Monday, April 29, 2024

జగదానందకరం వరలక్ష్మి వ్రతం!

నమస్తేస్తు మహామాయే, శ్రీపీఠే సుర పూజితే
శంఖగదాహస్తే, మహాలక్ష్మీ నవెూస్తుతేöö
అంటూ శంఖచక్రగద ధారిణిని అయిన మహాలక్ష్మీదేవిని కొలిచే శుభదినం. శ్రావణమాసం అంటే చాలు వరలక్ష్మి వ్రతం గుర్తుకు వస్తుంది. విష్ణువు జన్మనక్షత్రం, శ్రీహరికి ఇష్టమైన శ్రావణమాసంలో విష్ణుమార్తి భార్య అయిన వరలక్ష్మీదేవిని ఈ మాసంలో పూజిస్తే విశేష ఫలితాలు ఉంటాయని శాస్త్ర వచనం. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని, ఈ వ్రతం అష్టలక్ష్మీ పూజలతో సమానమని భక్తులు విశ్వసిస్తారు. అందుకే సకల శుభకరమైన, మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనది. పెళ్లయిన మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. వరలక్ష్మీదేవిని వరాలు ఇచ్చే దేవతగా కొలుస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! అయితే నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత చిత్తంతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ వ్రతం చేసినా, చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని సూతమహాముని శౌనకాది మహర్షులకు వివరించినట్లు పురాణ కథనం. నేడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా..

శ్రావణమాసం పండుగల మాసం. లౌకిక– ఆధ్యాత్మికానందాలు మదిని నిం పే మాసం. గృహాలన్నీ లక్ష్మీశోభతో ఉజ్జ్వలంగా ప్రకాశించే శుభవేళ. శ్రవ ణమనగా ”వినటం” అని అర్థం. ఈ శ్రావణమాసంలో వేదపఠనంతో సమానమైన.. విష్ణు సహస్రం… లక్ష్మీ సహస్రం… లలితా సహస్రనామాది స్తోత్ర పఠ నాలు.. నోములు, వ్రతాలు, మనలోని మోహాన్ని తొలగించి, సౌభాగ్యమిస్తాయి. అత్యంత శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరాలిచ్చే లక్ష్మి.. వర లక్ష్మీ వ్రతం జరుపుకుంటాం.
ఈ పండుగను ముఖ్యంగా మహళలు జరుపుకుంటారు. అమ్మాయిలు మంచి భర్త రావాలనీ…వివాహమైన స్త్రీ సౌభాగ్యం కోసం.. మంచి కుమారులు కలగాలనీ… సుఖసంపదలు ప్రేమ కీర్తి శాంతి శక్తి వంటివి లభిస్తాయనే ప్రగాఢ విశ్వాసంతో.. నమ్మకంతో… సకల శుభాలు కలగాలనీ… నిశ్చలమైన భక్తి ఏకాగ్రతతో…. వరలక్ష్మీ వ్ర తం చేస్తాం. విష్ణుమూర్తి భార్యయైన లక్ష్మీదేవిని వరాలిచ్చే వరలక్ష్మీ దేవతగా కొలుస్తాం. శ్లో|| నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సుర పూజితే..
శంఖచక్ర గదా హస్తే వరలక్ష్మి నమోస్తుతే..
తా: మహా మాయారూపిణీ శ్రీ పీఠవాసిని దేవతలు నిరంతరం సేవించే లోకమా త శంఖచక్ర గదల్ని ధరించిన మహాలక్ష్మిదేవి నీకు నమస్కారములు. జగన్మంగ ళదాయని అష్టైశ్వర్యాలని కలగజేసే అష్టలక్ష్మి రూపాన్ని వరలక్ష్మీ దేవిగా మ నం ఆరాధిస్తాం. భక్తితో కొలచి పూజించిన వారికి.. కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మి వరలక్ష్మి.

పురాణ గాథ

స్కాంద పురాణంలో… పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రత మ#హ త్యం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల అ్టషశ్వర్యాలను… పుత్రపౌత్రాదులను పొందేందుకు వీలుగా… ఏదైనా ఒక వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆదిదేవుని కోరగా… అప్పుడు శంకరుడు పార్వతీదేవికి వరలక్ష్మి వ్రత మహత్యం గురించి వివ రించాడనీ… ఆ సందర్భంలో పరమశివుడు చారుమతీదేవి వృత్తాంతాన్ని … పార్వతీదేవికి తెలియజేశాడట.
భర్త పట్ల ఆదరాన్ని… అత్తమామల పట్ల గౌరవాన్ని… ప్రకటిస్తూ… చారుమతి మంచి ఇల్లాలుగా.. తన బాధ్యతల్ని నిర్వహస్తూ ఉండేది.
శ్రీ మహాలక్ష్మిదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి.. అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తున్న మహాపతివ్రత, పరమ సాధ్వి, ఉత్తమ ఇల్లాలు అయిన చారుమతికి వరలక్ష్మి స్వప్నలో సాక్షాత్కారమై……. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారంనాడు.. తనను ఆరాధిస్తే.. కోరిన వరాలన్నీ ఇస్తాన నీ చెప్పిందట.
అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాల నుకున్న చారుమతి… తానొక్కతి మాత్రమే వ్రతమాచరిం చి.. ఆనందాన్ని అనుభవించడం కంటే… పదిమందితో పాలు పంచుకోవాలనీ.. భక్తిశ్రద్ధలతో తోటి ముత్తైదువులతో కలిసి…ఆ మె పూజ చేయడం… పూజానంతరం… ప్రదక్షిణానికి ఒక్కొక్కటి చొప్పున మూడు ప్రదక్షిణల్లోనూ …క్రమంగా బంగారు గజ్జెలు.. అష్ట కంకణాలూ.. సర్వాభరణాలూ.. వాళ్ళందరికీ లభించడం… ప్రతి సంవత్సరం ఈ పూజను చేస్తూ… దీన్ని వ్రతంగా మార్చుకోవాలనీ.. వాళ్లంతా అనుకోవడమనేది వ్రతకథ. ఇది ఈశ్వరుడు గౌరీదేవికి విశదపరి చాడని.. పురాణ కథనం.
దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మీ దేవి కృపకు పాత్రురాలైందని చెబుతారు. అష్టలక్ష్ముల్లో… వరలక్ష్మి దేవికి ప్రత్యేకత ఉందంటారు. అన్నింటిలో వరలక్ష్మీ పూజ శ్రేష్టమ ని శాస్త్ర వచనం.
సర్వమంగళ సంప్రాప్తి కోసం.. సకలాభిష్టాల కోసం.. నిత్య సుమంగళిగా… తాము వర్ధిల్లాలనీ.. పుణ్యస్త్రీలు ఈ వ్రతమాచరి స్తారు. ఎవరు ఏయే పద్ధతులు పాటించినా.. శ్రీలక్ష్మిని కొలిచే తీరుమాత్రం అందరిదీ ఒక్కటే…
సకల శుభంకరమైన.. సన్మంగళదాయకమైన.. వరలక్ష్మీ దేవి పూజ జగదానందకరమైనదని.. భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఒక్కరే కాకుండా… పదిమందితో కలిసి పూజ చేసుకోవడం లో ఆనందం.. కలిసి భుజించడంలో ఉన్న సంతోషం.. అందంగా అలంకరించుకున్న అం దరూ.. పలకరించుకోవడంలో ఓ వైవిధ్య విధా నం. మానసిక ప్రశాంతత.. ఆనందం.. సం తృప్తి ఈ వ్రతం వల్ల.. స్త్రీలకు లభిస్తాయి.
వ్రతమంతా అయ్యాక.. వాయనాన్నిస్తూ… ఓ ముత్తయిదు వా… నువ్వూ లక్ష్మీవే.. నేనూ లక్ష్మినే… మనందరిలోనూ లక్ష్మి ఉందని గ్రహం చాను.. మనలో లక్ష్మి ఉండి.. మనకు సక లశుభాలు కలిగిస్తుందని అర్థం చేసుకున్నా ను. కాబట్టి ఈ వాయనాన్ని లక్ష్మీస్వరూపిణివై స్వీకరించు.. అన్న ఈ శ్లోకం చదువుదాం.
శ్లో|| ఇందిరా ప్రతి గృహ్నాతి ఇందిరా వై దధాతి చ
ఇందిరా తారికా ద్వాభ్యామ్‌ ఇందిరాయై నమోనమ:
ఈ వ్రతాలు… మన నియమపూర్వక జీవన విధానానికి…. పవిత్రతకు… సద్బా éవన… సదాశయాలు…. సత్సాంప్రదాయ పరిరక్షణ…. సద్గుణాలకు నిలయాలు.

వరలక్ష్మీ వ్రతం చేయలేకపోతే…?

- Advertisement -

వరలక్ష్మీ వ్రతం ఆనవాయితీగా లేనివారు చేసుకుంటే ఏమవుతుందో అని అనుకుంటారు. వరలక్ష్మీ వ్రతం ఎవరైనా చేసుకోవచ్చు. ఆనవాయితీగా వున్నవారు మాత్రమేకాదు ఎవరైనా చేసుకోవచ్చు. ఇంట్లో పూజ చేసుకుని నిత్య దీపారాధన చేసుకుని అమ్మవారిని అలంకరించి పూజ చేసుకోవచ్చు. ఏదైనా ప్రసాదం పొంగలి, పరమాన్నం లాంటివి నైవేద్యం పెట్టవచ్చు. పూజ అయిపోయిన తర్వాత వరలక్ష్మీవ్రతం చేసుకోకపోతే గుడికి వెళ్ళి పసుపు కుంకుమ, గాజులు, పువ్వులు, శనగలు, తమలపాకులు, వక్కలు పెట్టి అయిదుగురు ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చుకోవచ్చు. అమ్మ లక్ష్మీదేవికి నానబెట్టిన శనగలు అంటీ ప్రీతి. అందుకే వాటిని వాయనం ఇవ్వాలి. ఇంటికి వచ్చిన ముత్తైదువులకు బొట్టుపట్టి తాంబూలం ఇవ్వండి. ఇంటికి వచ్చిన స్త్రీని బొట్టు పెట్టకుండా పంపించకూడదు.

వరలక్ష్మి కటాక్షం పొందాలంటే?

వివాహిత గృహిణిగా తన బాధ్యతలను నెరవేర్చాలి. తన అత్తమామలు, భర్త, పిల్లలు, తన ఇల్లు అని భావించి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతలను నెర వేర్చిన వరలక్ష్మీ వ్రతకథలోని చారుమతిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. అందరూ ఉత్తమ స్త్రీగా, ఉత్తమ ఇల్లాలుగా వుండాలనే సందేశాన్ని ఇస్తుంది చా రుమతి. తన బాధ్యతలను పూర్తిగా నిర్వహించే మహిళలకు వారు కోరుకు న్నవి… కావలసినవి అన్నీ సమకూరతాయి. కనుక మనమందరం మన ధర్మా లను నెరవేరుస్తూ… వరలక్ష్మి వ్రతాన్ని నెరవేర్చి.. వరదాయిని వర ప్రసాదా లను అందుకుందాం.

వరలక్ష్మికి
నివేదనలు

వరలక్ష్మీదేవికి మహానైవేద్యంతో పాటు మూడు లేదా అయిదు… లేదా తొమ్మిది రకాల పిండివంటలతో నివేదన చేయాలి. నూనెతో చేసిన పిండివంట ఒకటి అయినా వుండేలా చూసుకోవాలి. గారెలు, అప్పాలు, బూరెలు, బజ్జీలు లాంటివి వుండాలి. పాయసం పులిహోర, దద్దోజనం, మైసూరుపాకం, లడ్డూలు ఇలా ఏవైనా చేయవచ్చు. వంటకాల్లో మసాలాలు, వెల్లులి, ఉల్లి వాడకూడదు.

వరలక్ష్మీవ్రతం ఎప్పుడైనా చేయవచ్చా?

పౌర్ణమి ముందు శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం. అనివార్య కారణాలతో ఈ రోజున కుదరకపోతే శ్రావణమాసంలోని ఇతర శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు. శ్రావణమాసం అయిపోతే ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రుల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చునని చెబుతున్నారు. వరలక్ష్మి అంటే వరాలు ఇచ్చే తల్లి. అమ్మను భక్తితో పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగు తాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే అమ్మను ఎప్పుడైనా పూజించవచ్చని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement