Saturday, May 18, 2024

జగద్వ్యాపి స్వరూపాయా నవెూనమః!

నేడు రథసప్తమి

”ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే”

”సూర్య ఆత్మా జగత్‌ సస్తుషస్య:” అన్నది ఋగ్వేదం. ‘జగత్తులో ప్రాణులు అన్నిటికీ సూ ర్యుడే ఆత్మ’ అని భావం. ‘ప్రాణోవై అర్క:’- ప్రాణమే సూర్యుడు. ”స ఏష వైశ్వానరో, విశ్వ రూప:, ప్రాణో అగ్ని రుద్రయతే”’ అని ప్రశ్నోపనిషత్తు పేర్కొంది. ”సూర్యోదయంతోనే జగ త్తులో ప్రాణాగ్ని సంచారం చేస్తుంది. సూర్యుడి వల్లనే సమస్త ప్రాణి కోటికీ ప్రాణం లభిస్తుం దని ‘అక్ష్యుపనిషత్తు’ పేర్కొంది.
”సూర్యాద్భవంతి భూతాని, సూర్యేణ పాళీ తానిచ సూర్యే లయం ప్రాప్నువంతి య సూర్య: సోహ మేవచ” చిమ్మ చీకట్లను తొలగించి, సమస్త లోకాలకు వెలుగును పంచేది సూర్య భగవా నుడు. ఈ ప్రత్యక్ష దైవం సూర్య భగవానుని పుట్టిన రోజును సమస్త జగత్తు రథ సప్తమిగా జరు పుకుంటారు. మాఘ మాసము చాలా విశేషమైనటువంటి మాసము. ఉత్తరాయణంలో మాఘమాసం దక్షిణాయానంలో కార్తీక మాసం రెండు చాలా ప్రత్యేకమైనవి. మాఘమాసం సూర్యారాధనకు, విష్ణుమూర్తి ఆరాధనలకు ప్రత్యేకం. అలాంటి మాఘమాసంలో రథసస్తమి రావడమే ఈ మాసము ప్రాధాన్యతను తెలియజేస్తుంది. మాఘ మాస శుక్ల పక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథ సప్తమి అని కూడా అంటారు.

బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్న తు మహశ్వర:|
అస్తకాలే స్వయం విష్ణు: త్రయీమూర్తిర్దివాకర:||

చీకట్లను తొలగించి.. సమస్త లోకాలకు వెలుగులు పంచేవాడు సూర్య భగవానుడు. ఉదయం బ్రహ్మ దేవుడిగా.. మధ్యాహ్నం మహశ్వరుడిగా.. సాయంకాలం విష్ణువుగా.. సూ ర్యుడు ‘త్రిమూర్తుల స్వరూపం’ అని మహాఋషులు భావన చేశారు. తెల్లటి ఏడు గుర్రాల రథంపై శ్వేతపద్మాన్ని ధరించి దర్శనమిచ్చే త్రిమూత్య్రాత్ముకుడు సూర్యుడు. సృష్ట్యాదికి పూర్వమే ప్రత్యక్ష దైవంగా లోకానికి వెలుగును ఇచ్చిన నారాయణుడిగా ఆయనను ఆరా ధించారు. సూర్యారాధన యుగయుగాల నుంచీ వస్తోంది.
అదితి కశ్యపుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యుడు అవతరిం చిన రోజు. దానినే ‘రథ సప్తమి’ అంటారు. ”సప్తాశ్వ రథ మారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్‌ శ్వేతపద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్‌.” అంటూ సూర్యుడిని ఆరాధిస్తుంటా రు. సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే ఆయన ఏడు గుర్రా లున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాఙ్మయం చెబుతోంది. సూర్యుడు ఏడు గుర్రాల మీద రథమెక్కి కర్మసాక్షిగా బాధ్యతలు స్వీకరించాడట. సూర్యునికి సంబంధించి నంత వరకు ఏడవ సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్యుని రథంలో ఉన్న అశ్వాల సంఖ్య ఏడు. వారంలో రోజులు ఏడు. వర్ణంలో రంగులు ఏడు. అలా తిథులలో ఏడవది అయిన సప్తమి రోజు అందునా మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యుడు ఏడు రథాలతో తన గమనాన్ని మొదలెడతాడట. దీనికి సూచనగా రథ సప్తమి నాడు రాత్రి నక్షత్ర మండల ఆకా రం ఒక తేరు రూపాన్ని సంతరించుకుంటాయని ప్రతీతి. సౌర కుటుంబంలో అన్ని ప్రాణుల కు సూర్యుడే ఆత్మ. కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రు బాధలు నశిస్తాయి.
మన మంత్ర పుష్పాలలో ఒకటిగా పేర్కొనే ‘యోపం పుష్పం వేదా, పుష్పవాన్‌ ప్రజా వాన్‌, పశుమాన్‌ భవతి’ అనే వాక్యాలు దీనికి సంబంధించినవే. సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశుసంపద సమృద్ధివంతుడు అవుతాడు. అందుకే వైదిక వాఙ్మయం.. సంధ్యావందనం, సూర్యనమస్కారాలు, అర్ఘ్య ప్రదానం మొదలైన ప్రక్రి యల్ని ప్రవేశపెట్టింది.

- Advertisement -

అధిక ఫలితాన్నిచ్చే స్నానం… సూర్యారాధన!

రథ సప్తమి రోజున తలమీద 7 జిల్లేడు ఆకులను, రేగు పళ్ళను ఉంచుకుని స్నానజలా లలో శాలిధాన్యం, నువ్వులు, దూర్వాలు, అక్షతలు, చందనం కలిపిన నీటితో స్నానం చేయా లి. సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ప్రీతి. అందువలన ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానము చేస్తే ఏడు జన్మలలో చేసిన పాపాలు అన్నీ నశిస్తాయని గర్గ మహాముని తెలిపారు. అంతేకాదు ఏడు రకములైన వ్యాధులను కూడా నశింపజేస్తాయి. ఇందులో నిమిడి ఉన్న ఆరో గ్య రహస్యమేమంటే.. జిల్లేడులో కొన్ని ఔషధ గుణాలున్నాయి. ఇవి ఆ సమయంలో నీటిలో కలిసి మన శరీరానికి ఋతువులో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనను సిద్ధపడేలా చేస్తాయి. ఇలాచేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ రోజు చేసే స్నానాలు, వ్రతాలు సూర్యుడికి చేసే పూజలు, దానాలు, తర్పణాదులు అధిక ఫలాన్నిస్తాయి. జన్మ జన్మాంతారాలలో తెలిసీ, తెలియక చేసిన సప్తవిధ పాపాల వల్ల ఏర్పడిన రోగం, శోకాలన్నీ ఈరోజు సూర్యనారాయణుని పూజించుట వలన నశించును.

దివ్యజ్ఞాన ప్రదాయని ఆదిత్యహృదయం!

ఆదిత్య #హృదయ స్తోత్రం అనేది సూర్య భగవానుడికి అంకితం చేయబడిన శక్తివం తమైన, పవిత్రమైన శ్లోకం. అగస్త్య మ#హర్షి ఈ మంత్రాన్ని రచించి, లంకా యుద్ధభూమిలో శ్రీరాముడికి ఇచ్చాడు. ‘ఆదిత్య’ అనే పదానికి ‘అదితి కుమారుడు’ అని అర్థం, ఇది సూర్యునికి మరొక పేరు, ‘#హృదయ’ అంటే హృదయం, ఆత్మ లేదా దైవిక జ్ఞానం. ఈ శ్లోకం మనకు సూర్య భగవానుడి గురించి దివ్య జ్ఞానాన్ని అందిస్తుంది. ఆదిత్య హృదయం మంత్రం రామాయ ణంలోని ఆరవ అధ్యాయం యుద్ధకాండలో వుంది. ఇది 31 శ్లోకాలు కలిగి ఉంది. విజయం, ఆరోగ్యం, శ్రేయస్సు సూర్యుని ఆశీర్వాదాలను కోరేందుకు ఇది పఠిం చబడింది. రాక్షసుడైన రావణుడితో యుద్ధంలో విజయం సాధించడానికి అగస్త్య మ#హర్షి రాముడికి ఆదిత్య హృద యం శ్లోకం అందించాడు. నిజానికి ఈ శ్లోకం బాహ్య యుద్ధంలో గెలవడానికి పఠించినప్ప టికీ, ఇది అనేక ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది. మనమందరం అంతర్గతంగా, బాహ్యంగా సమస్యలను ఎదుర్కొంటాము. జీవిత సమస్యలు పరిష్కరించడమనేది యుద్ధం కంటే తక్కువ కాదు. అందువల్ల, ఆదిత్య హృదయం జీవితంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదు ర్కొనే శక్తిని, దృఢ నిశ్చయాన్నిస్తుంది. కర్తవ్య ప్రేరేపకుడు ‘సూర్యుడు’ అనే పదానికి ‘సువతి ప్రేరయితి జనాన్‌ కర్మణతి సూర్య:’ అని వ్యుత్పత్తి. ”లోకులకు కర్తవ్య నిర్వహణకు ప్రేరణ ఇచ్చేవాడు” అని అర్థం.ఇలా జగత్తును తన వెలుగుతో నడిపిస్తున్నవాడు ఆ సూర్యభగవానుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement