Thursday, May 2, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 14, శ్లోకం 2
2.
ఇదం జ్ఞానముపాశ్రిత్య
మమ సాధర్మ్యమాగతా: |
సర్గేపి నోపజాయంతే
ప్రలయే న వ్యథంతి చ ||

తాత్పర్యము : ఈ జ్ఞానము నందు స్థిరముగా నిలుచుట ద్వారా మనుజుడు నా దివ్యత్వము వంటి దివ్వత్వమును పొందగలడు. ఆ విధముగా ప్రతిస్ఠుతుడై అతడు సృష్టి సమయమున జన్మింపడు లేదా ప్రళయ సమయమున వ్యథ నొందడు.

భాష్యము : ఈ భౌతిక ప్రపంచములో మన ము నేర్చుకొను జ్ఞానము, త్రిగుణములచే కలుషితమై ఉంటుంది. కాని, ఎవరైతే ఆధ్యాత్మిక లక్షణాలు పెంపొందించుకుని త్రిగుణములకు అతీతమైన దివ్యజ్ఞానమును పొందుతారో, వారు భగవంతునితో గుణ రిత్యా సమానము కాబడతారు. అటువంటి వ్యక్తి ఈ భౌతిక ప్రపంచపు సృష్టి మరియు ప్రళయములకు ప్రభావితము కాడు.

భగవద్ధామమును చేరినపుడు జీవుడు తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడని, నిరాకారునిగా, నిర్గుణిడిగా మారిపోతాడని కొందరు భావింతురు. అయితే వాస్తవేమిటంటే, మనకు ఈ ప్రపంచంలో వైవిధ్యము కనబడినట్లే ఆధ్యాత్మిక జగత్తులో కూడా వైవిధ్యము ఉంటుందని, జీవుడు ఆధ్యాత్మిక రూపాన్ని కలిగి ఆధ్యాత్మిక కార్యక్రమాలను కొనసాగిస్తాడని, అటువంటి ఆధ్యాత్మిక స్థితియే భక్తియుత జీవనమని వేదశాస్త్రాలు తెలియజేయచున్నాయి.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement