Friday, May 3, 2024

భక్తికి… కార్యసాధనకు ప్రతీకపవన సుతుడు!

ప్రపంచంలో ఎవరికి లేనన్ని గొప్పసుగుణాలు, మహోన్నత వ్యక్తిత్వం, సకల విద్యాపారంగత్వం, సునిశిత పరిశీలన, కార్య శూరత, లక్ష్య సాధన, ధైర్యం, ఆత్మవిశ్వాసం, కోరికలు లేకపోవ డం, ఆజన్మ బ్రహ్మచర్యం, వినయం, విధేయత అచంచల భక్తి ఇలా… ఎన్నో ఎన్నెన్నో సుగుణాలు ఆంజనేయస్వామి సొంతం. అందుకే ఆయన లోకారాధ కుడయ్యాడు. దేవుని(శ్రీరాముని)తో సమానంగా పూజ లందు కుంటున్నాడు. తన హృదయాన్నే శ్రీరామమందిరంగా నిర్మించుకుని శ్రీరాముడిని ఆరాధిం చాడు. నేడు హనుమజ్జయంతి సందర్భంగా హనుమద్వంతం. హనుమజ్జయంతిని వేరువేరు చోట్ల వేరువేరు దినాల్లో నిర్వహిస్తారు. ఉత్తర భారతదేశంలో కొన్నిచోట్ల చైత్ర పౌర్ణమినాడు జరుపుతుండగా… దక్షిణ భారత దేశంలో పలుచోట్ల వైశాఖ బహుళ దశమినాడు నిర్వహిస్తారు.

రామాయణ ఉపనాయకుడు
రామాయణానికి శ్రీరాముడు నాయకుడైతే… శ్రీరాము ని విజయాలన్నింటికి కీలకంగా దోహదపడిన హనుమంతు డు ఉపనాయకుడు. రామాయణంలోని ఏడు కాండలలో ఒకటైన సుందర కాండలో మాత్రం మారుతి నాయకుడు. రామాయణంలో ఆంజనేయుని ప్రవేశం కిష్కింద కాండ నుంచి మొదలవుతుంది. సిందూరంపై ప్రీతి సిందూరవర్ణంపై మారుతికి ఎందుకంత ప్రీతో రామా యణం పేర్కొంది. భీకరంగా రామ, రావణ యుద్ధం సాగు తున్న క్రమం లో ఒకరోజు శ్రీరాముడు హనుమంతుని భుజా లపై ఎక్కి రావణునితో యుద్ధానికి తలపడ్డాడు. రాముడు- రావణుడు ఒకరిపై ఒకరు అస్త్రశస్త్రాలు సంధించుకుంటు న్నారు. ఈ క్రమంలో రావణుడి బాణాలు ఆంజనేయు నికి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. దేహమంతా నెత్తురుతో తడిసి బాధిస్తున్నా ప్రభువు రణదీక్షకు ఏమాత్రం భంగం రాకుండా తన స్వామి రావణుని సంహరించడానికి ద్విగిణీ కృతోత్సాహుడ య్యాడు. అప్పుడు గాయాలతో తడిసిన తన రక్తదే హం విరగబూసిన సిందూరవర్ణపు మోదుగుపూల మహా వృక్షం వలే జ్వాజ్వల్యమానంగా మెరిసిపోతున్నట్లు, మహా కాంతివంతంగా ప్రకాశించినట్లు వాల్మీకి మహర్షి వర్ణించాడు. తన ప్రభువు కోసం తన అరుణ రుధిరం అర్పి స్తున్నందుకు హనుమ ఎంతగానో ఆత్మానందం పొందాడు. ఆ సమయంలో తన శరీరం సిందూరవర్ణంతో మెరిసిపో వడంతో సిందూరవర్ణంపై మారుతికి మక్కువ కలిగింది. ఈ సంఘటనకు స్మృతిగా ఆనాటి నుంచి ఆలయాల్లో హను మకు సిందూరం పూయడం ఆచారంగా మారింది. హనుమకు సిందూరమంటే ఎందుకు ఇష్టమో మ రొక కథ వుంది. సీతమ్మ తల్లి తరచూ నొసట సిందూరం పెట్టు కుంటూ కనిపిస్తోంది. ఇందుకు కారణమేమిటి తల్లి అని అడి గాడు హనుమ. అందుకు ”శ్రీరాముడు దీర్ఘాయుష్కుడై చిరకాలం వర్థిల్లడానికి” అని సీతమ్మ తల్లి చెప్పింది. దీంతో తన ప్రభువు దీర్ఘాయుష్కుడిగా జీవించడానికి ఆంజనేయు డు తన దేహమంతా సిందూరం పూనుకున్నాడు. ఇలా ఎల్ల కాలం ఇష్టంగా సిందూరం పూనుకోవ డంతో భక్తులు కూడా ఇష్టంగా చేసుకొని ఆయన విగ్రహాలకు సిందూరం పూస్తూ ఆయన కటాక్షం పొందుతున్నారు.
కార్యార్థికి విశ్రాంతి కూడదు
ఈ మాట స్వయంగా హనుమ నోటివెంట వెలువడింది. సీతాన్వేషణకు సముద్ర ప్రయాణం చేస్తున్న హనుమకు సముద్రంలో రెక్కలున్న మైనాక పర్వతుడు తారసపడి హనుమను తనవద్ద కొంతసేపు సేద తీరమని కోరాడు. హనుమ సున్నితంగా తిరస్కరించి ”కార్యార్థి అయి పోయే ప్పుడు విశ్రాంతికి తావులేదు. అది లక్ష్యసా ధనకు విఘాతం కలిగిస్తుంది” అని ముందుకు సాగాడు. అకుంఠిత శ్రీరామ భక్తి, స్వామికార్యం, స్వకార్యంగా త్రికరణ శుద్ధిగా సాధిం చిన కార్యశూరుడు. కార్యసాధకుడిగా హనుమ శ్రీరాము నితో కీర్తింపబడ్డాడు. బంటు… నమ్మినబంటు, శ్రీరామ బంటు, అపజయమెరుగని విజేత అని కొనియాడాడు.
చిరంజీవిగా వరం
సీతమ్మ జాడను కనుగొనడానికి సముద్ర మార్గంలో బయలుదేరిన ఆంజనేయుడికి ఎన్నో అవరోధాలు, అగచా ట్లు, ఆటంకాలు ఎదురయ్యాయి. అంతకుమించి రాక్షసుల నుంచి పరిణమించిన ముప్పు, ప్రాణగండాలను శక్తితో, బల, పరాక్రమాలతో ప్రతిఘటించి ముందుకు సాగాడు. ఒకే లక్ష్యం, ఒకే పట్టుదల, ఒకే దృఢ దీక్ష అతన్ని సీతమ్మ జాడ కోసం ద్విగిణీకృతోత్సాహంతో ముందుకు నడిపించింది. అందుకే శ్రీరామ కార్యంలో విజయుడైనాడు. శ్రీరాముడు రావణ, కుంభకర్ణాది మహారాక్షస వీరులెందరినో హతమా ర్చడం, ఇంద్రజిత్తు శరాఘాతం నుండి లక్ష్మణుడిని బతికిం చడం, సీతమ్మను శ్రీరాముని దరిజేర్చడం లంకకు విభీష ణున్ని రాజును చేయడం, రావణ సంహారం అనంతరం అయోధ్యకు సకాలంలో తిరిగివచ్చి భరతుని ప్రాయోపవే శాన్ని నివారించి శ్రీరామ పట్టాభిషేకం చేయడం వంటి కార్యాలన్నింటి విజయాలకు కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఆంజనేయుడని రాముడు ప్రకటించాడు. ఇన్ని మహోపకా రాలు చేసి తన కీర్తిని యావత్‌ ప్రపంచానికి చాటిన హనుమ తన ఆత్మ, తన బహి:ప్రాణం అంటూ కొనియాడాడు. తనకు భరతునితో సమానమంటూ ఆనందాన్ని వ్యక్తంచేశాడు. ఇందుకు ఆచంద్రతారార్కం చిరంజీవిగా వర్థిల్లుతావని; నవబ్రహ్మల్లో ఒక బ్రహ్మగా… భావి బ్రహ్మగా జగాన ఆరా ధించబడతాడని హనుమకు శ్రీ రాముడు వరమిచ్చాడు.
– తాళ్ళపల్లి యాదగిరి గౌడ్‌, 9949789939

Advertisement

తాజా వార్తలు

Advertisement