Wednesday, December 4, 2024

మహాయోగి శ్రీ అరబిందో మహాభినిష్క్రమణ

మృత్యువును జయించాలంటే మరణాన్ని ప్రేమించ డానికి సిద్ధంగా ఉండాలి.” అంటారు శ్రీమాత, అవతార పురుషులు శ్రీ అరవిందుల సమాధి డిసెంబర్‌ 5, మహాసమాధి డిసెంబర్‌ 9 సందర్భంగా శ్రీ అరవిందుల గురించి మననం చేసుకుందాం.
అరవిందుల వారి గురించి ఈ తరం వారికి ఏమీ తెలి యదంటే అతిశయోక్తి కాదు. 1872 ఆగస్టు 15న కలకత్తాలో జన్మించిన శ్రీ అరవిందులు ఏడవ ఏటనే ఇంగ్లీషు చదువుల కోసం ఇంగ్లాండుకు వెళ్ళారు. ఆయనను ఓ కలెక్టర్‌గా చూడాలని వారి తండ్రి డా. కృష్ణదన్‌ ఘోష్‌ ఆశ, ఇంగ్లాండు లో ఐ.సి.యస్‌. పరీక్షలో ఉత్తీర్ణుడైన అరవిందులు కావాలనే ఆ రోజులలో కలెక్టరు ఉద్యోగానికి అవసరమైన గుర్రపు స్వారీ పరీక్షకు హాజరు కాలేదు. 1893లో ఇండియాకు తిరి గి వచ్చి బరోడా సంస్థానంలో ఉద్యోగంలో చేరి చివరికి మహారాజా కళాశాలకు వైస్‌ ప్రిన్సిపాల్‌ అయ్యారు. ఓ ప్రక్క ఉద్యోగం చేస్తూనే విప్లవ మార్గంలో దేశ స్వాతంత్య్రం కోసం కృషి చేశారు. ఆ తర్వాత కలకత్తా వచ్చి ప్రత్యక్షంగా రాజకీయాలలో పాల్గొన్నారు. అలీపూర్‌ బాంబు కేసులో ఇరికించి, ఆయనను బ్రిటిష్‌ ప్రభుత్వం అండర్‌ ట్రయల్‌ ముద్దాయిగా కారాగారంలో ఓ సంవత్సరం పాటు బందీగా వుంచిన కాలంలో ఆధ్యాత్మిక సాధనలు చేపట్టి ‘వాసుదేవ’ దర్శనం పొందారు. ఆ కేసులో శ్రీ అరవిందులను దోషిగా నిరూపించలేని ప్రభుత్వం ఆయనను విడుదల చేసింది.
చివరికి 1910 ఏప్రియల్‌ నెల 10వ తేదీన పాండిచ్చేరి చేరుకుని ఆధ్యాత్మిక సాధనను కొనసాగించారు. 1914లో ఫ్రాన్స్‌ నుండి మిర్రా అల్ఫాసా అనే ఓ ఫ్రెంచి విదుషీమణి పాండిచ్చేరి వచ్చి శ్రీ అరవిందులను కలుసుకున్నారు. ఆమె అప్పటికే ఆధ్యాత్మికంగా బాగా ఎదిగారు. అతీంద్రియ శక్తులు పొందారు. ఆమె కోరిక మేరకు శ్రీ అరవిందులు ‘ఆర్య’ అనే పత్రికను స్థాపించి, అందులో గీతావ్యాసాలు, భారతీయ సంస్కృతీ పునాదులు, వేద నిగూఢ రహస్యాలు, దివ్యజీవనం, యోగ సమన్వయం, భవిష్యత్కవిత వంటి అనేక విషయాలపై రచనలు చేశారు.
ప్రథమ ప్రపంచ యుద్ధకాలంలో ‘మీరా’ ఫ్రాన్స్‌ దేశం తిరిగి వెళ్ళాల్సి వచ్చినా, 1920 ఏప్రియల్‌ నెల 24వ తేదీన మళ్లిd పాండిచ్చేరి వచ్చి శ్రీ అరవిందులు ఆధ్యాత్మిక సహచ రిగా జీవితం కొనసాగించారు. 1926 నవంబర్‌ 24న శ్రీ అరవిందులు తమ తపస్సులో అత్యంత కీలకమైన సిద్ధిని పొందారు. ఆ రోజు వారిలో శ్రీకృష్ణ చేతనం లీనం అయింది. అయితే అది ఆయన తపస్సుకు ముగింపుకాదు, అంత కన్నా, ఉన్నతస్థాయిని అందుకొనడం కోసం తమ తపస్సు ను తీవ్రతరం చేశారు. అప్పటికి దాదాపు 24 మంది శ్రీ అరవిందుల శిష్యులు ఉండేవారు. వారి ఆధ్యాత్మిక అవస రాలను చూసే బాధ్యతను శ్రీ అరవిందులు మీరాకు అప్పగిం చారు. వారి ఆధ్యాత్మిక పరిసరాలతో పాటు వారి యోగక్షే మాల బాధ్యతను కూడా మీరా తానే వహంచారు. ఆనాటి నుండే మీరా ‘మదర్‌’ అయ్యారు. వారి నివాస స్థానం శ్రీ అరవిందాశ్రమంగా పిలువబడింది. ఆ ఆశ్రమాన్ని స్థాపిం చింది శ్రీ అరవిందులు కాదు. ‘మదర్‌’ ఆ ఆశ్రమాన్ని స్థాపిం చారు. అది ఈనాడు జగత్‌ ప్రసిద్ధమైంది. శ్రీమాత అర విందుల ఆధ్యాత్మిక సహచరి. శ్రీ అరవిందులు అనుయా యులకు వారిరువురూ ఒకే పరతత్త్వం రెండుగా అవతరిం చిన అవతారాలు, ఆ విషయాన్ని లోతుగా పరిశీలించిన వారికి ఆ అవతార రహస్యం గోచరిస్తుంది. శ్రీ అరవిందుల యోగం పూర్ణయోగంగా పిలువ బడుతున్నది.
శ్రీ అరవిందులు తమ యోగ ఫలసిద్ధిని వేగిరపరచ టానికి వ్యూహాత్మకంగా డిసెంబర్‌ 5, 1950 సంవత్సరము తెల్లవారుజామున 1.20 గం.లకు ఇచ్ఛాపూర్వకముగా తమ దేహమును త్యాగమొనరించారు. నిర్వాణాం శ్రీ విందులు భౌతికకాయంలో మృత్యుచ్ఛాయలు కానీ, లక్షణాలు గానీ ఎక్కడా గోచరించలేదు. వారి ముఖంలో, దేహంలో అసా ధారణమైన కాంతి, తేజస్సు కనిపించసాగింది. కళ్లు మూ సుకొని, యోగ నిద్రలో ధ్యాన నిమగ్నులై వున్నట్లుగా ఉన్నా రు. మృతదేహం అన్న భావనే కలుగలేదు ఎవరికీ, అప్పటి ఫ్రెంచి ప్రభుత్వం వైద్యులు కూడా వారి దేహంలో ఎలాంటి మృత్యుఛాయలు లేవని ధృవీకరించారు.
9వ తారీఖు వరకు 111 గం. ల పాటు వేలాదిమంది ఈ బంగారు ఛాయ కలిగిన దేహాన్ని దర్శించారు. డిసెంబర్‌ 9వ తేదీన శాశ్వత సమాధిలోకి వెళ్లింది వారి భౌతిక కాయం, సూక్ష్మ భౌతిక లోకంలో విశాల పరిధిలో తన కార్య క్రమాన్ని చేపట్టి, 1956 ఫిబ్రవరి 29న అతిమానస శక్తిని పృధ్వీ చేతనలోకి అవతరింపజేసారు. నూతన మానవజాతి ఆవిష్కరణలో ఆ మహాశక్తి తన పని తాను చేస్తున్నది..
సృష్టి పరిణామ క్రమంలో నూతన మానవ జాతి ఆవి ష్కరణ అనేది అనివార్యం. వెనుకటి సాంప్రదాయాలు, యోగాలు ముక్తిని పొందడంతో పరిసమాప్తి కాగా, శ్రీ అర విందుల పూర్ణయోగం అంతటితో ఆగిపోక, ఈ భూమి మీద నే దివ్య మానవ జాతి ఆవిర్భావం జరిగి, ఈ భూమి బృం దావనంగా మారాలనే లక్ష్యంగా పెట్టుకున్నది. అందు కోసం మనందరం మనవంతు కృషి చేద్దాం, అతి మానన శక్తితో మన జీవితాలను అనుసంధానం చేసుకుందాం.
శ్రీ అరవిందులు మహాసమాధి గావింపబడిన అనం తరం వారి సమాధిపై శ్రీమాత స్వయంగా వ్రాసిన ప్రార్థనా వాక్యాలు: ”సర్వాతీతుడైన ప్రభువునకు భౌతిక ఆచ్ఛాద నముగానున్న మీకు- మా అనంత కృతజ్ఞతాభివందనాలు.
మనకొరకు ఎంతో పాటుపడి, కృషి చేసి, పోరాడి, కష్టములను అనుభవించి, ఆశించి, సర్వ ప్రయత్నములు గావించి, సమస్తము సిద్ధము చేసి, సాధించియుండిరో- అంతటి మిమ్ములను, మేము చేయవలసిన దానినం తటినీ, ఒక్క క్షణము కూడా మరువమని, మీ ముందు శిరస్సు వచ్చి ప్రణమిల్లుతున్నాము.”
దైవంతో సంబంధాన్ని నెలకొల్పుకొనేందుకు అంధ విశ్వాసాన్ని అవసరం లేదంటారు శ్రీమాత.

Advertisement

తాజా వార్తలు

Advertisement