Friday, July 26, 2024

TTD | తిరుమలలో జూన్ నెలలో జరిగే ఉత్సవాలు.. ఇవే!!

వేసవి సెలవులు ముగుస్తూ ఉండడంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతూ ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 26 కంపార్ట్ మెంట్లు నిండాయి. నిన్న 81,831 భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 34,542 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. వేసవి సెలవులు ముఖ్యంగా ఎలక్షన్లు పూర్తికావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపధ్యంలో, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది.

ముఖ్యంగా, శుక్ర, శని, ఆదివారాలలో సామాన్య భక్తుల రద్దీ వలన, వారు దర్శనానికి సుమారు 30-40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి వుంది. సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకుగాను, జూన్ ౩౦వ తేదీ వరకు శుక్ర శని, ఆది వారాలలో బ్రేక్ దర్శనం రద్దు చేశారు. తిరుమలలో జూన్ నెలలో పలు ఉత్సవాలను నిర్వహించనున్నారు.

జూన్ 1 నుండి 5వ తేదీ వరకు తిరుమలలో ఆకాశగంగా – అంజనాద్రి – బాల ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. జూన్ 2న మహి జయంతి. జూన్ 19 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం.. జూన్ 20న శ్రీ నాథమునుల వర్ష తిరు నక్షత్రం.. జూన్ 22న పౌర్ణమి గరుడసేవ నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement