Friday, May 3, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 5, శ్లోకం 21.

బాహ్యస్పర్శేష్వసక్తాత్మా
వింత్యాత్మని యత్సుఖమ్‌ |
స బ్రహ్మయోగయుక్తాత్మా
సుఖమక్షయమశ్నుతే ||

తాత్పర్యము : అట్టి ముక్త పురుషుడు బాహ్యేంద్రియ సుఖమునకు ఆకర్షితుడు గాక ఆత్మ యందే సౌఖ్యముననుభవించు సదా ధ్యానమగ్నుడై యుండును. పరబ్రహ్మమును ధ్యానించు కారణమున ఆత్మదర్శి ఆవిధముగా అనంత సౌఖ్యము ననుభవించున ు.

భాష్యము : బ్రహ్మ యోగము లేతా కృష్ణ చైతన్యములో నున్న వ్యక్తి భగవత్సేవలో ఎంతగా మునిగిపోయి ఉంటాడంటే అతడు భౌతిక ఆనందములో ఆసక్తిని కోల్పోతాడు. భౌతిక జీవితములో అన్నింటికంటే ఉన్నతమైన సుఖము మైథున భోగము. ఈ ప్రపంచములో అందరినీ నడిపించేది ప్రోత్సాహపరచేది అదే. అయితే కృష్ణ చైతన్య వంతుడు మైథున సుఖము లేకుండానే వారికంటే ఎంతో ఉత్సాహముతో పనిచేయగలడు. అతడు దానిని పూర్తిగా పరిత్యజిస్తాడు. ఇదే ఆత్మ సాక్షాత్కారానికి పరీక్ష. ఎందువలనంటే ఆధ్యాత్మిక అవగాహన, మైథున భోగము పరస్పర విరుద్ధాలు. కాబట్టి ముక్త స్థితిలో ఉండే కృష్ణ చైతన్యవంతుడు శారీరక ఆనందము పట్ల ఆసక్తిని కలిగి ఉండడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement