Sunday, June 23, 2024

వీరనాయకునిరూప లావణ్యం!

రామాయణానికి శ్రీరాముడు నాయకుడైతే…. శ్రీరాముని విజ యాటన్నింటికి కీలకంగా దోహ దపడిన హనుమంతుడు ఉపనాయ కుడు. రామాయణంలోని ఏడు కాండాలలో ఒకటైన సుందర కాండలో మాత్రం మారుతినా యకుడు, రామాయణంలో ఆం జనేయుని ప్రవేశం కిష్కింద కాం డ నుంచి మొదలవుతుంది.
శ్లో|| ధృత్యాసాగర లంఘనం
#హనుమతో… లంకా మదోత్సారణం
తత్రాశోకవనే చమార్గణ, మథశ్రీ జానకీ దర్శనమ్‌ రామక్షేమ
నివేదనం, వనతరు ప్రధ్వంసనం సంయుగే రక్షస్పంహననం
పురీప్రద#హనం రామాయణ సుందరమ్‌
#హనుమంతుని సముద్రలంఘనము, అంకినీ గర్వభంగము, లం కలో సీతకై అన్వేషణము, సీతాసందర్శనము, రాముని క్షేమము నివేదన ము, అశోకవన ధ్వంసము, రాక్షస సంహారము, లంకాద#హనము మొద లైన ఘట్టాలను వివరిస్తూ #హనుమంతుడిని నాయకుడిగా చూపిస్తుంది.
వీరనాయకుడు అయిన హనుమంతుని రూప లావణ్యాన్ని… గొప్ప దనాన్ని ఇలా పేర్కొంది ఆంజనేయస్వామి మహత్యం #హనుమంతుని రూపం ఎలా ఉంటుందంటే అన్ని లోకాలలో ఉన్న లావణ్యం అంతా పోత పోసినట్లు ఉంటుందట. దేవతలే ఆ రూపాన్ని చూసి ఆశ్చర్యపడ తారట. బలిష్టమైన, పొడవైన ఆ దేహాన్ని, అతి పొడవైన వాలాన్ని, వానర ఆధిపత్యాన్ని తలచుకొంటూ భక్తితో కళ్ళు మూసుకొంటారట. జాంబ వంతుడు, అంగదుడు, నలుడు, నీలుడు మొదలైనవారంతా రక్షకులుగా నిల బడి సేవ చేస్తూ ఉంటారట. అవసరమైనప్పుడు భక్తులను రక్షించటా నికి అనేక రూపాలు ధరిస్తాడట. ఆశ్రితులను రక్షిస్తూ, దుష్టులను శిక్షిస్తూ కూడా నిత్యకృత్యాలలో ఏమాత్రం అజాగ్రత చూపించ కుండా ఉంటాడట.
#హనుమంతుని అనుగ్ర #హం పొందటానికి కొంద రు ఆయన విగ్రహా లను భక్తులకు ఇస్తారట. శచీపతి దేవేంద్రుడు గంధ మాదన పర్వతం దగ్గర సరస్సు వద్ద తూర్పు ముఖం గా #హనుమ విగ్రహాన్ని స్థాపించి స్తోత్రాలు చేసి పూజించాడు. ధర్మరాజు దక్షిణ దిక్కులో విగ్ర#హ ప్రతిష్ట చేసి నీలుడికి ఇచ్చాడు. వరుణుడు నిరుతి నైరుతి దిక్కున విగ్ర#హం పెట్టి పూజించి పనసుడికి సమర్పించాడు. పశ్చి మాన వరుణుడు ప్రతిష్ట చేసి గంధ మాదనుడికి ఇచ్చాడు. వాయవ్యంలో వాయుదేవుడు నెలకొల్పి, సుషేనుడికి సమర్పించాడు. అగ్ని ఆగ్నే యంలో పెట్టి వినతుడికిచ్చాడు. ఉత్తరాన కుబేరుడు స్థాపించి మైదునకు అప్పగించాడు. ఈశాన్యంలో శివుడు ఏర్పాటు చేసి ద్వివిడుడికి ఇచ్చాడు.
ఈవిధంగా దిక్పాలకులంతా #హనుమ విగ్రహాలను నెలకొల్పి, పూజించి తరించారు. అక్కడే దగ్గరలో ఉన్న ఆవాల సాగరంలో స్నానం చేస్తే పాపాలుపోతాయి. అందులో పసుపు రంగు కమలాలు కళ్ళకు వింత శోభను చేకూరుస్తాయి. రాజ#హంసలు, చక్రవాకాలు ఆ జలం మీద తిరు గుతుంటాయి. అప్సర గణం నృత్యాలు చేస్తుంటారు. మంత్రాలను ఉపా సిస్తూ ఉంటారు. గంధ మాదన గు#హలో రత్నసింహాసనం మీద #హను మంతుడు చిద్విలాసంగా, శ్రీ రామ నామ ధ్యానంతో, అర మూసిన కన్ను లతో, భక్తుల సందే#హ నివృత్తి చేస్తూ త్రిమూర్త్యాత్మక స్వరూపంగా వెలి గిపోతూ ఉంటాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement