Monday, May 6, 2024

లింగార్చనలు – ఫలాలు

  • ధనప్రాప్తి కోసం శివపూజలో తామరపత్రాలను ఉపయోగించాలి. ధనప్రాప్తి కలుగుతుంది…ధనం నిలవడానికి బిల్వపత్రాలను శివార్చన చేయాలి.
  • ముక్తి , మోక్షానికి దర్భలతో శివార్చన చేయాలి.
  • కోరికలు నెరవేరడానికి , దీర్ఘాయుష్షు కోసం గరికతో శివార్చన చేయాలి.
  • సంతానం, సౌభాగ్యం కోసం ఉమ్మెత్త పూలతో చేయాలి.
  • వస్తు, వాహనం కోసం మల్లెపువ్వుతో లింగాన్ని అర్చన చేయాలి.
  • సుఖ, సంతోష సంపదల కోసం నూకలు లేని
  • బియ్యంతో శివార్చన చేయాలి.
  • పాడిపంటలు వృద్ధి కోసం నూకలు లేని బియ్యంతో శివార్చన చేయాలి.
  • వంశాభివృద్ధి, పేరు ప్రతిష్టలు కోసం ఆవునేతితో శివార్చన చేయాలి.
  • భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటూ ఉన్నవారు చందనతైలంతో శివార్చన చేయాలి.
  • రోగనివారణ కోసం తేనెతోను, సంపూర్ణ ఆనందానికి చెరుకు సరసంతో చేయాలి.
  • అధికార బాధలు తొలగిపోవాలంటే జిల్లేడు పూలతో అర్చన చేయాలి.
  • విధ్యాబుద్దులు కలగాలంటే తెల్ల తామరతో శివార్చన చేయాలి. శ్రీఘ్ర వివాహం కోసం మందార పూలతో, ప్రేమ వివాహం కోసం మందార పూలతో అర్చన చేయాలి.
  • రోగబాధలు తొలగి పోవాలంటే తుమ్మ పూలతో అర్చన చేయాలి.
  • ప్రాణ సంకటం నుంచి బయటకు రావాలంటే నువ్వుల నూనెతో శివార్చన చేయాలి.
  • గో, బ్రాహ్మణ హత్య పాపాలు తొలగి పోవాలంటే స్వర్ణ పుష్పాలతో అభిషేకం చేయాలి.
  • ఋణ బాధలు తీరాలంటే రజత పుష్పాలతో, దొంగల బాధలు తొలగిపోవాలంటే ఫలరసాలతో శివార్చన చేయాలి.
  • అన్యోన్యత పెరగాలంటే పాలు, తేనెలు కలిపి శివార్చన చేయాలి. అధికార ప్రాప్తి కోసం అష్టగంధం తో అభిషేకం చేయాలి.
  • ఉద్యోగ ప్రాప్తి కోసం అన్నం, బెల్లంతో అభిషేకం చేయాలి
  • వ్యాపార వృద్ధికి గన్నేరు పూలతో అర్చన చేయాలి.
  • గ్రహబాధలు తొలగి పోవాలంటే నవరత్నాలతో అర్చన చేయాలి.
Advertisement

తాజా వార్తలు

Advertisement