అధ్యాయం 11, శ్లోకం 23
23.
రూపం మహత్తే బహువక్త్రనేత్రం
మహాబాహో బహుబహూరుపాదమ్ |
బహూదం బహుదంష్ట్రాకరాళం
దృష్ట్వా లోకా: ప్రవ్యథితాస్తథాహమ్ ||
తాత్పర్యము : ఓ మహాబాహో! బహుముఖములను, నేత్రములను, భుజములను, ఊరువులను, పాదములను, ఉదరములను కలిగిన నీ గొప్పరూపమును, భయంకరమైన నీ బహుదంతములను గాంచి దేవతలతో కూడిన లోకములన్నియు వ్యథ చెందుచువి. వానివలెనే నేనును కలత చెందుచున్నాను.
- Advertisement -
భాష్యము : లేదు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..