Monday, May 6, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 3

3.
ఏవమేతద్యథాత్థ త్వమ్‌
ఆత్మానం పరమేశ్వర |
ద్రష్టుమిచ్ఛామి తే రూపమ్‌
ఐశ్వరం పురుషోత్తమ ||

తాత్పర్యము : ఓ పురుషోత్తమా! ఓ పరమేశ్వరా! నీవు వర్ణించిన రీతిగా నీ యథార్థరూపమును నేను నా యెదుట చూడగలిగినను, నీవు ఏ విధముగా ఈ విశ్వము నందు ప్రవేశించితివో నేను గాంచ నభిలషించుచున్నాను. నీ యొక్క ఆ రూపమును నేను దర్శించగోరుదును.

భాష్యము : ఇంతకు ముందు అధ్యాయములో శ్రీకృష్ణుడు తాను ప్రతి విశ్వము నందూ ప్రవేశించుట చేతనే సృష్టి సాధ్యమగునని వివరించియున్నాడు. అర్జునునికి శ్రీకృష్ణుని గొప్పతనము తెలుసు కనుక తాను విశ్వాసముతో అంగీకరించెను. కాని భవిష్యత్తులో ఎవరైనా శ్రీకృష్ణుడు సామాన్య మానవుడని భావించినచో,ఆయన మాటల యందు విశ్వాసము పెట్టరు. వారి సందేహాలను తొలగించుటకు ఆయనశ్రీకృష్ణున్ని తన విశ్వరూపాన్ని చూపించమని కోరెను. అర్జునుని భావాన్ని అర్థము చేసుకొన్న కృష్ణుడు తన విశ్వరూపమును చూపబోవుచున్నాడు. కాబట్టి ఎవరైనా నేను భగవంతుణ్ని అని అంటే వారు కూడా తాము ఇటువంటి విశ్వరూపాన్ని చూపవలసి ఉంటుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement