Thursday, May 2, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 15
15.
అర్జున ఉవాచ
పశ్యామి దేవాంస్తవ దేవ దేహే
సర్వాంతస్తథా భూతవిశేషసంఘాన్‌ |
బ్రహ్మాణమీశం కమలాసనస్థమ్‌
ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్‌ ||

తాత్పర్యము : అర్జునుడు పలికెను: హే కృష్ణా! సమస్త దేవతలు, ఇత ర సమస్త జీవులు నీ దేహమునందు కలిగి యుండుటను నేను గాంచుచున్నాను. పద్మాసనుడైన బ్రహ్మను, శివుని, ఋషులను, దివ్య సర్పములను నీ యందు నేను దర్శించుచున్నాను.

భాష్యము : అర్జునుడు బ్రహ్మను మరియు సర్పాలను గాంచెనని తెలియజేయుచున్నాడు. విశ్వములో సగ భాగము నీటితోఉండి దానిపై వాసుకి సర్పమును పానుపుగా చేసుకొని గర్భోదకశాయి శయనించి ఉండును. అలాగే విశ్వములో ఉన్నతమైన కమలముల వంటి గ్రహము నందు బ్రహ్మ కొలువై యుండును. అనగా అర్జునుడు రథముపై కూర్చుండి విశ్వములో పై నుండి క్రింది వరకూ ఉన్న అన్నింటినీ గాంచెనని అర్థమవుతుంది. ఇది కేవలము కృష్ణుని కృప ద్వారా మాత్రమే సాధ్యమయ్యెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement