Saturday, July 27, 2024

ఆకాశ దీపం…ఉసిరి దీపాలు…

తెలుగు మాసాలలో ఎంతో పవిత్రమైన కార్తీకం ఆకాశదీపం తో ప్రారంభమవుతుంది. నిజానికి ఆకాశ దీపాలు వెలిగించిన వాడు పరమేశ్వరుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవీ ఆకాశదీపాలు. సాధారణంగా ఆకాశదీపాలను దేవాలయాల లో ధ్వజ స్తంభానికి తాడుకట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలి గించి గాలికి నిధనం కాకుండా రంధ్రాలు ఏర్పాటు చేసి భగ వంతుని నామాలు ఉచ్చరిస్తూ భక్తుల సమక్షంలో దాన్ని జాగ్ర త్తగా పైకి లాగుతారు.ఇలా చేయడం వల్ల పితృదేవతలకు మా ర్గం చూపుతుందని నమ్మకం.ఆకాశదీపాన్ని వెలిగించినా, చూసినా, తలచుకొన్నా ఎంతో మంచిదని పెద్దలు చెపుతారు. ఇలా చేయడం వల్ల మనలో ఉన్న నెగెటివ్‌ ఎనర్జీ మొత్తం పోతుంది. కార్తీకదీపం కాంతి వల్ల పరమేశ్వరుడు ఆ ప్రాంతా న్నంతా కాడుతాడని ప్రజాల నమ్మకం. ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లలో కూడా ఆకాశదీపాలను వెలిగించవచ్చు. దీనివల్ల ఇళ్ళలోనుండే నకరాత్మక శక్తులు బయటకు పోతాయని పం డితులు చెపుతారు. ఎవరి శక్తి కొలదీ వాళ్లు తగినట్లుగా వారు కార్తీక మాసం లో భక్తులు ఆకాశదీపానికి చమురు,పత్తితో తయారుచేసిన వత్తులు ఇస్తూ ఉంటారు.

ఆకాశ దీపాన్ని ఎందుకు పైకెత్తుతారు …..

ఆకాశ దీపం ధ్వజస్తంబం మీద ఉండి ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా వెలుతురు చిమ్ముతుంది. ధ్వజస్తంభం పైకి ఏదైనా లాగారంటే పతాకాన్ని ఆరోహణ చేశామని, అంటే ఈశ్వరునికి ఉత్సవం నిర్వహస్తున్నట్లు.పూర్వకాలంలో రవా ణా వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందని ఆ.రోజుల్లో బాటసారు ల కోసం ఆకాశదీపాన్ని పెట్టేవారని తెలుస్తోంది. కాలినడకన వచ్చే బాటసారులు ఆకాశదీపాన్ని చూడటంతో అక్కడ ఒక దేవాలయం ఉందని సమీపంలోనే ఒక గ్రామం ఉంటుందని, రాత్రి సమయంలో ఆ గ్రామంలో తలదాచుకొని మరునాడు వారి ప్రయాణాన్ని కొనసాగించేవారని తెలుస్తోంది. ముఖ్యం గా ఆకాశ దీపాలు ప్రదూష వేళల్లో వెలిగించిన తరువాత వాటిని దర్శించుకొంటే సకల దోషాలు,పాపాలు దూరమవు తాయని నమ్మకం.అలాగే ఆవునేతితో దీపాలు పెట్టడం వల్ల కూడా పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని పెద్దలు చెపు తున్నారు.
ఉసిరి దీపం …ప్రాముఖ్యం

కార్తీకమాసంలో అందరూ దీపాలు పెట్టడం అనవాయి తీ. మహళలు వేకువ జామునే చన్నీటి స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగిస్తారు.కార్తీక దీపాలు అంటే సాధారణంగా ఒత్తు లతో చేసి వెలిగించేవే. పత్తితో చేసిన వత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి వాటిని అరటి డొప్పల్లో పెట్టి వెలిగిస్తారు. ముఖ్యం గా కార్తీక మాసంలో ఉసిరి దీపాలకు ప్రాముఖ్యత ఉంది. ఉసి రి కాయతో దీపాలు పెడితే అన్ని శుభాలు జరుగుతాయని నవ గ్ర#హ దోషాల, పరిహారం జరుగుతుందని ప్రజల నమ్మకం. ఉసిరికాయ గుండ్రంగా ఉండడం వల్ల దానిలో దీపం ఎలా పెట్టాలన్నది సందేహంగా ఉంటుంది. ఉసిరికాయ పై భాగం లో గుండ్రంగా కోసి దానిలో ఆవునేతిలో నానబెట్టిన పత్తితో చేసిన వత్తి వేసి దీపం వెలిగిస్తే ఎంతో పుణ్యమని భక్తుల నమ్మ కం.ఉసిరి దీపం వెలిగిస్తే అధిక ప్రయోజనాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం.ఉసిరి చెట్టును సాక్షాత్తు ఈశ్వర స్వరూపం గానే కొలుస్తారు. శివకేవులతో పాటు బ్ర#హ్మ, సకల దేవతతో ఉసిరి చెట్టులో కొలువై ఉంటార ని చెబుతారు.
ముఖ్యంగా దశమి, ఏకా దశి, సోమవారం, పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. ఇలా ఉసిరి దీపం వెలిగిస్తే శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవి సంతోషిస్తారని పురాణాలు చెపుతున్నాయి. ముఖ్యంగా ఇంటికి నరదిష్టి తొలగిపోతుందని పండితులు చెబుతారు.
ఉసిరి- అక్షయ నవమి

ఉసిరికి.. #హందు ధర్మంలో దీనికి ప్రత్యేకస్థానం ఉంది. అందులో కార్తీకంలో దీనికి ఇచ్చే స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కార్తీకంలో ప్రతీది ఉసిరితోనే ముడిపడి ఉంటుంది. దీనివెనుక సైన్స్‌ దాగి ఉంది. స్నానం, దానం, దీపం, భోజనం ఇలా అన్నింటిలో ఉసిరిని మన పెద్దలు చేర్చా రు.ఉసిరి దీపం వెలిగించడం వల్ల 7 జన్మల పాపాలు తొలగి పోయి లక్ష్మి దేవి అనుగ్రహం,అదృష్టం లభిస్తుందని నమ్మకం. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టాలని పెద్దలు చెప్తారు. అయితే ఆ సమయంలో ఉసిరికి సం బంధించిన పవిత్రమైన 21 నామాలను చదవాలని అంటారు.
ఉసిరి చెట్టును పూజించడం వల్ల అంతులేని పుణ్యం లభిస్తుందని పెద్దలు చెపుతారు…దీపావళి తర్వాత 8 రోజులు ఉసిరి నవమి వ్రతం పాటిస్తారు, దీనిని అక్షయ నవమి అనీ అంటారు. ఉసిరి నవమి స్వయం సిద్ధి కలిగించే శుభ సమ యం అని భవిష్య, స్కంద, పద్మ, విష్ణు పురాణాల ప్రకారం, ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా పూజిస్తారు. రోజంతా ఉప వాసం పాటిస్తారు, పూజానంతరం ఈ చెట్టు నీడలో కూర్చుని భోజనం చేస్తారు. ఇలా చేయడం వల్ల అన్ని రకాల పాపాలు, రోగాలు తొలగిపోతాయని నమ్మకం.

Advertisement

తాజా వార్తలు

Advertisement