహాపూర్ణుల వారిని బహష్కరిస్తాం అన్నా ఏం పట్టించుకోలేదు. శ్రీమద్రామానుజుల వారి గురువుగారు ఈ మహాపూర్ణులు. లోకులు ఏదో అనుకుంటుంటే వెళ్ళి రామానుజుల వారు అడిగారట. అందుకు సమాధానంగా మహా పూర్ణులవారు ఈ మారనేరి నంబి ఒక పక్షి (జటాయువు) కంటే ఏం అల్పుడు కాదు. నేను రాముడి కంటే గొప్పవాడిని అంతకన్నా కాదు అని చెప్పాడట.
రామానుజుల వారికి అదే ప్రేరణ. అందుకే ఆయన #హరిజనులు అంటూ తేడా చూపక గోపురాన్ని ఎక్కి మంత్రాలని, మంత్రార్థాలను యావత్‌ లోకానికి చాటారు. ఆలయంలో భగవంతుణ్ణి అందరూ దర్శించుకోవచ్చును అనే ఔదార్యాన్ని చూపినవారు.
నాథ మునులు, యమునాచార్యుల ద్వారా అందిన మంత్రాలని రామానుజాచార్యు లు రుచి ఉన్నవారికి అందేట్టు వ్యవస్థను ఏర్పాటు చేసారు. రామానుజాచార్యుల వారికి ముందు ఉన్న ఆచార్యులు మంత్రాలని మరొకరికి తెలియజేయడం ఎంతో పరిక్షించిగానీ చేసేవారు కాదు. రామానుజుల వారు సుమారు 40 సంవత్సరాలు దాటి, సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన జ్ఞాని అయి ఉన్నప్పటికీ చరమ శ్లోకలో ఉన్న గంభీరమైన తాత్పర్యాన్ని తెలుసు కోవడానికి 300 మైళ్ళ దూరంలో ఉన్న ఆచార్యుడి వద్దకి నడిచి 18 సార్లు వెళ్ళారు. అప్పు డు కానీ లభించలేదు. రామానుజాచార్యుల వారిలాంటికే అంత కష్టంగా లభిస్తే సామాన్యు లకు మంత్ర ఉపదేశం జరిగే ప్రశ్నే ఉండేది కాదు. ఆడవారికి, బ్రాహ్మణతరులకి ఉపదేశం అనేదే లేదు ఆకాలంలో. అలాంటిది అష్టాక్షరీ, ద్వయ మంత్రం, చరమ శ్లోకాన్ని ఒకేసారి ఉపదేశంగా అందేట్టు చేసారు శ్రీమద్రామానుజాచార్యులవారు. అది మన పరంపర. రామానుజాచార్యుల నిర్హేతుక కృప వల్ల మనం ఈనాడు ఆ పరంపరని అనుభవిస్తున్నాం. ఆ సంస్కృతిని మనం రక్షించుకోవాలి. ఆ క్రమంలో మనం జీవించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement