Saturday, May 4, 2024

గీతాసారం… (ఆడియోతో…)


అధ్యాయం 10, శ్లోకం 39

39.
యచ్చాపి సర్వభూతానాం
బీజం తదహమర్జున |
న తదస్తి వినా యత్స్యాత్‌
మయా భూతం చరాచరమ్‌ ||

తాత్పర్యము : ఇంకను ఓ అర్జునా! సర్వజీవులకు జన్మకారక బీజమును నేనే. స్థావర జంగమములలో నేను లేకండా ఏదియును స్థితిని కలిగియుండలేదు.

భాష్యము : ప్రతిదానికీ ఒక కారణముండును. అట్టి కారణము లేదా బీజమే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని శక్తులకు బాహ్యముగా ఏదీ స్థితిని కలిగి ఉండదు కాబ్టటి అతడు సర్వ శక్తిమంతుడు. అతని శక్తి లేకుండా కదిలేవి గాని, స్థిరముగా ఉండునవి గాని ఉండవు. కాబట్టి కృష్ణుని శక్తిపై ఆధారపడనిదిగా, లేదా కృష్ణుని కి సంబంధించనిదిగా కనిపించేదానిని ‘మాయ’ అందురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement