Wednesday, December 6, 2023

జయ హనుమంతా…మహా బలవంతా!

ఆంజనేయుడు చేతిలో గద ఆయుధంగా ధరిస్తాడని సాధారణంగా భక్తులు భావిస్తారు. కాని వాల్మీకి మహర్షి రామాయణంలో ఆంజనేయుడు చేతిలో గద ఉందని ఎక్క డా ప్రస్తావించలేదు. సీత జాడ కనుగొనుటకు లంక వెళ్లినప్పుడు ఆయన చేతికి ఏది వస్తే దానితో కొట్టి రాక్షసులను చంపాడు. చెట్టు దొరికితే చెట్టుతో కొట్టి చంపాడు. ఏనుగుతో ఏనుగులను చంపాడు. రాక్షసులను మరొకరి శరీరంతో చంపాడు. ఆయన సంకల్పమే బలంగా మారి రాక్షసులను దునుమాడింది. ఒక పని చేయాలని గట్టి సంకల్పం ఉంటే అది సులభంగా నేరవేరుతుందని ఇతిహాసాలు చెబుతున్నాయి. వాల్మీకి మహర్షి సుందరకాండ లో హనుమ కేవలం తన శరీరంతోనే అంటే చేతులతోనూ, కాళ్లతో, భుజాలతో రాక్షసుల ను మాంసపుముద్దగా మార్చాడని రాసాడు. అవన్నీ తెలియాలంటే హనుమ చేసిన సాహస కార్యాలను ఇక్కడ ప్రస్తావించాలి. సీతను చూసి రాముడు ఇచ్చిన ఉంగరాన్ని గుర్తుగా ఇచ్చి తాను త్వరలో రాముడిని, వానర సైన్యాన్ని లంక తీసుకువస్తానని తెలిపాడు.
హనుమ సీతమ్మకు ధైర్యవచనాలు చెప్పి పాదాభిషేకం చేసి బయలుదేరాడు. రాక్షసు లు కేవలం దండనీతికి లొంగుతారు. ముందుగా రాక్షసుల బలాబలాలు, వారి ర#హస్య స్థావ రాలు తెలుసుకుని వెళ్లడం అవసరమని హనుమ తలచాడు. వీరి రణ కౌశలం కూడా తెలు సుకోవాలనుకున్నాడు. లంకేశ్వరుడిని, ఆయన పరివారాన్ని కూడా చూడాలని భావించాడు.
నందన వనంగా ఉన్న అశోకవనాన్ని ధ్వంసం చేస్తే రాక్షసులు యుద్ధానికి వస్తారు. అను కుంటూ చెట్లు విరగగొడుతూ, నికుంజాలు పెళ్లగిస్తూ, క్రీడా పర్వతాలు భగ్నం చేస్తూ ఉద్యా నవన ద్వార తోరణం పైకెక్కి కూర్చున్నాడు. రావణుడికి హనుమ సమాచారం రాక్షస స్త్రీలు చేరవేసారు. మహావీరులను #హనుమ సంహారార్ధం పంపాడు. ఖడ్గధారులైవారు వచ్చి హనుమను చుట్టుముట్టారు. హనుమ ఒక్కసారిగా వాలం (తోక)ను నేలకేసి కొట్టి శరీరాన్ని పెంచి తోకను ఆడించాడు. ఆ ధ్వనికి లంకంతా ప్రతిధ్వనించింది.

జయత్యతి బలో రామోలక్ష్మణశ్చ మహాబల:
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత:
దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్ట కర్మణ:
హనుమాన్‌ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజా: అని గర్జిస్తూ రాక్షసులపై రాళ్లు విసిరారు. పాదాలతో మర్దిస్తూ రాక్షస సంహారం చేపట్టా డు. క్షణాలలో వారిని పాదాలతో తొక్కుతూ, ముష్టి ఘాతాలతో వారిని చంపి మళ్లిd తోరణం మీదకు చేరారు హనుమ.
ఈ వార్త విన్న రావణుడు మంత్రి పుత్రుడు జంబుమాలిని సైన్యంతో పంపాడు. చైత్య ప్రాసాద స్తంభాన్ని పెరికి రాక్షస సంహారం ప్రారంభించాడు. జంబుమాలి బాణ వర్షం కురు పిస్తుండగా చిన్నరూపం ధరించి బాణాల మధ్యలోంచి తప్పించుకుంటూ ఆడుకున్నాడు. కాసేపు ఆడుకుని పెద్ద బండరాయి జంబుమాలిపై విసిరాడు. దాన్ని పిండి చేసాడు. ఈసారి సాల వృక్షాన్ని హనుమ విసిరాడు. దాన్నీ ముక్కలు చేసాడు. చివరకు కుపితుడైన మారుతి జంబుమాలి విసిరిన ఆయుధాన్నే అందుకుని దాన్నే అతని మీద వేగంగా విసిరాడు. దాంతో జంబుమాలి రథం, అతను కూడా మంసపు ముద్దగా మారారు. ఈ వార్త విన్న రావణుడు మంత్రి కుమారులను పంపాడు. ఒకసారి అల్ప దేహంతో, మరోసారి భారీ దేహంగా కనిపిం చి వారిని పరిమార్చాడు #హనుమ. ఈసారి ఐదుగురు సేనానులను రావణుడు పంపుతూ ఆ వానరాన్ని తెలివిగా చంపండని పంపాడు. వారిలో ఒకరి రథంపై భీకర శబ్దం చేస్తూ పడడం తో అతను యమసదనానికి చేరాడు. మరో ఇద్దరు ఆకాశానికి ఎగిరి యుద్ధం ప్రారంభం చేసారు. వారి ఆయుధాలు హనుమ రొమ్మును తాకాయి. దాంతో సాల వృక్షాన్ని పెరికి వారి పై విసరడంతో వారు విగత జీవులైనారు. మిగిలిన ఇద్దరు హనుమను ఆయుధాలతో గాయాలు చేయగా, పర్వత శిఖరం వారిపై వేసారు. వారు గాలిలో కలిసి పోయారు.
చివరకు తన చిన్న కుమారుడు అక్షయ కుమారుడిని హనుమపైకి యుద్ధానికి పంపా డు రావణుడు. అక్షయ కుమారుడు వీరాగ్రేసరుడు. తన బాణ ప్రయోగాలతో హనుమ శరీ రం అంతటా రక్తధారలు కారేలా చేసాడు. అక్షయ కుమారుడి కౌసల్యం చూస్తే హనుమకు ముచ్చటేసింది. అయినా శత్రువును ఉపేక్షించరాదని ఒక్కసారిగా గగనంలోకి ఎగిరి రథం పై చేతులతో చరిచాడు హనుమ. రథం పచ్చడైంది. ప్రమాదం పసిగట్టి అక్షయ కుమారుడు తప్పించుకుని పైకి ఎగిరి మారుతి కాళ్లు పట్టుకున్నాడు. హనుమ దొరికిన వాడి కాళ్లు పట్టు కుని గిరగిర తిప్పి విసిరేసాడు. అక్షయ కుమారుడి శరీరంలోని భాగాలన్నీ భయానకంగా విడిపోయి చెల్లాచెదురుగా పడ్డాయి. రావణుడు తన పెద్ద కుమారుడు ఇంద్రజిత్‌ను పిలిచి, నాయనా నీమీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆ వానరుడు సామాన్యుడిలా లేడు. నీవు అతని ని ఎలా అయినా బంధించి తీసుకురా అన్నాడు. తండ్రికి నమస్కారం, ప్రదక్షిణ చేసి బయలు దేరాడు. ఇంద్రజిత్తును చూడగానే మారుతి శరీరాన్ని పెంచారు. బాణవర్షం నుంచి తప్పిం చుకుంటూ గగన వీధికి ఎగిరారు. ఇక తప్పదని బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. ఆ అస్త్రాన్ని గౌరవిస్తూ కట్టుబడి ఉండగా ఒక్కసారిగా రాక్షస సైనికులు ఆయనను బంధించారు. బ్రహ్మా స్ర ్తబంధితుని వేరొకదానితో బంధిస్తే దాని ప్రభావం ఉండదని తెలిసిన రావణ కుమారుడు తన సైనికులు చేసిన చెత్త పనికి చింతించాడు. హనుమ ఇంద్రజిత్తుతో రావణుని ముందుకు వచ్చాడు. హనుమ చెప్పిన మంచిమాటలు రుచించక వానరుడిని చంపమని రావణుడు ఆదేశించాడు. విభీషణుడు అడ్డుపడి దూతను చంపితే మన పరాక్రమం పంపిన వారికి ఎలా తెలుస్తుందని సలహా ఇచ్చాడు. దానికి రావణుడు అంగీకరించి వానరులకు వాలం ప్రీతి కనుక దానికి నిప్పు పెట్టమన్నాడు. దాంతో హనుమ తోకకు నూనెగుడ్డలు చుట్టి నిప్పు అం టించి రాక్షసులు హంసిస్తూ ఆనందిస్తున్నారు. ఈ వార్త వినగానే సీతమ్మ తాను పతివ్రత నైతే, రాముని తప్ప అన్య పురుషుడిని మనసులోనైనా తలచని దానినైతే అగ్ని దేవుడు హనుమ తోకను చల్లగా ఉంచాలి అనుకుంది. వెంటనే తోకకు అంటించిన నిప్పు చల్లగా అవ గానే మారుతి ఇలా తలచాడు. ఓహూ… అగ్ని దేవుడు నా తండ్రి వాయువు స్నేహతుడు కావు న కరుణ చూపాడని, లేదా రామకార్యం కావున ఇలా అయిందని భావించాడు. వాలానికి అంటిన నిప్పుతో లంకలో విభీషణుడి ఇల్లు తప్ప అందరి ఇల్లు తగలపెట్టాడు మారుతి. ఇళ్ల కు తాపడం చేసిన బంగారం కరిగి కాల్వలు కట్టింది. సీతమ్మను చూసిరమ్మంటే లంకను కాల్చి వచ్చాడని సామెత అందుకే వచ్చింది. అనంతరం హనుమ సముద్రంలోకి దూకి తోకకు అంటిన నిప్పును ఆర్పి కిష్కింద వైపు పయనమైనాడు. అలా హనుమ లంకలో కేవలం సంకల్పబలంతో శరీరమే ఆయుధంగా చేసి వినాశనం సృష్టించారు. జయ#హనుమంతా.. మహా బలవంతా అన్న రీతిలో పరాక్రమాన్ని ప్రదర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement