Saturday, May 4, 2024

సౌభాగ్య సిరి ‘అట్లతద్ది’ వ్రతం

పార్వతీదేవి (గౌరీ) శివుని భర్తగా పొందాలని కోరుకుంటుంది. నారదముని ఆ విషయం తెలుసుకుని వచ్చి ఆమె కోరిక ఫలించడానికి ‘అట్లతద్ది వ్రతం’ చేయమని చెప్తాడు. పార్వతీ దేవి ఈ అట్లతద్ది వ్ర తం చేసి మహాదేవుని భర్తగా పొందుతుంది. పార్వతీదేవి తొలుత చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. తెలుగునాట మహళలకే ప్రత్యేకమైన పండుగల్లో ‘అట్ల తద్ది’ ఒకటి. స్రీలు సౌభాగ్యం కోసం చేసుకొనే వ్రతం. వివాహతలు సౌభాగ్యాన్నీ, పెళ్ళి కావలసిన అమ్మాయిలు మంచి వరుడినీ ఆశిస్తూ చేసుకొనే వేడుక ఇది. ఆడవాళ్ళు తమ భర్తలు ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అట్లతద్ది జరుపుకుంటారు.
ఇది ఆశ్వయుజ బహుళ తదియ నాడు చేసుకుంటాం. పల్లె ప్రాంతాల్లో తెలుగింటి ఆడపడుచు లంతా తెల్లవారు ఝామున లేచి తల స్నానం చేసి ఉపవాసంతో ఇంటిలో తూర్పున మంటపాన్నీ ఏర్పరచి గౌరీదేవిని ప్రతిష్టిస్తారు. ముందుగా వినాయకుని పూజించి, ఆయన తల్లి ఐన గౌరీదేవిని స్తుంతించి, పాటలు పాడు తారు. సాయంత్రం వరకూ ఉపవాసం ఉండి, ఆకాశంలో చంద్రోదయమయ్యాక మరలా గౌరీమాతను పూజించి,’ త్రిదశ పరివృతాం సేవితాం సిద్దికామై:’ అంటూ స్త్రీలంతా అట్లను అమ్మవారికి నైవేద్యంగా సమ ర్పించి ప్రార్థిస్తారు. పదిమంది ముత్తైదువులకు బొట్టు, కాటుక ఇచ్చి, పాదాలకు పసుపు రాచి, ఒక్కొక్కరికి 11 అట్లు, 11 పండ్లు వాయనంగా ఇస్తారు. ఆమెకు నమస్కరించి, అక్షతలు శిరస్సున వేయించుకుని, అట్లతద్ది నోము కథ చెప్పుకుంటారు. పది పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు.
ముందు రోజు నుంచే పండుగ హడావిడి మొదలవుతుంది. తదియకు ముందురోజు విదియను భోగి అంటారు. ఆ రోజు తల రుద్దుకుని కాళ్ళకు చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. స్త్రీలు అరికాలిలో గోరింటాకు పెట్టుకుంటే అయిదవతనం వృద్ధి చెందుతుంది. తదియనాడు తెల్లవారుజామున మూడు, నాలుగు గంట లకు లేచి స్నానాలు చేసి చద్దన్నం, గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, గడ్డ పెరుగుతో కడుపు నిండా తిని తాం బూలం వేసుకుని చేతులూ, కాళ్ల మాదిరిగానే నోరును కూడా ఎర్రగా పండించుకుంటారు. ఆ తరువాత తిన్నది జీర్ణమయ్యే దాకా ఆటలాడుతూ, తోటల్లో చెట్లకు వేసుకున్న ఊయ్యాలలు ఊగుతూ’ ‘అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌- ముద్ద పప్పోయ్‌ మూడట్లోయ్‌’ అంటూ పాటలు పాడుతూ ఆనందంగా గడుపుతారు.
ఈ పండుగలో విశేష మేమంటే ఉయ్యాల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం, ముఖ్య ఘట్టాలు. దీన్ని ‘ఉయ్యాల పండగ’ అనీ, ‘గోరింటాకు పండగ’ అనీ కూడా అంటారు. ఈ పండగ చేయడం వలన గౌరీదేవి అనుగ్రహంతో పెళ్ళి కాని అమ్మాయిలకు మంచి సుగుణాలు కలిగిన వ్యక్తి భర్తగా వస్తాడనీ, పెళ్ళైన వారికి పిల్లలు కలుగుతారని, ముత్తైదు తనం జీవితాంతం ఉంటుందనీ, పుణ్యం వస్తుందనీ విశ్వాసం.
ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతంగా చెప్తారు. వివాహం కాని అమ్మాయిలు పూర్వం గ్రామాల్లో తప్పనిసరిగా మంచి భర్తకోసం ఈ వ్రతాన్ని చేసేవారు. ఈ వ్రతంలో చంద్రారాధన ప్రధానమైన పూజ. చంద్ర కళల్లో కొలువై వున్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యము పెరుగుతుంది. కుటుంబములో సుఖశాంతులు స్థిరం గా ఉంటాయి. ఈ పండగలో అమ్మవారికి అట్లు నైవేద్యముగా పెట్టడములో ఒక అంతరార్థం కూడా ఉంది. నవ గ్రహాలలోని కుజునికి అట్లంటే మహా ప్రీతి! అట్లను ఆయనకు నైవేద్యముగా పెడితే కుజదోష పరిహారమై సంసార సుఖములో ఎటువంటి అడ్డంకులు రావన్న విశ్వాసం. రజోదయమునకు కారకుడు కనుక ఋతు చక్రం సరిగా వుంచి ఋతు సమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువలన గర్భధారణలో ఎటువంటి సమస్యలు ఎదురవ్వవు. మినప్పిండి, బియ్యప్పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రా#హువునకు, బియ్యము చంద్రునకు ఇష్టమైన ధాన్యాలు. గర్భ దోషాలు తొలగిపోవాలం టే ఈ అట్లనే వాయనముగా ఇవ్వాలి. గర్భస్రా వము రాకుండా, సుఖ ప్రసవం అయ్యేందుకు కూడా ఈ అట్లదానం దోహదపడుతుందని అంటారు.
ముత్తైదువులకు అట్లను వాయనముగా ఇవ్వటం, వారి పాదాలు పట్టుకుని పసుపు రాయటం, గౌర వించడం వంటి పనుల వలన దానగుణం పెంచడంతో పాటుగా సమానత్వం, స్వార్ధ రాహత్యం కూడా పెరుగు తాయి. అట్లతద్దిలోని ‘అట్ల’కు ఇంతటి వైద్య విజ్ఞానం నిక్షిప్తం చేయబడి వుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement