Thursday, May 2, 2024

హనుమాన్‌ చేతిలో శనీశ్వరుని గర్వభంగం!

కైలాసంలో తన దేవేరి పార్వతిదేవితో శివతాండవం, నృత్యా లు చేస్తూ చల్లని #హమగాలుల మధ్య ఉల్లాసంగా గడిపే దేవదే వుడు ఆ పరమేశ్వరుడు. సాక్షాత్తు ఆ పరమేశ్వరు ”నిన్ను పడ తాను” అన్న శనిదేవునితో వాదం పెట్టుకుని ”నన్ను పట్టలేవు” అని మూడు రోజుల పాటు చెట్టు తొర్రలో దాక్కున్న విషయం, కైలాశంలో వుండవలసిన శివుడు చెట్టు తొర్రలో ఉండటమే శని దోషం అన్న విషయం పురాణాల్లో మనం విన్నాము. అదే శని దోషం అంటే!
అలాంటిది మహా బలశాలి, శ్రీరామ బంటు అయిన హనుమంతునికి కూడా ఏడున్నర సంవత్సరాలు శని కాలం దాపురించింది. అయితే రాముని బంటు హనుమ తన భుజబ లమే కాదు బుద్ది బలం కూడా చూపి, తన దెబ్బకు శనిదేవుడే బ్రతుకు జీవుడా అంటూ తప్పించుకుని గర్వ భంగం పొందుతాడు. ఆ చరిత్ర తెలుసుకుందాం.
రావణుడి అపహరణకు గురైన సీతాదేవిని తిరిగి తెచ్చేందుకు లంక చేరేందుకు వానర వీరులంతా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయంలో శనీశ్వరుడు హను మంతుడు వున్న రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు పట్టేం దుకు. ఆ సమయంలో అక్కడ వానరులందరూ సేతువు నిర్మాణానికి పెద్దపెద్ద రాతిబండలను తీసుకుని వచ్చి సము ద్రంలో పడవేస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతుండగా శ్రీరాముడు ఒక బండ మీద ఆశీనుడై వానర వీరులు చేస్తున్న వారధి పనిని పర్యవేక్షిస్తున్నాడు.
అప్పుడు శనీశ్వరుడు శ్రీరాముని వద్దకు వచ్చి ”రామా! నేను #హనుమంతుని పట్టుకొనే కాలం వచ్చింది.” కనుక అను మతించాలని ప్రాధేయ పూర్వకంగా అడిగాడు.
అంతట శ్రీరాముడు శనీశ్వరా ”నన్నెందుకు అనుమతి అడగడం..నీ విధిని చెయ్యి”అని శ్రీరాముడు శలవిచ్చాడు.
అంతట శనిదేవుడు హనుమంతుని వద్దకు వెళ్ళి ”పరాక్ర మంలో మహావీరా ఓ హనుమా! నేను నీ వద్ద ఏడున్నర సంవ త్సరాలు ఉండబోతున్నాను.” అన్నాడు.
ఇందుకు బదులుగా హనుమంతుడు ”శనీశ్వరా నేను ఇప్పుడు నా స్వామి శ్రీరామ కార్యంలో నిమగ్నమైయున్నా ను. అంతకాలం కుదరదని శనితో హను మంతుడు తెగేసి చెబుతాడు. అంతట శని ”సరే, ప్రస్తుతానికి ఏడున్నర మాసా లు వుంటాను. సరేనా” అన్నాడు. అందుకు హనుమ ఒప్పుకో లేదు. కనీసం ”ఏడున్నర వారాలు” అంటూ కాల ప్రమాణం తగ్గించుకుంటూ దిగి వచ్చాడు శనీశ్వరుడు .
హనుమంతుడు, రామనామం ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక ఏడు క్షణాల కాలం తనను పట్టుకోవలసిందిగా కోరాడు. అప్పుడు శనీశ్వరుడు ”నీ కాళ్ళలో ప్రవేశించనా” అని అడిగాడు.
హనుమంతుడు ”వద్దు… సేతువు కట్టడానికి రాళ్ళను తే వాలి, పరిగెత్తాలన్నా, నడవాలన్నా కాళ్ళు అవసర”మన్నాడు.
”అయితే నీ చేతులు పట్టుకోనా” అన్నాడు శనీశ్వరుడు.
”ఆ రాళ్ళని చేతులతోనే కదా మోసి తెస్తున్నాను. చేతులు పట్టుకోవద్దు.” అన్నాడు హనుమంతుడు.
”అయితే, నన్ను ఏం చెయ్యమంటావు? నీ భుజాల పైన ఎక్కమంటావా”అన్ని ఆంజనేయుడిని శనీశ్వరుడు అడిగాడు.
”రామలక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకుని వెడుతున్నాను. అందువలన భుజాలు ఎక్కడానికి వీలులేదు” అన్ని కచ్చితంగా శనితో చెప్పాడు హనుమంతుడు.
”పోనీ, నీ హృదయంలో అయినా వుండవచ్చునా?” అని శనీశ్వరుడు అడగ్గా- ”ఈ హృదయంలో, సీతాదేవి, నా దేవుడైన శ్రీరాముడు నిరంతరం నివసిస్తూ వున్నారు, కనుక అక్కడ నీకు అసలు చోటు లేదు.” అని సెలవిచ్చాడు #హనుమ.
”అలాగే అయితే, చివరకు నీ శిరస్సు ఒక్కటే ఖాళీగా వున్నది. అక్కడయినా వుంటాను” అన్నదే తడవుగా శనీశ్వరు డు, హనుమంతుని శిరస్సు పైన ఎక్కి కూర్చున్నాడు.
హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సుపై (శనీశ్వరుని మీద) పెట్టుకు ని ఒక్కొక్క బండను సముద్రంలో వేయడం మొదలెట్టాడు. ఆ బండరాళ్ళ బరువును మోయలేక శనీశ్వరుని కళ్ళు తేలేసాడు. మరో పెద్ద బండరాయిని #హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే, శనీశ్వరునికి ఊపిరి సలపక గిల గిలలాడాడు. #హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే శనీశ్వరుడు హనుమ శిరస్సుపై నుండి కిందకి దూకి ఊపిరి పీల్చుకుంటూ ”మారుతీ, నీవల్ల నాకు శ్రీ రాము ని సేవించుకునే భాగ్యం కలిగినది. నీవు సకల శక్తులకు అతీతు డవైన రామ భక్తుడవు. నీముందు నా శక్తి చాలదు. నిన్ను నేను పట్టలేను, కనుక ఇంతటితో నన్ను వదిలిపెట్టు మహానుభా వా” అంటూ చేతులెత్తేసి ఒకే పరుగుపెట్టాడు శనీశ్వరుడు.
నిర్మల భక్తి, నిశ్చల మనస్సుతో శ్రీరాముని సేవలో నిమ గ్నమైవున్న ఎవరిని కూడా శనీశ్వరుడు రెండు క్షణాలు కూడా పట్టుకొనలేడు. పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం శ్రీరామ నామం జపిస్తే కష్టాల నుండి తప్పక విముక్తి కలుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement