Saturday, March 2, 2024

Google,  Facebook:  గూగుల్, ఫేస్ బుక్ ల పంట పండింది….ప్ర‌క‌ట‌న‌ల కోసం రూ.25 కోట్లు ఇచ్చిన రాజ‌కీయ పార్టీలు  

హైద‌రాబాద్ – తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల‌లో రాజకీయ పార్టీలు డిజిటల్, సోషల్ మీడియాలకు కోట్ల రూపాయలు యాడ్స్ కుమ్మరించాయి. గత నెల రోజుల్లోనే అంటే.. నవంబర్ ఒకటో తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ ప్రచారం ముగిసేంత వరకు.. అధికారికంగా.. నేరుగా గూగుల్, ఫేస్ బుక్ లకు అన్ని పార్టీలు కలిపి 25 కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చాయి.

ఇందులో గూగుల్ వాటా 20 కోట్లుగా ఉంటే.. ఫేస్ బుక్ వాటా 5 కోట్ల రూపాయలుగా ఉంది. అంతేందుకు గతంలో జరిగిన జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లోనూ 5 కోట్ల రూపాయలపైనే అన్ని పార్టీలు యాడ్స్ ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి.

గూగుల్, ఫేస్ బుక్ లకు ఎక్కువ యాడ్స్ ఇచ్చిన పార్టీల్లో బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే.. కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత బీజేపీ ఉంది. ఇక బీజేపీ అయితే జాతీయ స్థాయిలో ప్రచారం చేయటం విశేషం. అన్ని పార్టీలు కలిపి 2023, నవంబర్ నెలలోనే 52 వేల స్లాట్స్ ఫిల్ చేశాయి.. ఈ నెల రోజుల్లోనే.. గూగుల్, ఫేస్ బుక్.. తెలుగు రాష్ట్రాల్లో నడిపే యాడ్ స్లాట్స్ లో.. ఇది 57 శాతంగా ఉంది. అంటే ఆ రెండు ప్లాట్ ఫాంలకు రెగ్యులర్ గా వచ్చే యాడ్స్ లో.. 57 శాతం తెలంగాణ రాజకీయ పార్టీలవే కావటం విశేషం. ఇందులో వీడియో, ఇమేజ్ లతోపాటు వెబ్ సైట్స్, ఫేస్ బుక్ పేజీల స్పాన్సర్డులు ఉన్నాయి. మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు 25 కోట్ల రూపాయలు ఖర్చు చేయటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement